Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 17:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 అహీతోపెలు తాను చెప్పిన సలహాను పాటించకపోవడం చూసి, తన గాడిదకు గంతకట్టి తన ఊరిలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. తన ఇంటి విషయాలు చక్కబెట్టుకున్న తర్వాత ఉరివేసుకుని చనిపోయాడు. అతని తండ్రి సమాధిలో అహీతోపెలు పాతిపెట్టబడ్డాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరుగకపోవుట చూచి, గాడిదకు గంతకట్టి యెక్కి తన ఊరనున్న తన యింటికి పోయి తన యిల్లు చక్కబెట్టుకొని ఉరిపోసికొని చనిపోయెను; జనులు అతని తండ్రి సమాధియందు అతనిని పాతిపెట్టిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 అహీతోపెలు తాను చెప్పిన పథకం అమలు కాకపోవడం చూసి, గాడిదకు గంతలు కట్టి ఎక్కి తన ఊరికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లి, ఇంటి విషయాలు చక్కబెట్టి ఉరి వేసుకుని చనిపోయాడు. అతని తండ్రి సమాధిలో అతన్ని పాతిపెట్టారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

23 ఇశ్రాయేలీయులు తన సలహా పాటించలేదని అహీతోపెలు గమనించాడు. అహీతోపెలు తన గాడిదపై గంతవేసి దానిపై తన నగరానికి వెళ్లాడు. తన కుటుంబపోషణకు తగిన ఏర్పాట్లు చేసి అహీతోపెలు ఉరిపోసుకొని చనిపోయాడు. అహీతోపెలు చనిపోయినాక అతని శవాన్ని అతని తండ్రి సమాధిలో పాతిపెట్టారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 అహీతోపెలు తాను చెప్పిన సలహాను పాటించకపోవడం చూసి, తన గాడిదకు గంతకట్టి తన ఊరిలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. తన ఇంటి విషయాలు చక్కబెట్టుకున్న తర్వాత ఉరివేసుకుని చనిపోయాడు. అతని తండ్రి సమాధిలో అహీతోపెలు పాతిపెట్టబడ్డాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 17:23
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

అబ్షాలోము బలులు అర్పిస్తున్నప్పుడు, దావీదు సలహాదారుడైన గిలోనీయుడైన అహీతోపెలును తన స్వగ్రామమైన గిలోహు నుండి రమ్మని పిలిపించాడు. అబ్షాలోము అనుచరులు పెరుగుతూనే ఉండడంతో కుట్ర మరింత బలపడింది.


ఇంతలో ఒకడు వచ్చి, “అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలుకు కూడా భాగం ఉంది” అని దావీదుతో చెప్పాడు. కాబట్టి దావీదు, “యెహోవా! అహీతోపెలు ఆలోచనలను అవివేకంగా మార్చండి” అని ప్రార్థించాడు.


ఆ రోజుల్లో అహీతోపెలు ఏదైనా సలహా చెప్తే అది దేవుని నుండి వచ్చిన మాటలా ఉండేది. దావీదు, అబ్షాలోము కూడా అలానే భావించేవారు.


కాబట్టి దావీదు, అతనితో ఉన్నవారందరు బయలుదేరి యొర్దాను నది దాటారు. తెల్లవారేసరికి ఒక్కరూ మిగలకుండా అందరు యొర్దాను నది దాటి వెళ్లారు.


పట్టణం ఆక్రమించబడిందని జిమ్రీ చూసి, అతడు రాజభవనం లోనికి వెళ్లి, తనతోపాటు దాన్ని తగలబెట్టి చనిపోయాడు.


ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బుచేసి మరణానికి దగ్గరలో ఉన్నాడు. ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త అతని దగ్గరకు వెళ్లి, “యెహోవా చెప్పే మాట ఇదే: నీవు చనిపోబోతున్నావు; నీవు కోలుకోవు, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో” అన్నాడు.


అది దుష్టులకు పతనం, తప్పు చేసేవారికి విపత్తు కాదా?


నా మీద నేరం మోపేవారికి నా గురించి చెడుగా మాట్లాడేవారికి, యెహోవా వారికి జీతం చెల్లించును గాక.


ఓ దేవా! వారిని దోషులుగా ప్రకటించండి, వారి పన్నాగాలే వారి పతనానికి కారణం అవ్వాలి. వారు చేసిన అనేక పాపాలను బట్టి వారిని వెళ్లగొట్టండి, వారు మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.


కాని దేవా, మీరు దుష్టులను నాశనకూపంలో పడవేస్తారు; రక్తపిపాసులు మోసగాళ్లు వారి ఆయుష్షులో సగం కూడ జీవించరు. కానీ నేనైతే మిమ్మల్ని నమ్ముకున్నాను.


నాశనానికి ముందు గర్వం, పతనానికి ముందు అహంకారం వెళ్తాయి.


ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వారి నాశనానికి దారితీస్తుంది, వారి హృదయంలో వారికి యెహోవా మీద కోపం వస్తుంది.


ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బుచేసి మరణానికి దగ్గరలో ఉన్నాడు. ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త అతని దగ్గరకు వెళ్లి, “యెహోవా చెప్పే మాట ఇదే: నీవు చనిపోబోతున్నావు; నీవు కోలుకోవు, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో” అన్నాడు.


అప్పుడు యూదా ఆ వెండి నాణాలను దేవాలయంలో విసిరి వేసి అక్కడినుండి వెళ్లి, ఉరి వేసుకున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ