Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 సమూయేలు 12:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 కానీ నీవు ఇలా చేయడం వల్ల యెహోవాను పూర్తిగా ధిక్కరించావు కాబట్టి, నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు” అని చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14-15 అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14-15 అయితే నువ్వు చేసిన ఈ పనివల్ల యెహోవాను దూషించడానికి ఆయన శత్రువులకు నువ్వు ఒక మంచి కారణం చూపించావు. కాబట్టి నీకు పుట్టబోయే పసికందు తప్పకుండా చనిపోతాడు” అని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 కాని నీవు చేసిన ఈ పాపకార్యంవల్ల శత్రువులు నీ యెహోవాని అసహ్యించుకునేలా చేశావు. అందువల్ల నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 కానీ నీవు ఇలా చేయడం వల్ల యెహోవాను పూర్తిగా ధిక్కరించావు కాబట్టి, నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు” అని చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 సమూయేలు 12:14
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

తర్వాత నాతాను తన ఇంటికి వెళ్లిపోయాడు, యెహోవా ఊరియా భార్య ద్వార దావీదుకు పుట్టిన బిడ్డను మొత్తగా ఆ బిడ్డకు జబ్బుచేసింది.


నేను ఇంకా మాట్లాడుతూ, “మీరు చేస్తున్న పని సరియైనది కాదు. యూదేతరులైన శత్రువుల నిందలు తప్పించుకోడానికి మన దేవునికి భయపడకుండా నడుచుకుంటారా?


సైన్యాల అధిపతియైన యెహోవా, మీలో నిరీక్షణ ఉంచినవారు నా వలన అవమానానికి గురికావద్దు; ఇశ్రాయేలు దేవా, మిమ్మల్ని వెదకేవారు నా వలన సిగ్గుపడకూడదు.


దేవా, ఎంతకాలం శత్రువు మిమ్మల్ని వెక్కిరిస్తాడు? శత్రువు శాశ్వతంగా మీ పేరును దూషిస్తాడా?


యెహోవా శిక్షణ చేసినవారు ధన్యులు, వారికి మీ ధర్మశాస్త్రం నుండి మీరు బోధిస్తారు.


యెహోవా మా దేవా, మీరు వారికి జవాబిచ్చారు. మీరు వారికి క్షమించే దేవుడు, కాని వారు తప్పు చేసినప్పుడు మీరు వారిని శిక్షించారు.


“ఇప్పుడు ఇక్కడ నాకున్నది ఏంటి?” అని యెహోవా అంటున్నారు. “నా ప్రజలు ఏ కారణం లేకుండా కొనిపోబడ్డారు. వారిని పాలించేవారు వారిని ఎగతాళి చేస్తున్నారు రోజంతా నా నామం దూషించబడుతుంది” అని యెహోవా అంటున్నారు.


“భూలోకంలోని కుటుంబాలన్నిటి నుండి మిమ్మల్ని మాత్రమే ఎన్నుకున్నాను. కాబట్టి మీరు చేసిన పాపాలన్నిటిని బట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తాను.”


నా విషయంలో ప్రజలను ఆటంకపరిచే వాటిని బట్టి లోకానికి శ్రమ. అయితే అలాంటి శోధనలు తప్పవు కాని అవి ఎవరి వలన వస్తున్నాయో, వానికి శ్రమ.


“నిన్ను బట్టే దేవుని నామం యూదేతరుల మధ్య దూషించబడుతుంది” అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది.


ప్రభువు ద్వారా మనం తీర్పు పొందినప్పుడు, అంతంలో ఈ లోకంతో పాటు శిక్షకు గురి కాకుండా ఉండడానికి మనం క్రమపరచబడుతున్నాము.


ఎందుకంటే, ప్రభువు తాను ప్రేమించేవారిని క్రమశిక్షణలో ఉంచుతారు, తన కుమారునిగా అంగీకరించిన ప్రతివారికి ఆయన శిక్షణనిస్తారు.”


నేను ప్రేమించేవారిని గద్దించి శిక్షిస్తాను కాబట్టి నీవు ఆసక్తి కలిగి పశ్చాత్తాపపడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ