2 సమూయేలు 18:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 అందుకు రాజు, “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అందుకు అహిమయస్సు, “యోవాబు మీ సేవకుడనైన నన్ను, రాజు సేవకున్ని పంపుతున్నప్పుడు చాలా గందరగోళంగా ఉన్నట్లు నేను చూశాను, అయితే అది ఏంటి అనేది నాకు తెలియదు” అని జవాబిచ్చాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 రాజు–బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అని యడుగగా అహిమయస్సు–యోవాబు రాజసేవకుడనైన నీ దాసుడనగునన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరు గుట నేను చూచితినిగాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 అప్పుడు రాజు “బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అహిమయస్సు “నీ దాసుడనైన నన్ను యోవాబు పంపుతున్నప్పుడు ఏదో గందరగోళం జరుగుతూ ఉండడం చూసాను గానీ అది ఏమిటో నాకు తెలియదు” అని చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్29 “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని రాజు అడిగాడు. “యోవాబు నన్ను పంపినపుడు అక్కడ పెద్ద కోలాహలం నేను చూశాను. కాని అది ఎందుకో నాకు తెలియదు” అని అహిమయస్సు సమాధానమిచ్చాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 అందుకు రాజు, “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అందుకు అహిమయస్సు, “యోవాబు మీ సేవకుడనైన నన్ను, రాజు సేవకున్ని పంపుతున్నప్పుడు చాలా గందరగోళంగా ఉన్నట్లు నేను చూశాను, అయితే అది ఏంటి అనేది నాకు తెలియదు” అని జవాబిచ్చాడు. အခန်းကိုကြည့်ပါ။ |