Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




దానియేలు 2:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 అప్పుడు జ్యోతిష్యులు రాజుకు జవాబిస్తూ, “రాజు చిరకాలం జీవించు గాక! మీ దాసులకు కల ఏంటో చెప్పండి, మేము దాని భావం చెప్తాం” అన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 కల్దీయులు సిరియాబాషతో ఇట్లనిరి– రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవియ్యుడి; మేము దాని భావమును తెలియజేసెదము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 అప్పుడు జోతిష్యులు సిరియా భాషలో “రాజు చిరకాలం జీవించు గాక. మీ దాసులమైన మాకు ఆ కలలు ఏమిటో చెప్పండి. దాని భావం మీకు వివరిస్తాం” అన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 తర్వాత కల్దీయులు రాజుతో సిరియా భాషలో, “రాజా, వర్థిల్లుము. మేము నీ సేవకులం. దయచేసి నీ కల ఏమిటో చెప్పుము. ఆ తర్వాత దాని అర్థం మేము చెబుతాము” అని అన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 అప్పుడు జ్యోతిష్యులు రాజుకు జవాబిస్తూ, “రాజు చిరకాలం జీవించు గాక! మీ దాసులకు కల ఏంటో చెప్పండి, మేము దాని భావం చెప్తాం” అన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




దానియేలు 2:4
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

లాబాను దానికి యెగర్ శాహదూతా అని పేరు పెట్టాడు, యాకోబు దానికి గలీదు అని పేరు పెట్టాడు.


ఉదయం అతని మనస్సు కలవరపడింది, కాబట్టి ఈజిప్టులోని మాంత్రికులను, జ్ఞానులను అందరిని పిలిపించాడు. ఫరో తన కలలు వారికి చెప్పాడు, కానీ వాటి భావం ఎవరు చెప్పలేకపోయారు.


ఈ రోజు అతడు వెళ్లి విస్తారమైన పశువులను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలి ఇచ్చాడు. రాజకుమారులందరినీ, సేనాధిపతులను, యాజకుడైన అబ్యాతారును ఆహ్వానించాడు. ఇప్పుడు వారు అతనితో తింటూ త్రాగుతూ, ‘రాజైన అదోనియా చిరకాలం జీవించు గాక!’ అని అంటున్నారు.


అప్పుడు బత్షెబ తలవంచి, రాజు ఎదుట సాష్టాంగపడి, “నా ప్రభువా, రాజైన దావీదు చిరకాలం జీవించును గాక!” అని అన్నది.


అప్పుడు హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నా, యోవాహు సైన్యాధిపతితో, “నీ దాసులమైన మాకు అరామిక్ భాష అర్థం అవుతుంది కాబట్టి ఆ భాషలో మాట్లాడండి. గోడ మీద ఉన్న ప్రజలకు వినిపించేలా హెబ్రీ భాషలో మాట్లాడకండి” అన్నారు.


పర్షియా రాజైన అర్తహషస్త పరిపాలిస్తున్న సమయంలో బిష్లాము, మిత్రిదాతు, టాబెయేలు వారి సహచరులు అర్తహషస్తకు ఉత్తరం వ్రాశారు. ఆ ఉత్తరం అరామిక్ లిపిలో, అరామిక్ భాషలో వ్రాయబడింది.


నేను రాజుతో, “రాజు చిరకాలం జీవించును గాక! నా పూర్వికులను పాతిపెట్టిన పట్టణం శిథిలావస్థలో ఉండి, దాని ద్వారాలు అగ్నికి ఆహుతి అయినప్పుడు నా ముఖం ఎందుకు విచారంగా కనిపించకూడదు?” అన్నాను.


అప్పుడు ఎల్యాకీము, షెబ్నా, యోవాహు సైన్యాధిపతితో, “నీ దాసులమైన మాకు అరామిక్ భాష అర్థం అవుతుంది కాబట్టి ఆ భాషలో మాట్లాడండి. గోడ మీద ఉన్న ప్రజలకు వినిపించేలా హెబ్రీ భాషలో మాట్లాడకండి” అన్నారు.


నేనే అబద్ధ ప్రవక్తల సూచనలను భంగం చేస్తాను, సోదె చెప్పేవారిని వెర్రివారిగా చేస్తాను. జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి చదువును వ్యర్థం చేసేది నేనే.


ఆ యువకులు ఏ శారీరక లోపం లేనివారై, అందంగా ఉండి, విద్యా ప్రావీణ్యత కలిగి తెలివి కలవారై, త్వరగా గ్రహించే వారై రాజభవనంలో సేవ చేయటానికి సామర్థ్యం కలిగి ఉండాలి. వారికి బబులోనీయుల భాష చదవడం వ్రాయడం నేర్పాలి.


అందుకు వారు, “రాజు తన దాసులకు కలను చెబితే మేము దాని భావం వివరిస్తాం” అన్నారు.


వారు నెబుకద్నెజరు రాజు దగ్గరకు వచ్చి అన్నారు, “రాజు చిరకాలం జీవించు గాక!


అప్పుడు దానియేలు (బెల్తెషాజరు అని కూడా పిలువబడ్డాడు) కొంత సమయం కలవరపడ్డాడు, అతని తలంపులు అతనికి భయం కలిగించాయి. అప్పుడు రాజు అన్నాడు, “బెల్తెషాజరూ, ఈ కలకు గాని దాని భావానికి కలవరపడవద్దు.” బెల్తెషాజరు జవాబిస్తూ అన్నాడు, “నా ప్రభువా, ఆ కల మీ శత్రువులకు, దాని అర్థం మీ విరోధులకు చెందితే ఎంత బాగుండేది!


మాంత్రికులు, శకునగాళ్లు, కల్దీయ జ్యోతిష్యులు, సోదె చెప్పేవారు వచ్చినప్పుడు నా కల వారికి చెప్పాను. కాని వారు దాని భావం చెప్పలేకపోయారు.


నేను అతనితో, “శకునగాండ్రకు అధిపతివైన బెల్తెషాజరూ, పవిత్ర దేవుళ్ళ ఆత్మ నీలో ఉందని, మర్మం ఏదైనా నీకు కష్టం కాదని నాకు తెలుసు. ఇదిగో నా కల; దాని భావం నాకు చెప్పు.


రాజు, అతని అధికారుల స్వరాలు విని, రాణి విందుశాలకు వచ్చింది, “రాజు చిరకాలం జీవించు గాక! కలవరపడకండి! నిబ్బరంగా ఉండండి! అని ఆమె అన్నది.


అప్పుడు రాజు యొక్క జ్ఞానులందరు వచ్చారు, కాని గోడ మీద ఆ రాతను చదవలేకపోయారు, దాని అర్థం చెప్పలేకపోయారు.


దానియేలు జవాబిస్తూ, “రాజు చిరకాలం జీవించు గాక!


కాబట్టి ఈ నిర్వాహకులు, అధిపతులు గుంపుగా రాజు దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు, “రాజైన దర్యావేషు చిరకాలం జీవించు గాక!


రానున్న ముప్పై రోజుల్లో ఎవరైనా మీకు తప్ప ఏ దేవునికైనా, మనిషికైనా ప్రార్థిస్తే వారు సింహాల గుహలో పడవేయబడాలని రాజు ఒక ఆదేశం జారీ చేసి, దానిని అమల్లోకి తీసుకురావాలని రాజ్య నిర్వాహకులు, ప్రముఖులు, అధిపతులు, సలహాదారులు, రాష్ట్ర అధికారులు అందరం ఏకీభవించి కోరుతున్నాము.


ఆయన ముందు వెళ్లే జనసమూహం ఆయనను వెంబడించేవారు బిగ్గరగా, “దావీదు కుమారునికి హోసన్నా!” “ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!” “సర్వోన్నతమైన స్థలాల్లో హోసన్నా!” అని కేకలు వేశారు.


అప్పుడు సమూయేలు ప్రజలందరితో, “యెహోవా ఏర్పరచిన వానిని మీరు చూశారా? ఇశ్రాయేలీయులందరిలో అతనివంటివాడు మరొకడు లేడు” అని చెప్పాడు. అప్పుడు ప్రజలు, “రాజు దీర్ఘకాలం జీవించు గాక” అని కేకలు వేశారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ