Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 రాజులు 9:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 ఎలీషా ప్రవక్త ప్రవక్తల బృందంలో ఒకరిని పిలిచి ఇలా అన్నాడు, “నీ నడికట్టు బిగించుకుని, సీసాలో ఒలీవనూనె పట్టుకుని రామోత్ గిలాదుకు వెళ్లు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 అంతట ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకనిని పిలువనంపించి అతనితో ఇట్లనెను–నీవు నడుము బిగించుకొని యీ తైలపుగిన్నె చేతపట్టుకొని రామో త్గిలాదునకు పోయి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 ఆ తరువాత ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్తల సమాజం నుండి ఒక వ్యక్తిని పిలిచాడు. అతనితో “ప్రయాణానికి బట్టలు ధరించు. ఈ చిన్న నూనె సీసా పట్టుకుని రామోత్ గిలాదుకు వెళ్ళు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్తల బృందంలో ఒకనిని పిలిచి, అతనితో ఎలీషా, “ఈ చిన్న నూనె సీసాని నీచేతిలో తీసుకుని వెళ్లడానికి నీవు సిద్ధంగా ఉండు. రామోత్గిలాదుకు వెళ్లు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 ఎలీషా ప్రవక్త ప్రవక్తల బృందంలో ఒకరిని పిలిచి ఇలా అన్నాడు, “నీ నడికట్టు బిగించుకుని, సీసాలో ఒలీవనూనె పట్టుకుని రామోత్ గిలాదుకు వెళ్లు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 రాజులు 9:1
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

యాజకుడైన సాదోకు పరిశుద్ధ గుడారంలో నుండి కొమ్ముతో నూనె తెచ్చి సొలొమోనును అభిషేకించాడు. అప్పుడు వారు బూర ఊదగా ప్రజలందరు, “రాజైన సొలొమోను చిరకాలం జీవించును గాక!” అని అంటూ కేకలు వేశారు.


యెహోవా హస్తం ఏలీయాను బలపరచగా అతడు తన నడుము బిగించుకుని, అహాబు కంటే ముందే పరుగెత్తుకొని వెళ్లి యెజ్రెయేలు చేరుకున్నాడు.


తర్వాత ఇశ్రాయేలు మీద నిమ్షీ కుమారుడైన యెహును రాజుగా, ఆబేల్-మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాను నీ తర్వాత ప్రవక్తగా అభిషేకించు.


యెహోవా మాటచేత, ప్రవక్త బృందంలో ఒకడు తన తోటి ప్రవక్తతో, “నీ ఆయుధంతో నన్ను కొట్టు” అన్నాడు, కాని అతడు నిరాకరించాడు.


అప్పుడు యెహోవా, ‘అహాబు రామోత్ గిలాదు మీదికి వెళ్లి అక్కడ చచ్చేలా అతన్ని ఎవరు ప్రలోభపెడతారు?’ అని అడిగారు. “ఒకడు ఒక విధంగా ఇంకొకడు ఇంకొక విధంగా చెప్పారు.


కాబట్టి అతడు యెహోషాపాతును, “నాతో కూడా రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వస్తావా?” అని అడిగాడు. అందుకు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, “నేను మీవాన్ని, నా ప్రజలు మీ ప్రజలు, నా గుర్రాలు మీ గుర్రాలు” అన్నాడు.


దీనిని చూస్తున్న యెరికోలో ఉన్న ప్రవక్తల బృందం వారు, “ఏలీయా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉంది” అని చెప్పి అతన్ని కలుసుకోడానికి వెళ్లి అతని ఎదుట సాష్టాంగపడ్డారు.


బేతేలులో ఉన్న ప్రవక్తల బృందం వారు ఎలీషా దగ్గరకు వచ్చి, “ఈ రోజు యెహోవా నీ గురువును నీ దగ్గరనుండి తీసుకెళ్తున్నారని నీకు తెలుసా?” అని అడిగారు. ఎలీషా జవాబిస్తూ, “నాకు తెలుసు, ఊరుకోండి” అన్నాడు.


యెరికోలో ఉన్న ప్రవక్తల బృందం వారు ఎలీషా దగ్గరకు వచ్చి, “ఈ రోజు యెహోవా నీ గురువును నీ దగ్గర నుండి తీసుకెళ్తున్నారని నీకు తెలుసా?” అని అడిగారు. ఎలీషా జవాబిస్తూ, “నాకు తెలుసు, ఊరుకోండి” అన్నాడు.


ప్రవక్త బృందంలో నుండి యాభైమంది మనుష్యులు యొర్దాను దగ్గర ఆగిన ఏలీయా, ఎలీషాలకు ఎదురుగా నిలబడ్డారు.


ఒక రోజు ప్రవక్తల బృందంలో ఒకని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి, “మీ సేవకుడైన నా భర్త చనిపోయాడు, అతడు యెహోవా పట్ల భక్తి కలవాడని మీకు తెలుసు. అయితే ఇప్పుడు అతనికి అప్పిచ్చినవాడు నా ఇద్దరు కుమారులను బానిసలుగా తీసుకెళ్లడానికి వస్తున్నాడు” అని మొరపెట్టింది.


ఎలీషా గేహజీతో, “నీ నడికట్టు బిగించుకుని, నా దండం చేతపట్టుకుని పరుగెత్తు. నీకు ఎవరైనా ఎదురైతే పలకరించవద్దు, ఎవరైనా పలకరిస్తే, జవాబివ్వకు. నా దండం బాలుని ముఖం మీద పెట్టు” అని చెప్పాడు.


కాబట్టి ఆ యువ ప్రవక్త రామోత్ గిలాదుకు వెళ్లాడు.


యెరూషలేము ప్రజలు అతని స్థానంలో యెహోరాము చిన్న కుమారుడైన అహజ్యాను రాజుగా చేశారు, ఎందుకంటే అరబీయులతో పాటు శిబిరంలోకి వచ్చిన దోపిడి మూకలు పెద్ద కుమారులందరిని చంపారు. కాబట్టి యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా ఏలడం ప్రారంభించాడు.


ఇశ్రాయేలు రాజైన అహాబు కుమారుడైన యోరాముతో కలిసి అరాము రాజైన హజాయేలు మీద యుద్ధం చేయడానికి రామోత్ గిలాదుకు వెళ్లినప్పుడు కూడా అతడు వారి సలహాను పాటించాడు. అరామీయులు యోరామును గాయపరిచారు;


“నిన్ను నీవు సిద్ధం చేసుకో! లేచి నిలబడి నేను నీకు ఏది ఆజ్ఞాపిస్తే అది వారితో చెప్పు. వారికి భయపడవద్దు, లేకపోతే వారి ముందు నేను నిన్ను భయపెడతాను.


ఒక స్త్రీ చాలా ఖరీదైన పరిమళద్రవ్యం ఉన్న ఒక పాలరాతి సీసాను తెచ్చి, ఆయన భోజనపు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన తలమీద ఆ పరిమళద్రవ్యంను పోసింది.


ఇప్పుడు, ఇశ్రాయేలూ, నేను మీకు బోధించే శాసనాలు చట్టాలను వినండి. మీరు జీవించి, మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోకి వెళ్లి స్వాధీనం చేసుకోవడానికి వాటిని అనుసరించండి.


బయల్-పెయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కళ్లారా చూశారు. బయల్-పెయోరును వెంబడించిన వారందరిని మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉండకుండా నాశనం చేశారు,


కాబట్టి, మెలకువ కలిగి నిబ్బరమైన బుద్ధిగల మనస్సులతో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి.


అప్పుడు సమూయేలు ఒలీవనూనె బుడ్డి తీసుకుని సౌలు తలమీద పోసి అతన్ని ముద్దు పెట్టుకొని ఇలా అన్నాడు, “యెహోవా తన వారసత్వమైన ప్రజల మీద పాలకునిగా నిన్ను అభిషేకించారు.


యెహోవా సమూయేలుతో, “ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను తిరస్కరించిన సౌలు గురించి నీవెంత కాలం దుఃఖపడతావు? నీ కొమ్మును నూనెతో నింపి నీవు బయలుదేరు; బేత్లెహేమీయుడైన యెష్షయి దగ్గరకు నేను నిన్ను పంపిస్తున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా ఏర్పరచుకున్నాను” అన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ