2 సమూయేలు 19:35 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 నాకు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు. సుఖదుఃఖాల మధ్య తేడాను నేను చెప్పగలనా? మీ సేవకుడు భోజన పదార్ధాల రుచి చూడగలడా? నేను ఇంకా గాయనీగాయకుల స్వరాలను వినగలనా? నా ప్రభువును రాజువునైన మీకు మీ సేవకుడు ఎందుకు అధనపు భారం కావాలి? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 నేటికి నాకు ఎనుబది యేండ్లాయెను. సుఖదుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలిసికొనగలనా? గాయకులయొక్కయు గాయకురాండ్రయొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడనగు నేను నా యేలిన వాడవును రాజవునగు నీకు ఎందుకు భారముగా నుండవలెను? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 ఇప్పటికే నాకు 80 ఏళ్ళు నిండాయి. మంచి చెడ్డలకున్న తేడా నేను కనిపెట్టగలనా? భోజన పదార్ధాల రుచి నేను తెలుసుకో గలనా? గాయకుల, గాయకురాండ్ర పాటలు నాకు వినిపిస్తాయా? నీ దాసుడనైన నేను నీకు భారంగా ఎందుకు ఉండాలి? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్35 నాకు ఎనుబది ఏండ్లు! మంచి చెడుల విచక్షణాజ్ఞానం కూడా తెలియనంత ముసలి వాడినయ్యాను. తినటానికి, తాగటానికి రుచులు కూడ తెలియనంత వయసు మళ్లిన వాడను. గాయనీ గాయకుల స్వరము వినలేనివాడిని. అటువంటి నన్ను గురించి నీవెందుకు చింత చేస్తున్నావు? အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 నాకు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు. సుఖదుఃఖాల మధ్య తేడాను నేను చెప్పగలనా? మీ సేవకుడు భోజన పదార్ధాల రుచి చూడగలడా? నేను ఇంకా గాయనీగాయకుల స్వరాలను వినగలనా? నా ప్రభువును రాజువునైన మీకు మీ సేవకుడు ఎందుకు అధనపు భారం కావాలి? အခန်းကိုကြည့်ပါ။ |