Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 18:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 యోవాబు ఆ విషయం చెప్పిన వానితో, “ఏంటి! నీవతన్ని చూశావా? మరి వెంటనే అతన్ని నేలమీద పడేలా ఎందుకు కొట్టలేదు? నీవలా చేసి ఉంటే పది షెకెళ్ళ వెండిని ఒక యోధుల నడికట్టును నీకు ఇచ్చి ఉండేవాన్ని” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 యోవాబు–నీవు చూచి యుంటివే, నేల కూలునట్లు నీవతని కొట్టకపోతివేమి? నీవతని చంపినయెడల పది తులముల వెండియు ఒక నడికట్టును నీకిచ్చియుందు నని తనకు సమాచారము చెప్పినవానితో అనెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 అప్పుడు యోవాబు ఆ వార్త తెచ్చినవాడితో “నువ్వు చూశావు గదా, నేలమీద పడేలా అతణ్ణి ఎందుకు కొట్టలేదు? నువ్వు గనక అతణ్ణి చంపి ఉంటే పది తులాల వెండి, ఒక నడికట్టు నీకు ఇచ్చి ఉండేవాణ్ణి” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 “మరి నీవతనిని ఎందుకు చంపిక్రిందపడేలా చేయలేదు? నీకు నేను ఒక నడికట్టును మరియు పది తులముల వెండి ఇచ్చివుండేవాడిని!” అని యోవాబు అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 యోవాబు ఆ విషయం చెప్పిన వానితో, “ఏంటి! నీవతన్ని చూశావా? మరి వెంటనే అతన్ని నేలమీద పడేలా ఎందుకు కొట్టలేదు? నీవలా చేసి ఉంటే పది షెకెళ్ళ వెండిని ఒక యోధుల నడికట్టును నీకు ఇచ్చి ఉండేవాన్ని” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 18:11
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

అది చూసిన ఒకడు యోవాబు దగ్గరకు వెళ్లి, “అబ్షాలోము సింధూర వృక్షానికి వ్రేలాడుతూ ఉండడం నేను చూశాను” అని చెప్పాడు.


కాని అతడు యోవాబుతో, “నా చేతిలో వెయ్యి షెకెళ్ళ వెండి పెట్టినా, రాజు కుమారునిపై నేను చేయి వేయను. యువకుడైన అబ్షాలోముకు ఎవరూ హాని చేయకుండా కాపాడమని మాకందరికి వినిపించేలా రాజు నీకు, అబీషైకి, ఇత్తయికి ఆజ్ఞ ఇచ్చాడు.


తర్వాత అమాశాతో, ‘నీవు నాకు రక్త సంబంధివి కదా! యోవాబు స్థానంలో నిన్ను నా సేనాధిపతిగా నేను చేయకపోతే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షిస్తాడు’ అని చెప్పండి” అన్నాడు.


శత్రువు నన్ను వెంటాడుతున్నాడు, అతడు నా జీవితాన్ని నలిపివేస్తాడు; ఎప్పుడో చచ్చిన వారిలా అతడు నన్ను చీకటిలో నివసించేలా చేస్తాడు.


అక్రమ సంపాదన వెంటపడే వారందరి దారులు అలాంటివే; అది దానిని సొంతం చేసుకున్న వారి ప్రాణాలు తీస్తుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ