Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 4:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులైన రేకాబు, బయనా ఇష్-బోషెతు ఇంటికి బయలుదేరారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో అతడు విశ్రాంతి తీసుకుంటుండగా వారు అక్కడికి వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 రిమ్మోను కుమారులగు రేకాబును బయనాయును మంచి యెండవేళ బయలుదేరి మధ్యాహ్నకాలమున ఇష్బోషెతు మంచముమీద పండుకొనియుండగా అతని యింటికి వచ్చిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 రిమ్మోను కొడుకులు రేకాబు, బయనా ఇద్దరూ మధ్యాహ్న సమయంలో బాగా ఎండగా ఉన్నప్పుడు బయలుదేరి ఇష్బోషెతు మంచంపై పడుకుని నిద్రపోతున్నప్పుడు అతని ఇంటికి వెళ్లారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 రేకాబు, బయనాలిరువురూ బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. వారు ఇష్బోషెతు ఇంటికి మిట్ట మధ్యాహ్న సమయంలో వెళ్లారు. ఎండ తీవ్రంగా ఉన్నందున ఇష్బోషెతు విశ్రాంతి తీసుకొంటున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులైన రేకాబు, బయనా ఇష్-బోషెతు ఇంటికి బయలుదేరారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో అతడు విశ్రాంతి తీసుకుంటుండగా వారు అక్కడికి వచ్చారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 4:5
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఒక రోజు సాయంత్రం దావీదు పడక మీద నుండి లేచి రాజభవనం పైకప్పు మీద నడుస్తూ, అక్కడినుండి ఒక స్త్రీ స్నానం చేయడం చూశాడు. ఆ స్త్రీ చాలా అందంగా ఉంది.


ఆ సమయంలో, నేరు కుమారుడును సౌలు సేనాధిపతియైన అబ్నేరు అనేవాడు సౌలు కుమారుడైన ఇష్-బోషెతును మహనయీముకు తీసుకెళ్లాడు.


సౌలు కుమారునికి ఇద్దరు సైన్యాధికారులు ఉన్నారు; ఒకని పేరు బయనా రెండవ వాని పేరు రేకాబు; వారు బెన్యామీను గోత్రానికి చెందిన బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులు. బెయేరోతు బెన్యామీనీయుల దేశానికి చెందిన భూభాగము.


ఏలహు యొక్క రథాలు సగభాగం మీద అధికారి, అతని సేవకులలో ఒకడైన జిమ్రీ, అతని మీద కుట్రపన్నాడు. ఆ సమయంలో ఏలహు, తిర్సాలో అతని గృహనిర్వాహకుడైన అర్సా ఇంట్లో, బాగా త్రాగుతూ ఉన్నాడు.


సిరియావారు తిరిగి వెళ్లేటప్పుడు గాయాలతో ఉన్న యోవాషును వదిలేశారు. యాజకుడైన యెహోయాదా కుమారుడిని చంపినందుకు అతని అధికారులు అతనిపై కుట్రపన్ని అతన్ని అతని మంచం మీద చంపారు. కాబట్టి అతడు చనిపోయి దావీదు పట్టణంలో పాతిపెట్టబడ్డాడు, అయితే రాజుల సమాధుల్లో కాదు.


అమజ్యా యెహోవాను వెంబడించడం మానివేసిన సమయం నుండి ప్రజలు యెరూషలేములో కొందరు అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషుకు పారిపోయాడు, కాని వారు అతని వెంట లాకీషుకు మనుష్యులను పంపి అతన్ని అక్కడ చంపారు.


ఆమోను సేవకులు అతని మీద కుట్రపన్ని, తన సొంత భవనంలోనే అతన్ని చంపారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ