Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ద్వితీ 12:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

30 వారు మీ ఎదుట నుండి నిర్మూలమైనప్పుడు, మీరు వారి పద్ధతులను అనుసరించి, “ఈ ప్రజలు తమ దేవుళ్ళను ఎలా సేవిస్తున్నారు? మేము కూడా అలాగే చేస్తాము” అని అంటూ చిక్కుల్లో పడిపోకుండా జాగ్రత్తపడండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

30 వారి దేవతలను ఆశ్ర యింపగోరి–ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసెదనని అనుకొనకుండ జాగ్రత్తగా ఉండవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

30 ఈ ప్రజలు తమ దేవుళ్ళను పూజిస్తున్నట్టే మేము కూడా వారి దేవుళ్ళను పూజిస్తాము అనుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

30 అయితే అది జరిగిన తర్వాత జాగ్రత్తగా ఉండండి. ఆ రాజ్యాలవారు పూజించిన దేవుళ్లను గూర్చి తెలుసుకోవటం ద్వారా మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవద్దు. వారు వారి దేవుళ్లను ఎలా పూజిస్తారో అది మీరు నేర్చుకొనేందుకు ప్రయత్నించవద్దు. వాళ్లు పూజించినట్టు పూజించాలనే ఆలోచన కూడా చేయవద్దు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

30 వారు మీ ఎదుట నుండి నిర్మూలమైనప్పుడు, మీరు వారి పద్ధతులను అనుసరించి, “ఈ ప్రజలు తమ దేవుళ్ళను ఎలా సేవిస్తున్నారు? మేము కూడా అలాగే చేస్తాము” అని అంటూ చిక్కుల్లో పడిపోకుండా జాగ్రత్తపడండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ద్వితీ 12:30
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరును కలుసుకోడానికి దమస్కు పట్టణానికి వెళ్లాడు. దమస్కు పట్టణంలో ఒక బలిపీఠాన్ని చూసి, దాని పోలిక, నమూనా, దాని నిర్మాణ విధానం అంతా యాజకుడైన ఊరియాకు పంపాడు.


ఆయన శాసనాలను, ఆయన తమ పూర్వికులతో చేసిన నిబంధనను, ఆయన పాటించమని హెచ్చరించిన ధర్మశాస్త్రాన్ని వారు నిరాకరించారు. అయోగ్యమైన విగ్రహాలను అనుసరించి అయోగ్యులయ్యారు. యెహోవా వారికి, “వారు చేసినట్లు మీరు చేయకూడదు” అని చెప్పినప్పటికి తమ చుట్టూ ఉన్న ప్రజల విధానాలను వారు అనుసరించారు.


మీరు వారి దేవుళ్ళ ముందు సాష్టాంగపడకూడదు వాటిని పూజించకూడదు, వారి ఆచారాలను పాటించకూడదు. మీరు వాటిని కూల్చివేసి వారి పవిత్ర రాళ్లను ముక్కలు చేయాలి.


యెహోవా ఇలా చెప్తున్నారు: “ఇతర దేశాల విధానాలను నేర్చుకోవద్దు ఆకాశంలో సూచనలను చూసి అవి భయపడినా, మీరు భయపడవద్దు.


మీ చుట్టూ ఉన్న జాతుల విధులను పాటించడానికి మీరు ఎవరి శాసనాలను అనుసరించకుండా ఎవరి విధులను పాటించలేదో ఆ యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.”


నేను వారిని ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలోకి నేను వారిని తీసుకువచ్చిన తర్వాత కూడా ఎత్తైన కొండను గాని గుబురుగా ఉన్న చెట్టును గాని వారు చూడగానే వాటికి బలులు అర్పణలు అర్పిస్తూ, పరిమళ ధూపాలను వేస్తూ పానార్పణలు చేస్తూ నాకు కోపం పుట్టించారు.


“ ‘ “మేము కట్టెను, రాయిని సేవించే దేశాల్లా, ప్రపంచంలోని జనాంగాల్లా ఉండాలని కోరుకుంటున్నాము” అని మీరంటున్నారు. కాని మీ మనస్సులో ఉన్నట్లు ఎప్పటికీ జరగదు.


మీరు నివసించిన ఈజిప్టులోని వారు చేసినట్లు మీరు చేయకూడదు, నేను మిమ్మల్ని తీసుకెళ్లే కనాను దేశంలోని వారు చేసినట్టు మీరు చేయకూడదు. వారి ఆచారాలను పాటించకూడదు.


నేను మీకు చెప్పినవి పాటించి, అక్కడ మీకన్నా ముందు నివసించినవారు పాటించిన హేయమైన ఆచారాల్లో దేనినైనా పాటించి వాటివలన మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకండి. నేను మీ దేవుడనైన యెహోవాను.’ ”


ఆ దేశవాసులందర్నీ తరిమేయాలి. వారి రాతి విగ్రహాలను, కోట విగ్రహాలను నాశనం చేయాలి వారి క్షేత్రాలను పడగొట్టాలి.


ఈ లోకపు తీరును అనుసరించవద్దు కాని మీ మనస్సును నూతనపరచుకోవడం ద్వారా మార్పు చెందండి. అప్పుడు మీరు మంచిదైన, సంతోషకరమైన పరిపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోగలరు.


కాబట్టి మీరు, ఇకమీదట దేవుని భయంలేని యూదేతరులు నడుచుకొనునట్లు వ్యర్థమైన ఆలోచనలతో నడుచుకొనకూడదని ప్రభువు ఇచ్చిన అధికారంతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.


జాగ్రత్తపడండి, లేదా మీరు మోసపోయి ఇతర దేవుళ్ళ వైపు తిరిగి వాటిని పూజించి సేవిస్తారు.


మీరు దాడి చేసి వెళ్లగొట్టబోతున్న జనాంగాలను మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి తొలగిస్తారు. అయితే మీరు వారిని వెళ్లగొట్టి వారి దేశంలో స్థిరపడిన తర్వాత,


వారి విధానాల్లో మీ దేవుడనైన యెహోవాను మీరు ఆరాధించకూడదు, ఎందుకంటే వారు తమ దేవుళ్ళను పూజిస్తూ యెహోవా ద్వేషించే అసహ్యమైన సమస్తాన్ని చేస్తారు. వారు తమ కుమారులను కుమార్తెలను తమ దేవుళ్ళకు బలిగా అగ్నిలో కాల్చివేస్తారు.


మీ దేవుడైన యెహోవా మీకిచ్చే దేశంలో మీరు ప్రవేశించాక అక్కడి దేశాల అసహ్యకరమైన మార్గాలను అనుకరించడం నేర్చుకోకండి.


లేకపోతే తమ దేవుళ్ళకు చేసే హేయ క్రియలను మీకు నేర్పుతారు, మీరు మీ దేవుడైన యెహోవాకు విరోధంగా పాపాలు చేస్తారు, అందుకే వారిని నిర్మూలించమని చెప్తున్నాను.


మీ దేవుడైన యెహోవా మీకు అప్పగించే ప్రజలందరినీ పూర్తిగా నాశనం చేయాలి. వారి మీద దయ చూపించకూడదు, వారి దేవుళ్ళను సేవించకూడదు, ఎందుకంటే అది మీకు ఉరిగా బిగుసుకుంటుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ