Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 18:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 తర్వాత యోవాబు కూషీయున్ని పిలిచి, “నీవు వెళ్లి, నీవు చూసిన దానిని రాజుకు చెప్పు” అని చెప్పాడు. ఆ కూషీయుడు యోవాబుకు నమస్కారం చేసి పరిగెత్తుకొని వెళ్లాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 తరువాత కూషీని పిలిచి –నీవు పోయి నీవు చూచిన దానిని రాజునకు తెలియజేయుమనగా కూషీ యోవాబునకు నమస్కారము చేసి పరుగెత్తికొని పోయెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 తరువాత కూషువాడిని పిలిచి “నువ్వు వెళ్లి నువ్వు చూసినదంతా రాజుకు తెలియజెయ్యి” అని చెప్పాడు. అప్పుడు కూషువాడు యోవాబుకు నమస్కారం చేసి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

21 తరువాత కూషీయుడైన ఒకనిని యోవాబు పిలిచి, “అతను చూసిన విషయాలన్నీ రాజు వద్దకు వెళ్లి చెప్పమన్నాడు.” కూషీయుడు యోవాబుకు నమస్కరించాడు. తరువాత కూషీయుడు దావీదుకు వార్త చెప్పటానికి పరుగెత్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 తర్వాత యోవాబు కూషీయున్ని పిలిచి, “నీవు వెళ్లి, నీవు చూసిన దానిని రాజుకు చెప్పు” అని చెప్పాడు. ఆ కూషీయుడు యోవాబుకు నమస్కారం చేసి పరిగెత్తుకొని వెళ్లాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 18:21
4 ပူးပေါင်းရင်းမြစ်များ  

అందుకు యోవాబు, “ఈ వార్తను ఈ రోజు నీవు మోసుకెళ్లవద్దు ఎందుకంటే తన కుమారుడు చనిపోవడం రాజుకు శుభవార్త కాదు కదా! నీవు మరోసారి నా దూతగా వార్తను మోసుకెళ్దువులే” అని అతనితో చెప్పాడు.


అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు యోవాబును, “ఏమైనా కానివ్వండి, నేను కూషీయుని వెంట పరుగెడతాను; నన్ను వెళ్లనివ్వండి” అని మరోసారి వేడుకున్నాడు. కాని యోవాబు, “నా కుమారుడా, నీవెందుకు వెళ్లాలనుకుంటున్నావు? నీకు బహుమతిని తెచ్చే వార్తేమి నీ దగ్గర లేదు” అన్నాడు.


అయితే అతడు, “ఏది ఏమైనా సరే, నేను వెళ్తాను” అన్నాడు. కాబట్టి యోవాబు, “సరే పరుగెత్తు” అన్నాడు. అహిమయస్సు మైదానం మీదుగా పరుగెత్తుకొని వెళ్లి కూషీయుని కంటే ముందుగా చేరుకున్నాడు.


అంతలో కూషీయుడు వచ్చి, “నా ప్రభువా రాజా! శుభవార్త వినండి! ఈ రోజు యెహోవా మీ మీదికి లేచిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి నీకు న్యాయం చేశారు” అని చెప్పాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ