Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆమోసు 7:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 “ఇస్సాకు క్షేత్రాలు నాశనమవుతాయి ఇశ్రాయేలు పరిశుద్ధ స్థలాలు పాడైపోతాయి; యరొబాము ఇంటి మీదికి నా కత్తి ఎత్తుతాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 ఇస్సాకు సంతతివారు ఏర్పరచిన ఉన్నతస్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితస్థలములు నాశమగును. నేను ఖడ్గము చేతపట్టుకొని యరొబాము ఇంటివారిమీద పడుదును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 ఇస్సాకు వంశం వారి ఉన్నత స్థలాలు నాశనమవుతాయి. ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠిత స్థలాలు పాడైపోతాయి. యరొబాము వంశానికి విరోధంగా కత్తి ఎత్తుతాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 ఇస్సాకు వంశస్థులు ఏర్పాటు చేసిన ఉన్నత ప్రదేశాలు నాశనం చేయబడతాయి. ఇశ్రాయేలు పవిత్ర స్థలాలన్నీ రాళ్ల గుట్టల్లా మార్చబడతాయి. నేను యరొబాము వంశంమీద పడి వారిని కత్తులతో చంపుతాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 “ఇస్సాకు క్షేత్రాలు నాశనమవుతాయి ఇశ్రాయేలు పరిశుద్ధ స్థలాలు పాడైపోతాయి; యరొబాము ఇంటి మీదికి నా కత్తి ఎత్తుతాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆమోసు 7:9
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాబట్టి ఇశ్రాయేలు తనకున్నదంతటితో బయలుదేరాడు, బెయేర్షేబకు వచ్చాక, తన తండ్రియైన ఇస్సాకు దేవునికి బలులు అర్పించారు.


అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలనే చేస్తూ వచ్చాడు.


మీ ప్రజలు కొద్ది కాలమే మీ పరిశుద్ధ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు కాని ఇప్పుడు మా శత్రువులు మీ పరిశుద్ధాలయాన్ని త్రొక్కివేశారు.


“మేము అపకీర్తి పాలయ్యాము, ఎందుకంటే మేము అవమానించబడ్డాము సిగ్గు మా ముఖాలను కప్పివేస్తుంది, ఎందుకంటే యెహోవా మందిరంలోని పవిత్ర స్థలాల్లోకి విదేశీయులు ప్రవేశించారు.”


ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలు పర్వతాల్లారా, పర్వతాలకు, కొండలకు, కనుమలకు, లోయలకు ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నేను మీ మీదికి ఖడ్గాన్ని రప్పించి, మీ క్షేత్రాలను నాశనం చేస్తాను.


ఇశ్రాయేలు పాపానికి ప్రతిరూపాలైన దుష్టత్వం కలిగిన క్షేత్రాలు నాశనం చేయబడతాయి. ముండ్ల చెట్లు, గచ్చపొదలు పెరిగి వారి బలిపీఠాలను కప్పుతాయి. అప్పుడు వారు పర్వతాలతో, “మమ్మల్ని కప్పండి!” అని కొండలతో, “మామీద పడండి!” అని అంటారు.


“ఇశ్రాయేలు పాపాలను శిక్షించే రోజున బేతేలులోని బలిపీఠాలను నేను నాశనం చేస్తాను; ఆ బలిపీఠపు కొమ్మలు విరగ్గొట్టబడి నేలరాలుతాయి.


బేతేలును ఆశ్రయించకండి; గిల్గాలు క్షేత్రాలకు వెళ్లకండి, బెయేర్షేబకు ప్రయాణించకండి. గిల్గాలు ప్రజలు ఖచ్చితంగా బందీలుగా వెళ్తారు, విపత్తులతో బేతేలు శూన్యంగా మారుతుంది.”


ఎందుకంటే ఆమోసు చెప్పేది ఇదే: “ ‘యరొబాము ఖడ్గం చేత చస్తాడు, ఇశ్రాయేలు ప్రజలు తమ సొంత దేశం నుండి బందీలుగా దేశాంతరం పోతారు.’ ”


బేతేలులో ప్రవచించడం ఆపు, ఎందుకంటే రాజు గుడి, రాజభవనం ఇక్కడే ఉన్నాయి” అని చెప్పాడు.


సమరయ దోషానికి కారణమైనదాని తోడని, ‘దాను దేవుని తోడు’ అని, ‘బెయేర్షేబ దేవుని తోడు’ అని ప్రమాణం చేసేవారు మళ్ళీ లేవకుండా కూలిపోతారు.”


బలిపీఠం దగ్గర ప్రభువు నిలబడి ఉండడం నేను చూశాను, ఆయన ఇలా అన్నారు: “గడపలు కదిలి పోయేలా, స్తంభాల పైభాగాలను కొట్టు. వాటిని ప్రజలందరి తలల మీద పడవేయు; మిగిలిన వారిని నేను ఖడ్గంతో హతం చేస్తాను. ఒక్కడు కూడా పారిపోలేడు, ఎవ్వడూ తప్పించుకోలేడు.


దీనంతటికీ యాకోబు అతిక్రమం, ఇశ్రాయేలు ప్రజల పాపాలే కారణం. యాకోబు అతిక్రమం ఏంటి? అది సమరయ కాదా? యూదా యొక్క క్షేత్రం ఏంటి? అది యెరూషలేము కాదా?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ