Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




అపొస్తలుల 20:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 పౌలు మిలేతు నుండి ఎఫెసు సంఘ పెద్దలకు వర్తమానం పంపి వారిని పిలిపించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 అతడు మిలేతునుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 అతడు మిలేతులో ఉండగానే ఎఫెసులోని పెద్దలకు కబురు పెట్టి వారిని పిలిపించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 పౌలు కొందర్ని మిలేతునుండి ఎఫెసుకు పంపి అక్కడున్న సంఘ పెద్దల్ని పిలిపించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 పౌలు మిలేతు నుండి ఎఫెసు సంఘ పెద్దలకు వర్తమానం పంపి వారిని పిలిపించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

17 పౌలు మిలేతు నుండి ఎఫెసు సంఘ పెద్దలకు వర్తమానం పంపి వారిని పిలిపించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




అపొస్తలుల 20:17
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాబట్టి వారు బర్నబా సౌలుల ద్వారా ఆ సహాయాన్ని అక్కడి సంఘ పెద్దలకు పంపించారు.


పౌలు బర్నబాలు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ప్రతి సంఘంలో సంఘ పెద్దలను నియమించి, వారు నమ్మిక ఉంచిన ప్రభువుకు వారిని అప్పగించారు.


వారితో ఈ ఉత్తరాన్ని పంపించారు: అపొస్తలులు, మీ సహోదరులైన సంఘపెద్దలు, అంతియొకయలోను, సిరియాలోను, కిలికియ ప్రాంతాల్లో నివసించే యూదేతరులలోని విశ్వాసులకు, శుభములు.


వారు యెరూషలేము చేరుకొన్నప్పుడు, సంఘస్థులు అపొస్తలులు సంఘపెద్దలు వారిని చేర్చుకున్నారు. అక్కడ ఉన్నవారందరికి దేవుడు తమ ద్వారా జరిగించిన వాటన్నిటిని వివరించారు.


కాబట్టి ఈ ప్రశ్నను గురించి చర్చించడానికి అపొస్తలులు సంఘపెద్దలు సమావేశమయ్యారు.


వారు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తూ, యెరూషలేములోని అపొస్తలుల సంఘపెద్దల నిర్ణయాలను ప్రజలు పాటించడం కోసం అప్పగించారు.


వారు ఎఫెసుకు చేరుకున్నాక, పౌలు అకుల ప్రిస్కిల్లను అక్కడ విడిచిపెట్టాడు. తాను ఒక్కడే సమాజమందిరంలోనికి వెళ్లి యూదులతో తర్కించేవాడు.


మరుసటిరోజు మేము అక్కడినుండి ఓడలో బయలుదేరి కీయోసు చేరి, మరుసటిరోజు సమొసును దాటి, ఆ తర్వాత రోజు మిలేతు చేరుకొన్నాము.


అయితే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాచుకుంటూ పరిశుద్ధాత్మ మీకు అప్పగించిన మందను సంఘపెద్దలుగా కాయండి. దేవుడు తన స్వరక్తాన్ని క్రయధనంగా చెల్లించి కొన్న ఆయన సంఘానికి కాపరులుగా ఉండండి.


సంఘాన్ని నడిపించే సంఘపెద్దలు, మరి ముఖ్యంగా వాక్యాన్ని ప్రకటించేవారు వాక్యాన్ని బోధించేవారు రెండింతల గౌరవానికి పాత్రులు.


నేను నిన్ను క్రేతులో విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం, ఇంకా పూర్తి చేయవలసిన వాటిని క్రమపరచి, ప్రతి పట్టణంలో సంఘ పెద్దలను నియమించు.


మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? అయితే వారు సంఘ పెద్దలను పిలిపించాలి. ఆ పెద్దలు ప్రభువు పేరిట వారికి నూనె రాసి వారి కోసం ప్రార్థన చేయాలి.


తోటి సంఘపెద్దగా, క్రీస్తు పడిన శ్రమలకు సాక్షినై ఉండి, ప్రత్యక్షం కాబోతున్న మహిమలో భాగం పంచుకోబోతున్న నేను మీ సంఘ పెద్దలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే:


పెద్దనైన నేను, దేవుని చేత ఏర్పరచబడిన అమ్మగారికి, ఆమె పిల్లలకు వ్రాయునది: సత్యంలో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మాత్రమే కాదు, సత్యాన్ని ఎరిగిన వారందరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.


పెద్దనైన నేను, సత్యంలో ప్రేమించుచున్న నా ప్రియ స్నేహితుడైన గాయికు వ్రాయునది:


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ