2 సమూయేలు 2:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 కొంతకాలం తర్వాత దావీదు యెహోవా దగ్గర విచారణ చేసి, “యూదా పట్టణాలకు నేను వెళ్ల వచ్చా?” అని అడిగాడు. అందుకు యెహోవా, “వెళ్లు” అని చెప్పారు. “ఎక్కడికి వెళ్లాలి?” అని దావీదు అడిగాడు. అందుకు యెహోవా, “హెబ్రోనుకు వెళ్లు” అని చెప్పారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఇది జరిగిన తరువాత–యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవాయొద్ద విచారణ చేయగా–పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. –నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా–హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 కొంతకాలం తరువాత దావీదు “నేను యూదా పట్టణాల్లో ప్రవేశించ వచ్చా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. “వెళ్ళు” అని యెహోవా అతనితో చెప్పాడు. “ఏ పట్టణానికి వెళ్ళమంటావు?” అని దావీదు అడిగాడు. “హెబ్రోనుకు వెళ్ళు” అని ఆయన చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్1 దావీదు యెహోవాకు ప్రార్థన చేసి, “నేను యూదా రాజ్యంలో ఏ నగరానికైనా వెళ్లనా?” అని అడిగాడు. “వెళ్లు” అన్నాడు యెహోవా. “ఎక్కడికి వెళ్లను?” అని దావీదు అడిగితే, “హెబ్రోనుకు” అని యెహోవా సమాధానమిచ్చాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 కొంతకాలం తర్వాత దావీదు యెహోవా దగ్గర విచారణ చేసి, “యూదా పట్టణాలకు నేను వెళ్ల వచ్చా?” అని అడిగాడు. అందుకు యెహోవా, “వెళ్లు” అని చెప్పారు. “ఎక్కడికి వెళ్లాలి?” అని దావీదు అడిగాడు. అందుకు యెహోవా, “హెబ్రోనుకు వెళ్లు” అని చెప్పారు. အခန်းကိုကြည့်ပါ။ |