Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 14:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 “నీ సేవకురాలినైన నేను చెప్పేది ఏంటంటే, ‘మంచి చెడులను విచారించడంలో నా ప్రభువైన రాజు దేవుని దూతవంటివాడు కాబట్టి నా ప్రభువైన రాజు మాట నా వారసత్వాన్ని కాపాడును గాక. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును గాక’ ” అని చెప్పింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై యున్నాడు గనుక నా యేలినవాడవును రాజవునగు నీవు దేవుని దూతవంటివాడవై మంచి చెడ్డలన్నియు విచారింప చాలియున్నావు; కాబట్టి నీ దాసినగు నేను నా యేలినవాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకొంటిననెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 నా ఏలికవైన నువ్వు చెప్పిన మాట నీ దాసినైన నాకు సమాధానకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఏలినవాడవైన నీకు నీ దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు కనుక నువ్వు దేవదూత లాగా మంచి చెడులను వివేచించగలవు” అంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 నా ప్రభువైన నా రాజు మాటలు మనశ్శాంతినిస్తాయని నాకు తెలుసు. ఎందువల్లనంటే నీవు దేవుని నుండి వచ్చిన దూతలాంటివాడవు. ఏది మంచిదో, ఏది చెడ్డదో నీకు తెలుసు. దేవుడు సదా నీతో వుండు గాక!”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 “నీ సేవకురాలినైన నేను చెప్పేది ఏంటంటే, ‘మంచి చెడులను విచారించడంలో నా ప్రభువైన రాజు దేవుని దూతవంటివాడు కాబట్టి నా ప్రభువైన రాజు మాట నా వారసత్వాన్ని కాపాడును గాక. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును గాక’ ” అని చెప్పింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 14:17
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు రాజు ఆమెతో, “నేను నిన్ను ఒక విషయం అడుగుతాను. ఏదీ దాచకుండా చెప్పాలి” అన్నాడు. అందుకు ఆమె, “నా ప్రభువైన రాజా ఏమిటో అడగండి” అన్నది.


ప్రస్తుత పరిస్థితులను మార్చడానికి మీ సేవకుడైన యోవాబు ఇలా చేశాడు. దేశంలో జరుగుతున్నదంతా తెలుసుకోవడానికి నా ప్రభువుకు దేవుని దూతవంటి జ్ఞానం ఉన్నది” అన్నది.


అంతేకాక సీబా నీ సేవకుడనైన నా విషయంలో కూడా నీకు అబద్ధాలు చెప్పాడు. నా ప్రభువైన నా రాజు దేవదూత వంటివాడు. కాబట్టి నీకు ఏది మంచిదనిపిస్తే అదే చేయి.


నా తాతగారి వారసులందరూ నా ప్రభువైన రాజు నుండి మరణానికి మాత్రమే పాత్రులు, కానీ మీరు మీ బల్ల దగ్గర భోజనం చేసేవారిలో మీ సేవకునికి స్థానం ఇచ్చారు. అలాంటప్పుడు రాజుగారికి మనవి చేయడానికి నాకు ఏ హక్కు ఉంది?” అన్నాడు.


రాజు ఇచ్చిన తీర్పు గురించి ఇశ్రాయేలీయులందరు విన్నప్పుడు, రాజును ఎంతో గౌరవించారు, ఎందుకంటే తీర్పు తీర్చడానికి దేవుని దగ్గరనుండి అతడు జ్ఞానం పొందుకున్నాడని వారు గ్రహించారు.


కాబట్టి మీ ప్రజలను పాలించడానికి, మంచి చెడ్డల భేదం తెలుసుకోవడానికి వివేచన హృదయం మీ దాసునికి ఇవ్వండి. ఎందుకంటే, మీ గొప్ప ప్రజలైన వీరిని ఎవరు పరిపాలించగలరు?”


నా పెదవుల మీద దుష్టత్వం ఉందా? నా నోరు దుర్మార్గాన్ని గ్రహించలేదా?


వెండికి మూస బంగారానికి కొలిమి తగినది, అయితే ప్రజలు తమ కీర్తిచేత పరీక్షించబడతారు.


పొరుగువారిని పొగడేవారు వారి పాదాలకు వలలు వేస్తున్నారు.


అయితే బలమైన ఆహారం పరిణతి చెందిన వారికి, అంటే ఎవరైతే నిరంతరం ఉపయోగించడం ద్వారా తమకు తాముగా మంచి చెడులను వేరు చేసే శిక్షణ పొందుకున్నవారికి.


అన్ని విషయాల్లో మోషే మాటకు ఎలా పూర్తిగా లోబడినామో మీ మాటకు అలాగే లోబడతాము. నీ దేవుడైన యెహోవా మోషేతో ఉన్నట్లే నీతో కూడా ఉండును గాక.


అందుకు ఆకీషు దావీదుతో, “నీవు నా కంటికి దేవదూతలా మంచిగా కనబడుతున్నావు; కాని ఫిలిష్తీయుల దళాధిపతులు, ‘ఇతడు మనతో పాటు యుద్ధానికి రాకూడదు’ అని అంటున్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ