Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 2:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 సెరూయా ముగ్గురు కుమారులైన యోవాబు, అబీషై, అశాహేలు అక్కడే ఉన్నారు. అశాహేలు అడవిలేడిలా చాలా వేగంగా పరుగెత్తగలడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 సెరూయా ముగ్గురు కుమారులగు యోవాబును అబీషైయును అశాహేలును అచ్చటనుండిరి. అశాహేలు అడవిలేడియంత తేలికగా పరుగెత్తగలవాడు గనుక

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 సెరూయా ముగ్గురు కొడుకులు యోవాబు, అబీషై, అశాహేలు అక్కడ ఉన్నారు. అశాహేలు అడవి లేడి లాగా వేగంగా పరిగెత్తగలడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

18 యోవాబు, అబీషై, అశాహేలు అనువారు ముగ్గురూ సెరూయా కుమారులు. అశాహేలు పరుగులో మిక్కిలి వడి గలవాడు. అడవిలేడిలా వేగంగా పరుగు తీయగలవాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 సెరూయా ముగ్గురు కుమారులైన యోవాబు, అబీషై, అశాహేలు అక్కడే ఉన్నారు. అశాహేలు అడవిలేడిలా చాలా వేగంగా పరుగెత్తగలడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 2:18
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

సౌలు యోనాతానులు తమ బ్రతుకంతా ప్రేమ కలిగి దయ కలిగినవారిగా ఉన్నారు. చావులోనూ ఒకరిని ఒకరు విడిచిపెట్టలేదు. వారు గ్రద్దల కన్నా వేగం గలవారు, సింహాల కన్నా బలవంతులు.


రాజు అబ్షాలోము మీద మనస్సు పెట్టుకున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించాడు.


అశాహేలు కుడికైనా ఎడమకైనా తిరగకుండా అబ్నేరును వెంటాడాడు.


నా పాదాలను జింక పాదాలుగా చేస్తారు; ఎత్తైన స్థలాల మీద నన్ను నిలబెడతారు.


ఆ ముప్పైమంది వీరే: యోవాబు తమ్ముడైన అశాహేలు, బేత్లెహేముకు చెందిన దోదో కుమారుడైన ఎల్హానాను.


“సెరూయా కుమారుడు యోవాబు నాకు ఏమి చేశాడో నీకే తెలుసు. ఇశ్రాయేలు సేనాధిపతులైన నేరు కుమారుడైన అబ్నేరుకు, యెతెరు కుమారుడైన అమాశాకు ఏమి చేశాడో నీకు తెలుసు. సమాధానం కాలంలో వారిని యుద్ధ కాలంలో చంపినట్లు చంపి రక్తపాతం చేసి, తన నడికట్టుపై చెప్పులపై రక్తపు మరకలు చేసుకున్నాడు.


పరాక్రమముగల బలాఢ్యులు వీరే: యోవాబు తమ్ముడైన అశాహేలు, బేత్లెహేముకు చెందిన దోదో కుమారుడైన ఎల్హానాను,


కొంతమంది గాదీయులు తమ కూటమిని మార్చుకొని అరణ్యంలో సురక్షితమైన స్థలంలో ఉన్న దావీదు దగ్గర చేరారు. వారు పరాక్రమశాలులు, యుద్ధానికి సిద్ధపడినవారు, డాలు ఈటెలను వాడే సమర్థులు, వారు సింహం ముఖంలాంటి ముఖాలు కలిగి కొండల్లో ఉండే జింకలంత వేగంగా పరుగెత్తగలరు.


వారెవరంటే, నాయకుడైన ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఏలీయాబు,


నాలుగవ నెలకు యోవాబు సోదరుడైన అశాహేలు నాలుగో విభాగం మీద అధిపతిగా ఉన్నాడు; అతని తర్వాత, అతని కుమారుడైన జెబద్యా అధిపతి అయ్యాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.


నా పాదాలను జింక పాదాలుగా చేస్తారు; ఎత్తైన స్థలాల మీద నన్ను నిలబెడతారు.


సూర్యుని క్రింద మరొకటి కూడ నేను గమనించాను: వేగంగా ఉన్నవారే పందెం గెలవలేరు బలంగా ఉన్నవారే యుద్ధాన్ని జయించలేరు, జ్ఞానులకు ఆహారం లభించదు తెలివైన వారికే సంపద ఉండదు చదువుకున్న వారికి దయ లభించదు; కాని సమయాన్ని బట్టే అందరికి అవకాశాలు వస్తాయి.


తెల్లవారుజాము వచ్చి నీడలు పారిపోకముందు, నా ప్రియుడా, నా దగ్గరకు తిరిగి రా, నీవు జింకలా దుప్పిలా ఎగుడు దిగుడు కొండల మీది నుండి చెంగు చెంగున రా.


నా ప్రియుడా, దూరంగా రా, జింకలా, దుప్పిలా పరిమళముల పర్వతాల మీదుగా గంతులు వేస్తూ రా.


వేగంగా పరుగెత్తేవారు తప్పించుకోలేరు, బలాఢ్యులు ధైర్యం తెచ్చుకోలేరు, వీరుడు తన ప్రాణాన్ని రక్షించుకోలేడు.


ప్రభువైన యెహోవాయే నా బలం; ఆయన నా కాళ్లను లేడికాళ్లలా చేస్తాడు, ఎత్తైన స్థలాల మీద ఆయన నన్ను నడిపిస్తారు. సంగీత దర్శకుని కోసము. తంతి వాయిద్యాలపై పాడదగినది.


అప్పుడు దావీదు, “శిబిరంలోనికి సౌలు దగ్గరకు నాతో పాటు ఎవరు వస్తారు?” అని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడైన యోవాబుకు సోదరుడైన అబీషైని అడిగాడు. అందుకు, “నీతో నేను వస్తాను” అని అబీషై అన్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ