2 రాజులు 4:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 ఒక రోజు ఎలీషా షూనేముకు వెళ్లాడు. అక్కడ ఒక ధనికురాలు ఉండేది, ఆమె భోజనానికి రావాలని అతన్ని ప్రాధేయపడింది. కాబట్టి అతడు ఆ దారిన వెళ్లేటప్పుడు అక్కడ భోజనం చేయడానికి ఆగేవాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీ–భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనముచేయుచువచ్చెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ఒకసారి ఎలీషా షూనేము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ అతణ్ణి భోజనానికి రమ్మని ప్రాధేయపడిన ఒప్పించింది. కాబట్టి ఎలీషా ఆ దారి గుండా వెళ్ళినప్పుడల్లా ఆమె దగ్గర భోజనం చేస్తూ ఉండేవాడు. ఆమె ఆ పట్టణంలో చాలా ప్రముఖురాలు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 ఒకరోజు ఎలీషా షూనేము వెళ్లాడు. ఒక ముఖ్యమైన స్త్రీ షూనేములో నివసిస్తున్నది. ఈ స్త్రీ తన ఇంట విశ్రమించి భోజనం చేయమని ఎలీషాను కోరింది. కనుక ఆ ప్రదేశం మీదుగా ఎలీషా వెళ్లిన ప్రతిసారి అక్కడ ఆగి భోజనం చేసేవాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 ఒక రోజు ఎలీషా షూనేముకు వెళ్లాడు. అక్కడ ఒక ధనికురాలు ఉండేది, ఆమె భోజనానికి రావాలని అతన్ని ప్రాధేయపడింది. కాబట్టి అతడు ఆ దారిన వెళ్లేటప్పుడు అక్కడ భోజనం చేయడానికి ఆగేవాడు. အခန်းကိုကြည့်ပါ။ |