దానియేలు 11:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 కొన్ని సంవత్సరాలకు వారిద్దరు మిత్రులవుతారు. అంతేగాక దక్షిణ రాజు కుమార్తె ఉత్తర రాజుతో సంబంధాలు సరిచేయడానికి అతని దగ్గరకు వెళ్తుంది, కాని ఆమె అతని మీద తన ప్రభావాన్ని నిలుపుకోదు, అతడు, అతని అధికారం నిలువదు. ఆ రోజుల్లో ఆమె, ఆమె రాజ అంగరక్షకులు, ఆమె తండ్రి, ఆమెకు సహాయపడినవాడు తృణీకరించబడతారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు. మరియు వారు ఉభయులు సమాధానపడవలెనని కోరగా దక్షిణదేశపు రాజకుమార్తె ఉత్తరదేశపు రాజునొద్దకు వచ్చును. అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు; అతడైనను అతని భుజబలమైనను నిలువదు; వారు ఆమెను, ఆమెను తీసికొని వచ్చిన వారిని, ఆమెను కనినవారిని, ఈ కాలమందు ఆమెను బలపరచిన వారిని అప్పగించెదరు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 కొన్ని సంవత్సరాలైన తరువాత సమయం వచ్చినప్పుడు వారు సంధి చేసుకోవాలని కలుసుకుంటారు. దక్షిణదేశం రాజకుమార్తె ఆ ఒప్పందాన్ని స్థిర పరచడం కోసం ఉత్తరదేశం రాజు దగ్గరికి వస్తుంది. అయినా ఆమె తన బలం కోల్పోయి దిక్కులేనిదిగా విడువబడుతుంది. ఆమె, ఆమెను తీసుకు వచ్చినవారు, ఆమె తండ్రి, ఆమెకు ఆసరాగా ఉన్నవారు అలానే అవుతారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్6 “కొన్ని సంవత్సరాల తర్వాత, ఈ ఇద్దరు రాజులు ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. దక్షిణ రాజు యొక్క కుమార్తె ఉత్తర రాజుయొద్ద ఒప్పందం చేసు కటానికి వస్తుంది. కాని ఆమె తన బలాన్ని నిలుపుకోదు. అతడు తన మాటను, బలాన్ని నిలుపుకోడు. కాని, ఆమెను, ఆమెను తెచ్చిన వారిని, ఆమెను కన్న వారిని, ఆమెను బలపరచిన వారిని, ఆ సమయాల్లో విడిచిపెడతారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 కొన్ని సంవత్సరాలకు వారిద్దరు మిత్రులవుతారు. అంతేగాక దక్షిణ రాజు కుమార్తె ఉత్తర రాజుతో సంబంధాలు సరిచేయడానికి అతని దగ్గరకు వెళ్తుంది, కాని ఆమె అతని మీద తన ప్రభావాన్ని నిలుపుకోదు, అతడు, అతని అధికారం నిలువదు. ఆ రోజుల్లో ఆమె, ఆమె రాజ అంగరక్షకులు, ఆమె తండ్రి, ఆమెకు సహాయపడినవాడు తృణీకరించబడతారు. အခန်းကိုကြည့်ပါ။ |