Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ఆమోసు 2:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 నేను మోయాబు మీదికి అగ్నిని పంపుతాను, అది కెరీయోతు కోటలను దగ్ధం చేస్తుంది. యుద్ధ నినాదాల మధ్యలో, బూర శబ్దం వినబడినప్పుడు, మోయాబు గొప్ప కలవరంతో అంతరిస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 మోయాబుమీద నేను అగ్నివేసెదను, అది కెరీయోతు నగరులను దహించి వేయును. గొల్లును రణకేకలును బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 మోయాబు మీద నేను అగ్ని పంపిస్తాను. అది కెరీయోతు ప్రాకారాలను కాల్చేస్తుంది. యుద్ధ ధ్వనులూ బాకానాదం వినబడుతుంటే మోయాబు హాహాకారాలు చేస్తూ అంతరించి పోతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 కావున మోయాబులో నేను అగ్నిని రగుల్చుతాను. ఆ అగ్ని కెరీయోతు ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది. భయంకరమైన అరుపులు, బూర నాదాలు వినబడతాయి. మోయాబు చనిపోతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 నేను మోయాబు మీదికి అగ్నిని పంపుతాను, అది కెరీయోతు కోటలను దగ్ధం చేస్తుంది. యుద్ధ నినాదాల మధ్యలో, బూర శబ్దం వినబడినప్పుడు, మోయాబు గొప్ప కలవరంతో అంతరిస్తుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ఆమోసు 2:2
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

యుద్ధంలో వాడిన వీరుల చెప్పులు రక్తంలో చుట్టబడిన బట్టలు మంటలో వేయబడతాయి అగ్నికి ఇంధనంగా అవుతాయి.


కెరీయోతుకు, బొస్రాకు దూరంగా దగ్గరగా ఉన్న మోయాబులోని అన్ని పట్టణాలకు శిక్ష విధించబడుతుంది.


“నిమ్రీములోని నీళ్లు కూడా ఎండిపోయాయి కాబట్టి హెష్బోను నుండి ఎల్యాలెహు యాహాజుల వరకు, సోయరు నుండి హొరొనయీము, ఎగ్లత్-షెలీషియాల వరకు, వారి కేకలు వినిపిస్తున్నాయి.


కెరీయోతు స్వాధీనం చేసుకోబడుతుంది, బలమైన కోటలు వారి స్వాధీనం అవుతాయి. ఆ రోజు మోయాబు యోధుల హృదయాలు ప్రసవ వేదనలో ఉన్న స్త్రీ హృదయంలా ఉంటాయి.


“పారిపోయినవారు హెష్బోను నీడలో బలహీనులై నిలబడి ఉన్నారు, హెష్బోను నుండి అగ్ని, సీహోను మధ్య నుండి మంటలు బయలుదేరాయి. అది మోయాబు నొసళ్లను, అహంకారుల పుర్రెలను కాల్చివేస్తుంది.


“ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘మోయాబీయులు శేయీరు పట్టణస్థులు, “యూదా వారు కూడా ఇతర జనాల్లాగానే తయారయ్యారు” అన్నారు కాబట్టి,


నేను రబ్బా ప్రాకారాలను తగలబెడతాను, యుద్ధం రోజున యుద్ధ నినాదాల మధ్యలో, తుఫాను రోజున పెనుగాలి వీస్తూ ఉన్నప్పుడు, అగ్ని దాని కోటలను దగ్ధం చేస్తుంది.


నేను హజాయేలు ఇంటి మీదికి అగ్నిని పంపుతాను, అది బెన్-హదదు కోటలను దగ్ధం చేస్తుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ