Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 20:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 బెన్యామీను గోత్రానికి చెందిన బిక్రి కుమారుడైన షేబ అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు. అతడు బూర ఊది, “దావీదుతో మనకు ఏ భాగం లేదు, యెష్షయి కుమారునిలో ఏ వాటా లేదు, ఇశ్రాయేలీయులారా! ప్రతిఒక్కరు మీ గుడారానికి వెళ్లండి!” అని బిగ్గరగా అరిచి చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 బెన్యామీనీయుడగు బిక్రి కుమారుడైన షెబయను పనికిమాలినవాడొకడు అచ్చటనుండెను. వాడు–దావీదునందు మనకు భాగము లేదు, యెష్షయి కుమారునియందు మనకు స్వాస్థ్యము ఎంతమాత్రమును లేదు; ఇశ్రాయేలువారలారా, మీరందరు మీ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటనచేయగా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 బెన్యామీను గోత్రానికి చెందిన బిక్రి కొడుకు షెబ అనే పనికిమాలినవాడు ఒకడున్నాడు. వాడు “ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా మీ మీ సొంత స్థలాలకు వెళ్ళిపొండి. దావీదులో మనకు పాలు లేదు, యెష్షయి కుమారుడిలో మనకు వాటా ఎంతమాత్రమూ రాదు” అంటూ బాకా ఊది గట్టిగా ప్రకటించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 బిక్రి కుమారుడైన షెబ అనే పనికిమాలిన వాడొకడు అక్కడ వుండటం జరిగింది. షెబ అనేవాడు బెన్యామీను వంశానికి చెందినవాడు. అతడు బూర వూది, “దావీదులో మనకు భాగం లేదు. యెష్షయి కుమారునితో మనకేమీ సంబంధం లేదు! కావున ఇశ్రాయేలీయులారా, మనమంతా మన గుడారాలకు పోదాం పదండి” అని చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 బెన్యామీను గోత్రానికి చెందిన బిక్రి కుమారుడైన షేబ అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు. అతడు బూర ఊది, “దావీదుతో మనకు ఏ భాగం లేదు, యెష్షయి కుమారునిలో ఏ వాటా లేదు, ఇశ్రాయేలీయులారా! ప్రతిఒక్కరు మీ గుడారానికి వెళ్లండి!” అని బిగ్గరగా అరిచి చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 20:1
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

బెన్యామీను కుమారులు: బేల, బెకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహీ, రోషు, ముప్పీము, హుప్పీము, అర్దు.


అబ్షాలోము, “మీరు బూరల ధ్వని వినగానే, ‘హెబ్రోనులో అబ్షాలోము రాజు’ అని కేకలు వేయండి” అని చెప్పడానికి ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటికి రహస్యంగా దూతలను పంపాడు.


తర్వాత దావీదు అబీషైతో, తనతో ఉన్నవారందరితో, “నా రక్తం పంచుకుని పుట్టిన నా కుమారుడే నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటప్పుడు ఈ బెన్యామీనీయుడు ఇలా చేయడంలో ఆశ్చర్యమేముంది? అతన్ని వదిలేయండి, శపించమని యెహోవా వానికి చెప్పారు, కాబట్టి శపించనివ్వండి.


అంతేకాక షిమీ అతన్ని శపిస్తూనే, “వెళ్లిపో, వెళ్లిపో, హంతకుడా, దుర్మార్గుడా!


వారు అబ్షాలోము మృతదేహాన్ని తీసుకెళ్లి అడవిలో లోతైన గోతిలో పడవేసి దానిలో పెద్ద రాళ్లకుప్ప పేర్చి, ఇశ్రాయేలీయులందరు తమ ఇళ్ళకు పారిపోయారు.


కాబట్టి ఇశ్రాయేలు వారంతా దావీదును విడిచిపెట్టి బిక్రి కుమారుడైన షేబను వెంబడించారు. కాని యూదావారైతే యొర్దాను నుండి యెరూషలేము వరకు తమ రాజు దగ్గరే ఉండిపోయారు.


ఆమె వెళ్లి, తాను తెలివిగా యోవాబుతో మాట్లాడిన మాటలు పట్టణ ప్రజలకు చెప్పినప్పుడు వారు బిక్రి కుమారుడైన షేబ తల నరికి యోవాబు దగ్గర పడవేశారు. వెంటనే అతడు బూరధ్వని చేశాడు. అతని మనుష్యులందరు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి ఎవరి ఇళ్ళకు వారు వెళ్లిపోయారు. యోవాబు యెరూషలేములో ఉన్న రాజు దగ్గరకు తిరిగి వెళ్లాడు.


అయితే చేతులతో పోగుచేయలేని ముళ్ళలా, దుష్టులందరు పారవేయబడాలి.


రాజు తమ మాట అంగీకరించలేదని తెలుసుకున్న ఇశ్రాయేలీయులంతా రాజుకు ఇలా జవాబిచ్చారు: “దావీదులో మాకేం భాగం ఉంది, యెష్షయి కుమారునిలో మాకేం స్వాస్థ్యం ఉంది? ఇశ్రాయేలీయులారా, మీ గుడారాలకు వెళ్లిపొండి! దావీదూ, నీ సొంత ఇంటి సంగతి చూసుకో!” కాబట్టి ఇశ్రాయేలీయులు తమ గుడారాలకు వెళ్లిపోయారు.


అయితే అతనికి ఎదురుగా ఇద్దరు దుర్మార్గులను కూర్చోబెట్టి అతడు దేవున్ని రాజును శపించాడని వారితో నేరారోపణ చేయించండి. తర్వాత అతన్ని బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపండి.”


రాజు తమ మాట అంగీకరించలేదని తెలుసుకున్న ఇశ్రాయేలీయులంతా రాజుకు ఇలా జవాబిచ్చారు: “దావీదులో మాకేం భాగం ఉంది, యెష్షయి కుమారునిలో మాకేం స్వాస్థ్యం ఉంది? ఇశ్రాయేలీయులారా, మీ గుడారాలకు వెళ్లిపొండి! దావీదూ, నీ సొంత ఇంటి సంగతి చూసుకో!” కాబట్టి ఇశ్రాయేలీయులంతా గుడారాలకు వెళ్లిపోయారు.


అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతనికి సేవలందించిన పెద్దలను సంప్రదించి, “ఈ ప్రజలకు ఎలా జవాబివ్వాలో చెప్పండి” అని అడిగాడు.


యెహోవా, లెండి, వారిని ఎదిరించండి, వారిని కూలద్రోయండి; మీ ఖడ్గంతో దుష్టుల నుండి నన్ను విడిపించండి.


నీతిమంతులకు అనేక శ్రమలు కలుగవచ్చు, కాని, యెహోవా వాటన్నిటిలో నుండి వారిని విడిపిస్తారు.


తొందరపడి న్యాయస్థానానికి వెళ్లకండి, ఎందుకంటే ఒకవేళ నీ పొరుగువాడు నిన్ను అవమానపరిస్తే తర్వాత నీవేమి చేస్తావు?


నిప్పు కణాలకు బొగ్గు, అగ్నికి కట్టెలో గొడవలు రేపడానికి గొడవప్రియుడు.


ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే, ఆ రాజ్యం నిలువలేదు.


“కాని ఆ పట్టణస్థులు అతన్ని ద్వేషించారు కాబట్టి, ‘ఇతడు మాకు రాజుగా వద్దు’ అనే సందేశాన్ని అతనికి పంపించారు.


అతడు ఇంకా ఏమి చెప్పాడంటే, ‘అయితే నేను పరిపాలించడం ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడకు తెచ్చి నా ముందు వారిని సంహరించండి’ అన్నాడు.”


పేతురు, “వద్దు ప్రభువా, నీవు ఎప్పుడు నా పాదాలు కడుగకూడదు” అన్నాడు. అందుకు యేసు జవాబిస్తూ, “నేను నిన్ను కడక్కపోతే, నాతో నీకు పాలు ఉండదు” అన్నారు.


అలా వారు ఆనందిస్తూ ఉండగా, ఆ పట్టణంలో ఉన్న కొందరు దుష్టులు ఆ ఇంటి చుట్టూ చేరి తలుపును తడుతూ ఆ ఇంటి యజమానియైన ఆ వృద్ధునితో, “నీ ఇంటికి వచ్చిన వ్యక్తిని బయటకు తీసుకురా, మేము అతనితో పడుకుంటాం” అని బిగ్గరగా అరిచారు.


అక్కడికి చేరినప్పుడు, అతడు వచ్చి ఎఫ్రాయిం కొండ సీమలో బూరను ఊదాడు, అప్పుడు ఇశ్రాయేలీయులు అతనితో కొండల దిగువకు వెళ్లారు, అతడు వారి నాయకుడయ్యాడు.


కాబట్టి ఆమె వెళ్లి, ఒక పొలంలో కోతకోస్తున్న పనివారి వెనుక పరిగె ఏరుకోవడం ప్రారంభించింది. అలా ఆమె పని చేసిన పొలం ఎలీమెలెకు వంశం వాడైన బోయజుకు చెందినది.


సౌలు ఇశ్రాయేలీయులలో మూడువేలమందిని ఏర్పరచుకున్నాడు. వీరిలో రెండువేలమంది మిక్మషులో బేతేలు కొండ ప్రాంతంలో సౌలు దగ్గర ఉన్నారు; మిగిలిన వేయిమంది బెన్యామీనీయుల ఊరైన గిబియాలో యోనాతాను దగ్గర ఉన్నారు. మిగిలినవారిని వారి గుడారాలకు పంపివేశాడు.


ఏలీ కుమారులు చాలా దుర్మార్గులు; వారికి యెహోవా అంటే గౌరవం లేదు.


కాని దావీదుతో పాటు వెళ్లిన వారిలో ఉన్న కొందరు దుర్మార్గులు ఇబ్బందులు కలుగజేసేవారు, “వీరు మనతో పాటు రాలేదు కాబట్టి వారి భార్యలను, పిల్లలను తప్ప మనం తిరిగి తెచ్చిన దోపుడు సొమ్ములో వీరికి ఏ భాగం ఇవ్వనవసరం లేదు” అన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ