2 సమూయేలు 20:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 అమాశా మార్గం మధ్యలో రక్తంతో కొట్టుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన సైనికులందరూ అక్కడే ఆగిపోవడం ఆ వ్యక్తి చూసి, అమాశా శవాన్ని దారిలో నుండి పొలంలోకి లాక్కెళ్లి ఆ దారిన వచ్చినవారు నిలబడి చూడకుండ ఆ శవం మీద బట్ట కప్పాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 అమాశా రక్తములో పొర్లుచు మార్గమున పడియుండగా అచ్చోటికి వచ్చిన జనులందరు నిలిచి యుండుట ఆ మనుష్యుడు చూచి–అమాశాను మార్గము నుండి చేనిలోనికి లాగి, మార్గస్థులందరు నిలిచి తేరిచూడకుండ శవముమీద బట్ట కప్పెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 అమాశా రక్తంలో దొర్లుతూ దారి వెంట పడి ఉన్నాడు. ఆ చోటికి వచ్చినవారంతా నిలబడి చూస్తూ ఉండడం సైనికుడు చూసి, అమాశాను దారిలో నుండి పక్కన ఉన్న పొలంలోకి లాగివేసి, ఆ దారిలో నడిచేవారు ఎవ్వరూ చూడకుండా ఆ శవం మీద ఒక గుడ్డను కప్పివేశాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్12 మార్గం మధ్యలో అమాశ శవం రక్తపు మడుగులో పడివుంది. జనమంతా శవాన్ని చూసే నిమిత్తం అక్కడ ఆగుతూ ఉన్నారు కావున ఆ యువకుడు అమాశా శవాన్ని ప్రక్కనే వున్న పొలంలోనికి లాగి, దాని మీద ఒక బట్ట కప్పాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 అమాశా మార్గం మధ్యలో రక్తంతో కొట్టుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన సైనికులందరూ అక్కడే ఆగిపోవడం ఆ వ్యక్తి చూసి, అమాశా శవాన్ని దారిలో నుండి పొలంలోకి లాక్కెళ్లి ఆ దారిన వచ్చినవారు నిలబడి చూడకుండ ఆ శవం మీద బట్ట కప్పాడు. အခန်းကိုကြည့်ပါ။ |