Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 14:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 ఆ వెండితో మీకు నచ్చిన వాటిని కొనండి: పశువులు, గొర్రెలు, ద్రాక్షరసం లేదా మద్యం లేదా మీకు నచ్చింది ఏదైన. తర్వాత మీరు మీ కుటుంబీకులు అక్కడే మీ దేవుడైన యెహోవా సన్నిధిలో వాటిని తిని సంతోషించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 ఎద్దులకేమి గొఱ్ఱెలకేమి ద్రాక్షారసమునకేమి మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండి నిచ్చి, అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనముచేసి, నీవును నీ యింటివారును నీ యింటనుండు లేవీయులును సంతోషింపవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 ఎద్దులు, గొర్రెలు, ద్రాక్షారసం, మద్యం, వీటిలో మీరు కోరిన దానికి ఆ వెండిని ఇచ్చి, అక్కడ మీ దేవుడు యెహోవా సన్నిధిలో భోజనం చేసి, మీరు, మీ ఇంటివారు, మీ ఇంట్లో ఉండే లేవీయులు సంతోషించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

26 మీకు యిష్టం వచ్చింది ఏదైనా– ఆవులు, గొర్రెలు, ద్రాక్షారసం, మద్యం లేక మీరు కోరినది ఏ భోజనంగాని యింకేదైనాసరే కొనేందుకు ఆ ధనం వినియోగించండి. తర్వాత మీరు, మీ కుటుంబం మీ దేవుడైన యెహోవాతో కలిసి ఆ స్థలంలో భోజనంచేసి ఆనందించండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 ఆ వెండితో మీకు నచ్చిన వాటిని కొనండి: పశువులు, గొర్రెలు, ద్రాక్షరసం లేదా మద్యం లేదా మీకు నచ్చింది ఏదైన. తర్వాత మీరు మీ కుటుంబీకులు అక్కడే మీ దేవుడైన యెహోవా సన్నిధిలో వాటిని తిని సంతోషించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 14:26
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

వంద తలాంతుల వెండి, వెయ్యి తూముల వరకు గోధుమలు, వంద బాతుల ద్రాక్షరసం, వంద బాతుల ఒలీవ నూనె, లెక్కలేనంత ఉప్పు సరఫరా చెయ్యండి.


ఎడారిలో పేరాశకు లోనయ్యారు; పాడు ప్రదేశమది. దేవుడిని శోధించారు.


వెళ్లండి, సంతోషంగా మీ ఆహారాన్ని తినండి ఆనందకరమైన హృదయంతో మీ ద్రాక్షరసం త్రాగండి, ఎందుకంటే మీరు చేసే దాన్ని దేవుడు ముందుగానే ఆమోదించారు.


యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి అక్కడ అమ్ముతూ, కొంటూ ఉన్నవారినందరిని తరిమివేశారు. డబ్బు మార్చే వారి బల్లలను, గువ్వలను, అమ్మేవారి పీటలను ఆయన పడవేశారు.


వారు యెరూషలేము చేరిన తర్వాత, యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి అక్కడ అమ్ముతూ, కొంటూ ఉన్నవారినందరిని తరమడం ప్రారంభించారు. డబ్బు మార్చే వారి బల్లలను, గువ్వలను, అమ్మేవారి పీటలను ఆయన పడవేశారు.


వారిలా మన హృదయాలను చెడ్డ విషయాలపై నిలుపకుండా ఈ సంగతులు మనకు ఉదాహరణలుగా ఉన్నాయి.


అక్కడ మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు దాసీలు, భాగం గాని స్వాస్థ్యం గాని లేకుండా మీ ఇళ్ళలో ఉండే లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషించాలి.


అయితే మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆశీర్వాదం ప్రకారం, మీ ఇళ్ళలో ఉన్న పశువులను, జింకను లేదా దుప్పిని తిన్నట్లుగా మీకు ఇష్టం వచ్చినంత మాంసాన్ని తినవచ్చు. ఆచారరీత్య పవిత్రులైనవారు, అపవిత్రులైనవారు దానిని తినవచ్చు.


అయితే మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలంలోనే మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసదాసీలు, మీ పట్టణాల్లో ఉండే లేవీయులు, అందరు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో తిని, మీ చేతి పనులన్నిటిని బట్టి మీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషించాలి.


మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి, అక్కడ మీ దేవుడైన యెహోవా సన్నిధిలో మీరు, మీ కుటుంబాలు తిని, మీ చేతి పనులన్నిటిని బట్టి సంతోషించాలి.


మీ దశమభాగాన్ని వెండికి మార్చి, దానిని మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనే స్థలానికి తీసుకురావాలి.


నీకు మీ ఇంటివారికి మీ దేవుడైన యెహోవా అనుగ్రహించిన మేలును బట్టి మీరూ లేవీయులు అలాగే మీ మధ్య ఉన్న విదేశీయులు కలిసి సంతోషించాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ