Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆమోసు 7:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 కాబట్టి యెహోవా జాలిపడ్డారు. “ఇది కూడా జరగదు” అని ప్రభువైన యెహోవా అన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి– అదియు జరుగదని సెలవిచ్చెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 దీని గురించి యెహోవా మనస్సు మార్చుకుని “అది కూడా జరగదు” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 పిమ్మట యెహోవా ఈ విషయంలో తన మనస్సు మార్చుకొని “అది కూడా జరగదు” అని అన్నాడు!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 కాబట్టి యెహోవా జాలిపడ్డారు. “ఇది కూడా జరగదు” అని ప్రభువైన యెహోవా అన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆమోసు 7:6
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు యెహోవా, “నేను సృజించిన నరులను, వారితో పాటు జంతువులను, పక్షులను, నేలపై ప్రాకే జీవులను భూమి మీద నుండి తుడిచివేస్తాను, వాటిని చేసినందుకు నేను బాధపడుతున్నాను” అని అనుకున్నారు.


దేవుడు యెరూషలేమును నాశనం చేయడానికి ఒక దూతను పంపారు. అయితే ఆ దూత దానిని నాశనం చేస్తున్నప్పుడు, జరిగిన కీడును చూసి యెహోవా మనస్సు కరిగి ప్రజలను నాశనం చేస్తున్న దూతతో, “ఇక చాలు! నీ చేయి వెనుకకు తీసుకో” అని చెప్పారు. ఆ సమయంలో యెహోవా దూత యెబూసీయుడైన ఒర్నాను నూర్పిడి కళ్ళం దగ్గర నిలబడ్డాడు.


దేవుడు తన నిబంధనను తలచుకొన్నాడు. వారి నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నాడు. తన మారని ప్రేమను బట్టి వారిని కనికరించాడు.


యెహోవా తన ప్రజలకు శిక్ష విముక్తి జరిగిస్తారు, ఆయన సేవకులపై దయ కలిగి ఉంటారు.


అయినా దేవుడు దయ చూపించి; వారి పాపాలను క్షమించారు వారిని నాశనం చేయలేదు. మాటిమాటికి ఆయన తన కోపాన్ని అదుపు చేసుకున్నారు ఆయన పూర్తి ఉగ్రతను రేపలేదు.


యెహోవా, మా దగ్గరకు తిరిగి రండి! ఇంకెంత కాలం? మీ దాసుల మీద కనికరం చూపండి.


అప్పుడు యెహోవా మనస్సు మార్చుకొని తన ప్రజలకు తాను తెస్తానని చెప్పిన విపత్తును వారి మీదికి తేలేదు.


“మరి యూదా రాజైన హిజ్కియా గాని, యూదా దేశస్థుడు ఎవడైనా గాని, ఆ ప్రవక్తను చంపారా? ఆ రాజైన హిజ్కియా భయభక్తులతో యెహోవా దయ కోసం ప్రార్ధన చేశాడు గదా! యెహోవా మనస్సు మార్చుకుని, వారి మీదికి రప్పించవలసిన కీడును ఆపివేయలేదా? మనకు మనమే మన మీదికి భయంకరమైన విపత్తు తెచ్చుకోబోతున్నాం!”


‘మీరు ఈ దేశంలోనే ఉంటే, నేను మిమ్మల్ని కడతాను, కూల్చివేయను; నేను మిమ్మల్ని నాటుతాను, పెరికివేయను, ఎందుకంటే నేను మీకు కలిగించిన విపత్తు గురించి బాధపడ్డాను.


మీ వస్త్రాలను కాదు, మీ హృదయాలను చీల్చుకుని, మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి రండి, ఆయన కృపా కనికరం గలవాడు, త్వరగా కోప్పడడు, మారని ప్రేమగలవాడు ఆయన జాలిపడుతూ విపత్తును పంపించకుండా ఉంటారు.


కాబట్టి యెహోవా జాలిపడ్డారు. “ఇది జరగదు” అని యెహోవా అన్నారు.


ఆయన నాకు చూపించింది ఇదే: ప్రభువు తన చేతిలో కొలనూలు పట్టుకుని, మట్టపు గుండు ప్రకారం కట్టబడిన గోడ దగ్గర నిలబడి ఉన్నారు.


వారు చేసింది, వారు ఎలా తమ చెడుతనాన్ని విడిచిపెట్టారో దేవుడు చూసి తన మనస్సు మార్చుకొని, ఆయన వారికి మీదికి రప్పిస్తానని చెప్పిన కీడును రానివ్వలేదు.


అతడు యెహోవాకు ప్రార్థన చేస్తూ అన్నాడు, “యెహోవా, ఇలా జరుగుతుందని నేను నా దేశంలో ఉన్నప్పుడే చెప్పలేదా? అందుకే నేను తర్షీషుకు పారిపోవడానికి ప్రయత్నించాను. మీరు కృపాకనికరంగల దేవుడని, త్వరగా కోప్పడరని, మారని ప్రేమ గలవారని, కీడు కలిగించకుండా మానివేస్తారని నాకు తెలుసు.


తర్వాత ఇశ్రాయేలీయులు తమ మధ్యలో ఉన్న ఇతర దేవుళ్ళను తొలగించి యెహోవాను సేవించారు. యెహోవా వారు అనుభవిస్తున్న శ్రమను ఇక సహించలేకపోయారు.


యెహోవా వారి కోసం న్యాయాధిపతిని పుట్టించినప్పుడు, ఆయన ఆ న్యాయాధిపతితో ఉంటూ, అతడు జీవించినంత కాలం వారిని తమ శత్రువుల చేతిలో నుండి రక్షించారు; ఎందుకంటే శత్రువులు వారిని అణచివేస్తూ బాధిస్తుండగా యెహోవా వారి వేదన చూసి జాలిపడ్డారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ