Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 రాజులు 4:40 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

40 ఆ కూరను తినడానికి అక్కడ వారికి వడ్డించారు. వారు దానిని రుచి చూసి, “దైవజనుడా! కుండలో విషం ఉంది!” అని కేకలు పెట్టారు. వారు దానిని తినలేకపోయారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

40 తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచిచూచి –దైవజనుడా,కుండలో విషమున్నదని కేకలువేసి దానిని తినక మానిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

40 భోజనం సమయంలో ఆ పులుసును వాళ్ళకి వడ్డించారు. ప్రవక్తల సమాజం వారు దాన్ని నోట్లో పెట్టుకుని “దేవుని మనిషీ, పాత్రలో విషం ఉంది” అంటూ కేకలు వేశారు. వాళ్ళిక దాన్ని తినలేకపోయారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

40 తర్వాత వారు మనష్యులకు కొంచెం కూర తినడానికి వడ్డించారు. కాని వారు కూర తినడానికి ప్రారంభించగా, ఎలీషాని పిలిచి, “దైవజనుడా! కుండలో విషం ఉన్నది” అని అన్నారు. ఆ కూర విషంలా వుంది. అందువల్ల అది వారు తినలేకపోయారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

40 ఆ కూరను తినడానికి అక్కడ వారికి వడ్డించారు. వారు దానిని రుచి చూసి, “దైవజనుడా! కుండలో విషం ఉంది!” అని కేకలు పెట్టారు. వారు దానిని తినలేకపోయారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 రాజులు 4:40
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఒక రోజు యాకోబు వంటకం చేస్తున్నపుడు, ఏశావు పొలం నుండి బాగా ఆకలితో వచ్చి,


ఆమె ఏలీయాతో అన్నది, “దైవజనుడా, మీరు నాకు చేసిందేంటి? నా పాపం నాకు జ్ఞాపకంచేసి నా కుమారున్ని చంపడానికి వచ్చారా?”


అందుకు రాజు వేరొక అధిపతిని, అతనితో పాటు యాభైమంది మనుష్యులను ఏలీయా దగ్గరకు పంపాడు. ఆ అధిపతి, “దైవజనుడా! రాజు నీతో, ‘వెంటనే క్రిందికి రా!’ అని అన్నారు” అని చెప్పాడు.


రాజు మూడవ అధిపతిని అతనితో పాటు యాభైమంది మనుష్యులను పంపాడు. ఈ మూడవ అధిపతి కొండెక్కి వెళ్లి, ఏలీయా ముందు మోకాళ్లమీద ఉండి, “దైవజనుడా” అని వేడుకున్నాడు, “నా ప్రాణాన్ని మీ సేవకులైన ఈ యాభైమంది ప్రాణాలను కాపాడండి!


అప్పుడు రాజు ఒక అధిపతిని, తనతో పాటు యాభైమంది మనుష్యులను ఏలీయా దగ్గరకు పంపాడు. ఒక కొండమీద కూర్చుని ఉన్న ఏలీయా దగ్గరకు ఆ అధిపతి ఎక్కి వెళ్లి, “దైవజనుడా, ‘క్రిందికి రా!’ అని రాజు చెప్తున్నారు” అని చెప్పాడు.


వారిలో ఒకడు కూర ఆకుల కోసం పొలాలకు వెళ్లాడు, వెర్రి ద్రాక్ష అతనికి దొరికింది, దాని తీగెలు కోసి అతడు తన వస్త్రం నిండ నింపుకున్నాడు. అవి విషపూరితమైనవని అతనికి తెలియక వాటిని తరిగి కూర కుండలో వేశాడు.


ఆమె తన భర్తతో, “మన దారిలో వస్తూ వెళ్తూ ఉండే ఈ మనిషి పరిశుద్ధుడైన దైవజనుడని నాకు తెలుసు.


దయచేసి మరొకసారి నా పాపాన్ని క్షమించి మరణం కలిగించే ఈ తెగులును నా నుండి తొలగించమని మీ దేవుడైన యెహోవాకు ప్రార్థించండి” అని అన్నాడు.


అప్పుడు వారు మారాకు వచ్చారు. అయితే మారా నీళ్లు చేదుగా ఉండడంతో వారు ఆ నీటిని త్రాగలేకపోయారు. (అందువల్ల ఆ చోటికి మారా అనే పేరు వచ్చింది.)


తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు; విషం త్రాగినా వారికి ఏ హాని కలుగదు; వారు రోగుల మీద చేతులుంచినప్పుడు, రోగులు స్వస్థత పొందుతారు” అన్నారు.


దైవజనుడైన మోషే తాను చనిపోకముందు ఇశ్రాయేలు ప్రజలపై పలికిన ఆశీర్వాద వచనాలు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ