Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆమోసు 3:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 “ఇశ్రాయేలు పాపాలను శిక్షించే రోజున బేతేలులోని బలిపీఠాలను నేను నాశనం చేస్తాను; ఆ బలిపీఠపు కొమ్మలు విరగ్గొట్టబడి నేలరాలుతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 ఇశ్రాయేలువారు చేసిన దోషములనుబట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును; ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 “ఇశ్రాయేలు పాపాలను నేను శిక్షించే రోజు, బేతేలులోని బలిపీఠాలను కూడా నేను శిక్షిస్తాను. బలిపీఠం కొమ్ములు విరిగిపోయి నేలరాలతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 ఇశ్రాయేలు పాపం చేసింది. వారి పాపాలకు నేను వారిని శిక్షిస్తాను. బేతేలులోవున్న బలిపీఠాలనుకూడా నేను నాశనం చేస్తాను. బలిపీఠపు కొమ్ములు నరికివేయబడతాయి. అవి కింద పడతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 “ఇశ్రాయేలు పాపాలను శిక్షించే రోజున బేతేలులోని బలిపీఠాలను నేను నాశనం చేస్తాను; ఆ బలిపీఠపు కొమ్మలు విరగ్గొట్టబడి నేలరాలుతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆమోసు 3:14
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

బేతేలులో ఉన్న బలిపీఠాన్ని, ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము కట్టిన పూజా స్థలాన్ని కూడా అతడు పడగొట్టాడు. ఆ క్షేత్రాన్ని కాల్చివేసి పొడి చేశాడు, అషేరా స్తంభాన్ని కూడా కాల్చివేశాడు.


ఇదంతా ముగిసిన తర్వాత అక్కడున్న ఇశ్రాయేలీయులు యూదా పట్టణాలకు వెళ్లి పవిత్ర రాళ్లను పగులగొట్టి, అషేరా స్తంభాలను పడగొట్టారు. వారు యూదా, బెన్యామీను, ఎఫ్రాయిం, మనష్షేలలో ఉన్న క్షేత్రాలను బలిపీఠాలను నాశనం చేశారు. వాటన్నిటినీ నాశనం చేసిన తర్వాత, ఇశ్రాయేలీయులు తమ సొంత పట్టణాలకు వారి సొంత స్వాస్థ్యాలకు తిరిగి వచ్చారు.


నీవు వెళ్లి, నేను నీకు చెప్పిన చోటికి ప్రజలను నడిపించు, నా దూత మీకు ముందుగా వెళ్తాడు. అయితే నేను శిక్ష విధించవలసిన సమయం వచ్చినప్పుడు వారి పాపాలకు వారికి శిక్ష విధిస్తాను” అని సమాధానం ఇచ్చారు.


తాకట్టు పెట్టిన బట్టలు అప్పగించకుండా, ప్రతి బలిపీఠం దగ్గర వాటిని పరుచుకొని పడుకుంటారు. వారు జరిమానాలతో కొనుక్కున్న ద్రాక్షరసాన్ని, తమ దేవుని మందిరంలోనే త్రాగుతారు.


“బేతేలుకు వెళ్లి పాపం చేయండి; గిల్గాలుకు వెళ్లి ఇంకా ఎక్కువ పాపం చేయండి. ప్రతి ఉదయం మీ బలులు తీసుకరండి, మూడు సంవత్సరాలకు ఒకసారి మీ దశమ భాగాల్ని తీసుకురండి.


తర్వాత బేతేలు యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబాముకు ఇలా వర్తమానం పంపాడు: “ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనే ఆమోసు నీ మీద కుట్ర పన్నుతున్నాడు. దేశం అతని మాటలన్నిటిని భరించలేకపోతుంది.


బేతేలులో ప్రవచించడం ఆపు, ఎందుకంటే రాజు గుడి, రాజభవనం ఇక్కడే ఉన్నాయి” అని చెప్పాడు.


“ఇస్సాకు క్షేత్రాలు నాశనమవుతాయి ఇశ్రాయేలు పరిశుద్ధ స్థలాలు పాడైపోతాయి; యరొబాము ఇంటి మీదికి నా కత్తి ఎత్తుతాను.”


బలిపీఠం దగ్గర ప్రభువు నిలబడి ఉండడం నేను చూశాను, ఆయన ఇలా అన్నారు: “గడపలు కదిలి పోయేలా, స్తంభాల పైభాగాలను కొట్టు. వాటిని ప్రజలందరి తలల మీద పడవేయు; మిగిలిన వారిని నేను ఖడ్గంతో హతం చేస్తాను. ఒక్కడు కూడా పారిపోలేడు, ఎవ్వడూ తప్పించుకోలేడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ