Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 21:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 అయ్యా కుమార్తె రిస్పా గోనెపట్ట తీసుకుని ఒక బండ మీద దానిని పరచుకొని కోతకాలం ప్రారంభం నుండి ఆ శవాల మీద ఆకాశం నుండి వర్షం కురిసేవరకు పగలు పక్షులు వాటిని ముట్టకుండా రాత్రి అడవి జంతువులు వాటిని తినకుండా కాపలా కాస్తూ ఆమె అక్కడే ఉండిపోయింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్ట తీసికొని కొండపైన పరచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశమునుండి వర్షము ఆ కళేబరములమీద కురియువరకు అచ్చటనేయుండి, పగలు ఆకాశపక్షులు వాటిమీద వాలకుండను రాత్రి అడవిమృగములు దగ్గరకు రాకుండను వాటిని కాచుచుండగా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 అయ్యా కూతురు రిస్పా గోనెపట్ట తీసుకు కొండపైన పరచుకుని కోతకాలం ఆరంభం నుండి మృతదేహాలపై ఆకాశం నుండి వానలు కురిసే దాకా అక్కడే ఉండిపోయి, పగలు ఆకాశపక్షులు వాటిమీద వాలకుండా, రాత్రులు అడవి జంతువులు వాటి దగ్గరికి రాకుండా వాటిని కాపలా కాస్తూ ఉన్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 అయ్యా కుమార్తె రిస్పా విషాద సూచకమైన ఒక వస్త్రం తీసుకొని కొండ మీద పరచింది. ఆ వస్త్రం పంట కోతలు మొదలు పెట్టినపప్పటి నుండి దానిమీద వర్షం పడే వరకు ఆ కొండ మీద పర్చబడివుంది. పగటి వేళ పక్షులు వచ్చి తన కుమారుల శవాలను ముట్టకుండా రిస్పా చూచేది. రాత్రిళ్లు పొలాల్లో నుంచి జంతువులు వచ్చి కుమారుల శవాలను ముట్టకుండగనూ కాపాడేది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 అయ్యా కుమార్తె రిస్పా గోనెపట్ట తీసుకుని ఒక బండ మీద దానిని పరచుకొని కోతకాలం ప్రారంభం నుండి ఆ శవాల మీద ఆకాశం నుండి వర్షం కురిసేవరకు పగలు పక్షులు వాటిని ముట్టకుండా రాత్రి అడవి జంతువులు వాటిని తినకుండా కాపలా కాస్తూ ఆమె అక్కడే ఉండిపోయింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 21:10
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

మూడు రోజుల్లో ఫరో నీ తలను తీసివేసి, నీ శరీరాన్ని స్తంభానికి వ్రేలాడదీస్తాడు. పక్షులు నీ మాంసం తినివేస్తాయి.”


అయ్యా కుమార్తె సౌలు ఉంపుడుగత్తెయైన రిస్పా చేసింది దావీదుకు తెలిసినప్పుడు,


అయ్యా కుమార్తె రిస్పా సౌలుకు ఉంపుడుగత్తెగా ఉండేది. “నా తండ్రి ఉంపుడుగత్తెతో నీవెందుకు శారీరక సంబంధం పెట్టుకున్నావు?” అని ఇష్-బోషెతు అబ్నేరును అడిగాడు.


అహాబు ఆ మాటలు విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉన్నాడు. గోనెపట్ట మీదే పడుకుంటూ దీనంగా తిరిగాడు.


జనాంగాల పనికిమాలిన విగ్రహాలేవైనా వర్షాన్ని కురిపిస్తాయా? ఆకాశాలు వాటంతట అవి జల్లులు కురిపిస్తాయా? లేదు, యెహోవా, మా దేవా మీరే కదా. కాబట్టి మీ మీదనే మా నిరీక్షణ ఉంది, ఎందుకంటే ఇదంతా చేసింది మీరే.


నీవు నీ సైన్యం నీతో పాటు ఉన్న అనేక జనులు ఇశ్రాయేలు పర్వతాలమీద కూలిపోతారు. వేటాడే రకరకాల క్రూర పక్షులకు, అడవి మృగాలకు నిన్ను ఆహారంగా చేస్తాను.


మనం యెహోవా గురించి తెలుసుకుందాం; ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సూర్యోదయం ఎంత నిశ్చయమో, ఆయన ప్రత్యక్షమవ్వడం అంతే నిశ్చయం; ఆయన శీతాకాలం వర్షాల్లా, భూమిని తడిపే తొలకరి వానలా దగ్గరకు వస్తారు.”


తినడానికి మేత లేక పశువులు ఎంతగానో మూలుగుతున్నాయి! మందలు అటూ ఇటూ తిరుగుతున్నాయి; గొర్రెల మందలు కూడా శిక్షను అనుభవిస్తున్నాయి.


సీయోను ప్రజలారా, సంతోషించండి, మీ దేవుడైన యెహోవాను బట్టి ఆనందించండి, ఆయన నమ్మదగినవారు కాబట్టి, ఆయన మీకు తొలకరి వర్షం ఇచ్చారు. ఆయన సమృద్ధి వర్షాలు పంపిస్తారు, ఆయన ముందు పంపినట్లు తొలకరి వర్షం, కడవరి వర్షం పంపిస్తారు.


వసంతకాలంలో వర్షం కోసం యెహోవాను అడగండి; ఉరుములతో ఉన్న తుఫానును పంపేది యెహోవాయే. అందరి పొలానికి మొక్కలు పెరిగేలా, ఆయన ప్రజలందరికి వర్షాన్ని కురిపిస్తారు.


అప్పుడు మీ దేశంలో సకాలంలో తొలకరి కడవరి వర్షాలు కురిపిస్తాను. అప్పుడు మీరు ధాన్యాన్ని క్రొత్త ద్రాక్షరసాన్ని, ఒలీవ నూనెను సమకూర్చుకోవచ్చు.


చెరపట్టబడినప్పుడు ఆమె వేసుకుని ఉన్న వస్త్రాలు తీసివేయాలి. నెలరోజులు ఆమె మీ ఇంట్లోనే ఉండి, తన తల్లిదండ్రుల కోసం విలపించిన తర్వాత, నీవు ఆమె దగ్గరకు వెళ్లవచ్చు, నీవు ఆమెకు భర్తగా ఆమె నీకు భార్యగా ఉండవచ్చు.


ఒకవేళ ఎవరైనా మరణశిక్షకు తగిన పాపం చేసి చంపబడి వారి దేహం చెట్టుకు వ్రేలాడదీయబడి ఉంటే,


దేహం రాత్రిపూట చెట్టుకు వ్రేలాడుతూ ఉండకూడదు. అదే రోజు దానిని పాతిపెట్టేలా చూడాలి, ఎందుకంటే మ్రానుపై వ్రేలాడదీయబడిన ఎవరైనా దేవుని శాపానికి గురవుతారు. మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశాన్ని మీరు అపవిత్రం చేయకూడదు!


ఆ ఫిలిష్తీయుడు దావీదుతో, “నా దగ్గరకు రా, నీ మాంసాన్ని పక్షులకు మృగాలకు వేస్తాను!” అన్నాడు.


ఈ రోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తారు; నేను నిన్ను చంపి నీ తల నరికివేస్తాను. నేను ఈ రోజే ఫిలిష్తీయుల కళేబరాలను పక్షులకు అడవి జంతువులకు వేస్తాను. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోకమంతా తెలుసుకుంటుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ