Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




అపొస్తలుల 17:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 ఆయన ఒక మనుష్యుని నుండి భూజనులందరిని సృష్టించారు, వారు భూమినంతటిని నింపుతారు. ఆయన వారికి చరిత్రలో సమయాలను, వారి సరిహద్దులను నిర్ణయించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26-27 మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో యని, తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతటిలో నివసించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించాడు. నివసించే సరిహద్దులను ఏర్పరిచాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

26 ఆయన ఒక్క మనుష్యునితో మానవులందర్ని సృష్టించి వాళ్ళు ఈ ప్రపంచమంతా నివసించేటట్లు చేసాడు. వాళ్ళ కోసం ఒక కాలాన్ని నియమించాడు. ఏ దేశపు ప్రజలు ఎక్కడ నివసించాలో ఆ స్థలాన్ని, కాలాన్ని సరిగ్గా నియమించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 ఆయన ఒక మనుష్యుని నుండి భూజనులందరిని సృష్టించారు, వారు భూమినంతటిని నింపుతారు. ఆయన వారికి చరిత్రలో సమయాలను, వారి సరిహద్దులను నిర్ణయించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

26 ఆయన ఒక మనుష్యుని నుండి భూజనులందరిని సృష్టించారు, వారు భూమినంతటిని నింపుతారు. ఆయన వారికి చరిత్రలో సమయాలను, వారి సరిహద్దులను నిర్ణయించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




అపొస్తలుల 17:26
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు, ఎందుకంటే ఆమె జీవంగల వారందరికి తల్లి.


ఈ ముగ్గురు నోవహు కుమారులు, వీరి నుంచే భూలోకమంతా ప్రజలు విస్తరించారు.


ఆయన దేశాలను గొప్ప చేస్తారు వాటిని నాశనం చేస్తారు; దేశాలను విశాలపరుస్తారు వాటిని చెదరగొడతారు.


మనుష్యులు బ్రతికే రోజులు నిశ్చయించబడ్డాయి; వారు ఎన్ని నెలలు బ్రతుకుతారో మీరు శాసించారు వారు దాటలేని పరిధిని మీరు నియమించారు.


నా బ్రతుకంతా మీ చేతిలోనే ఉంది; నన్ను వెంటాడే వారి నుండి, నా శత్రువుల చేతుల్లో నుండి నన్ను విడిపించండి.


సమస్త ప్రకృతి మీ చేతుల్లో ఉంది. మీరే వేసవికాలం చలికాలం ఏర్పరిచారు.


గుమ్మమా, దుఃఖించు! పట్టణమా, కేకలు వేయి! ఫిలిష్తియా, మీరంతా కరిగిపోవాలి! ఉత్తర దిక్కునుండి పొగలేస్తుంది. పంక్తులు తీరిన సైన్యంలో వెనుదిరిగేవారు ఎవరూ లేరు.


ఆయన వాటికి వాటి భాగాలు కేటాయిస్తారు; ఆయన చేతి కొలత ప్రకారం వాటికి పంచిపెడుతుంది. అవి శాశ్వతంగా దానిని స్వాధీనం చేసుకుంటాయి తరతరాలు అందులో నివసిస్తాయి.


నా సన్నిధిలోకి వచ్చి సంగతులు తెలియజేయండి, వారు కలిసి ఆలోచన చేయాలి. పూర్వకాలం నుండి దీనిని తెలియజేసింది ఎవరు? చాలా కాలం క్రితం దానిని ప్రకటించింది ఎవరు? యెహోవానైన నేను కాదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిగల దేవుడను, రక్షకుడను; నేను తప్ప వేరే ఎవరూ లేరు.


నా గొప్ప శక్తితో చాచిన బాహువుతో నేను భూమిని, దాని ప్రజలను దానిపై ఉన్న జంతువులను సృష్టించాను. నేను ఎవరు సరైన వారనుకుంటే వారికి దానిని ఇస్తాను.


ఆ ఇద్దరు రాజులు కీడును ఉద్దేశిస్తూ, ఒకే బల్ల దగ్గర కూర్చుని ఒకనితో ఒకడు అబద్ధాలు చెప్పుకుంటారు, కాని అది నిష్ప్రయోజనం, ఎందుకంటే అంతం దాని నిర్ణీత కాలంలో వస్తుంది.


అంత్యకాలం కోసం శుద్ధి చేయబడి, పవిత్రపరచబడి, మచ్చలేని వారిగా చేయబడడానికి జ్ఞానులలో కొంతమంది పడిపోతారు, ఎందుకంటే, నిర్ణీత సమయంలో అంతం వస్తుంది.


మనకందరికి తండ్రి ఒక్కడు కాదా? ఒక్క దేవుడే మనల్ని సృజించలేదా? అలాంటప్పుడు ఒకరిపట్ల ఒకరం నమ్మకద్రోహం చేస్తూ దేవుడు మన పూర్వికులతో చేసిన నిబంధనను ఎందుకు అపవిత్రం చేస్తున్నాము?


అయినా కానీ ఆయన గురించి సాక్ష్యం లేకుండా ఉంచలేదు ఎలాగంటే: ఆయన మీకు ఆకాశం నుండి వర్షాన్ని వాటి రుతువుల్లో పంటలు పండింపచేసి తన దయను చూపించారు; సమృద్ధిగా ఆహారాన్ని అనుగ్రహిస్తూ మీ హృదయాలను ఆనందంతో నింపుతున్నారు.”


చేస్తున్న ప్రభువు చెప్తున్నాడు.’


ఆదాములో అందరు ఎలా మరణించారో అలాగే క్రీస్తులో అందరు బ్రతికించబడతారు.


మొదటి మానవుడు భూమిలోని మట్టితో చేయబడ్డాడు, రెండవ మానవుడు పరలోకానికి చెందిన వాడు.


మనం గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే, మనం ఎలా తప్పించుకోగలం? ఈ రక్షణను ప్రభువే మొదట ప్రకటించారు. ఆయన మాటలు విన్నవారి ద్వారా అది మనకు నిరూపించబడింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ