Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 18:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 అప్పుడు కావలివాడు మరొక వ్యక్తి పరిగెత్తుకు రావడం చూసి ద్వారపాలకునితో, “అదిగో, మరొకడు ఒంటరిగా పరుగెత్తుకు వస్తున్నాడు” అని గట్టిగా చెప్పాడు. రాజు, “అతడు కూడా మంచివార్తనే తెస్తున్నాడేమో” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 కావలికాడు పరుగెత్తికొని వచ్చు మరియొకని కనుగొని–అదిగో మరియొకడు ఒంటరి గానే పరుగెత్తికొని వచ్చుచున్నాడని ద్వారపుతట్టు తిరిగి చెప్పగా రాజు–వాడును వర్తమానము తెచ్చుచున్నా డనెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 కాపలా కాసేవాడికి పరుగెత్తుకుంటూ వస్తున్న మరొకడు కనబడ్డాడు. వాడు “అదిగో మరొకడు ఒంటరిగా పరుగెత్తుకొంటూ వస్తున్నాడు” అని గుమ్మం వైపు తిరిగి రాజుతో చెప్పాడు. రాజు “వాడు కూడా ఏదో కబురు తెస్తున్నాడు” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

26 కావలివాడు ఇంకొక వ్యక్తి రావటం కూడా చూశాడు. పైనున్న కావలివాడు ద్వారపాలకుని పిలిచి, “చూడు! ఇంకొకడు ఒంటరిగా పరుగెత్తుకు వస్తున్నాడు!” అని చెప్పాడు. “అయితే వాడు కూడా వార్త తెస్తున్నాడు!” అని అన్నాడు రాజు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 అప్పుడు కావలివాడు మరొక వ్యక్తి పరిగెత్తుకు రావడం చూసి ద్వారపాలకునితో, “అదిగో, మరొకడు ఒంటరిగా పరుగెత్తుకు వస్తున్నాడు” అని గట్టిగా చెప్పాడు. రాజు, “అతడు కూడా మంచివార్తనే తెస్తున్నాడేమో” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 18:26
3 ပူးပေါင်းရင်းမြစ်များ  

కావలివాడు గట్టిగా అరిచి రాజుకు ఆ సంగతి చెప్పాడు. రాజు, “అతడు ఒంటరిగా వస్తున్నాడంటే ఒకవేళ మంచివార్తనే తెస్తున్నాడేమో” అన్నాడు. పరుగెడుతూ వస్తున్నవాడు మరింత దగ్గరకు వచ్చాడు.


కావలివాడు, “మొదట పరుగెత్తుకొని వస్తున్నవాడు సాదోకు కుమారుడైన అహిమయస్సులా పరుగెడుతున్నట్టుంది” అని అన్నాడు. అందుకు రాజు, “అతడు మంచివాడు, మంచివార్తనే తెస్తున్నాడేమో” అని అన్నాడు.


కాబట్టి వారు వెళ్లి పట్టణ ద్వారపాలకులను పిలిచి, “మేము అరామీయుల శిబిరానికి వెళ్లాము. అక్కడ ఎవరూ లేరు, మనిషి చప్పుడు కూడా లేదు, గుర్రాలు, గాడిదలు, గుడారాలు ఉన్నవి ఉన్నట్లే ఉన్నాయి” అని చెప్పారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ