2 రాజులు 4:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 ఆమె పర్వతం మీద ఉన్న దైవజనుని చేరుకొని, అతని పాదాలు పట్టుకుంది. గేహజీ ఆమెను అవతలకు నెట్టాలని దగ్గరకు వచ్చాడు, కాని దైవజనుడు, “ఆమెను వదిలేయి! ఆమె వేదనతో ఉన్నది కాని యెహోవా ఈ విషయం నాకు చెప్పకుండా మరుగు చేశారు” అని అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనునియొద్దకు వచ్చి అతని కాళ్లు పట్టుకొనెను. గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు – ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను; ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 తరువాత ఆమె పర్వతం మీద ఉన్న దేవుని మనిషి దగ్గరికి వచ్చి అతని కాళ్ళు పట్టుకుంది. గేహజీ ఆమెను తోలివేయడానికి దగ్గరికి గా వచ్చాడు. అప్పుడు దేవుని మనిషి “ఆమె చాలా నిస్పృహలో ఉంది. యెహోవా ఈ సమస్యను నాకు దాచి ఉంచాడు. నీవు ఆమె జోలికి పోకు” అని ఆదేశించాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్27 కాని ఆ షూనేము స్త్రీ దైవజనుని కోసం కొండ మీదికి వెళ్లి, క్రిందికి వంగి, ఎలీషా పాదాలు తాకింది. గేహజీ ఆమెను పక్కకు తొలగించాలని ఆమె దగ్గరికి వచ్చాడు. కాని దైవజనుడు (ఎలీషా) గేహజీని చూచి, “ఆమెను ఉండనీ. ఆమె చాలాబాధగా ఉన్నది. ఆ సంగతి నాకు యెహోవా చెప్పలేదు. యెహోవా ఈ విషయం నాకు చెప్పక దాచాడు.” అని పలికాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 ఆమె పర్వతం మీద ఉన్న దైవజనుని చేరుకొని, అతని పాదాలు పట్టుకుంది. గేహజీ ఆమెను అవతలకు నెట్టాలని దగ్గరకు వచ్చాడు, కాని దైవజనుడు, “ఆమెను వదిలేయి! ఆమె వేదనతో ఉన్నది కాని యెహోవా ఈ విషయం నాకు చెప్పకుండా మరుగు చేశారు” అని అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။ |