Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 రాజులు 4:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 ఎలీషా, “మరి ఆమె కోసం ఏం చేస్తే బాగుంటుంది?” అని అడిగాడు. గేహజీ, “ఆమెకు కుమారుడు లేడు, ఆమె భర్త వృద్ధుడు” అని జవాబిచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 ఎలీషా–ఆమె నేనేమి చేయకోరుచున్నదని వానినడుగగా గేహజీ–ఆమెకు కుమారుడు లేడు; మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 తరువాత ఎలీషా “ఈమెకు మనం ఏ ఉపకారం చేయగలం?” అని గేహజీని అడిగాడు. గేహజీ “ఆమెకి కొడుకు లేడు. భర్తేమో ముసలివాడు” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 “మనమామెకు ఏమి చేద్దాం?” అని ఎలీషా గేహజీని అడిగాడు. “ఆమెకు కొడుకు లేడని నాకు తెలియును. ఆమె భర్త ముసలివాడు” అని ప్రత్యుత్తర మిచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 ఎలీషా, “మరి ఆమె కోసం ఏం చేస్తే బాగుంటుంది?” అని అడిగాడు. గేహజీ, “ఆమెకు కుమారుడు లేడు, ఆమె భర్త వృద్ధుడు” అని జవాబిచ్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 రాజులు 4:14
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు అబ్రాహాము సాష్టాంగపడ్డాడు; అతడు తన హృదయంలో నవ్వుకుంటూ, “నూరు సంవత్సరాలు నిండిన మనుష్యునికి కుమారుడు పుడతాడా? తొంభై సంవత్సరాలు నిండిన శారా బిడ్డను కంటుందా?” అని అనుకున్నాడు.


రిబ్కాకు సంతానం కలుగలేదు కాబట్టి ఇస్సాకు ఆమె గురించి యెహోవాకు ప్రార్థన చేశాడు, యెహోవా అతని ప్రార్థనకు జవాబిచ్చారు, అతని భార్య రిబ్కా గర్భవతి అయ్యింది.


రాహేలు తనకు పిల్లలు కలగడం లేదు అని గ్రహించి, తన అక్క మీద అసూయ పడింది. కాబట్టి యాకోబుతో, “నాకు పిల్లలను ఇవ్వు లేదా నేను చస్తాను!” అని అన్నది.


ఎలీషా అతనితో, “ఆమెతో చెప్పు, ‘మాకోసం ఈ శ్రమంతా తీసుకున్నారు, ఇప్పుడు మీ కోసం ఏం చెయ్యాలో చెప్పండి. మేము మీ తరపున రాజుతో గాని సైన్యాధిపతితో గాని మాట్లాడాలా?’ ” అని అన్నాడు. అందుకామె, “నేను నా స్వజనుల మధ్య నివసిస్తున్నాను” అన్నది.


అప్పుడు ఎలీషా, “ఆమెను పిలువు” అన్నాడు. అతడు ఆమెను పిలువగా ఆమె వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది.


అయితే ఎలీసబెతు గొడ్రాలు కాబట్టి వారికి పిల్లలు కలుగలేదు, పైగా వారిద్దరు చాలా వృద్ధులు.


జోరహులో దాను వంశానికి చెందిన మనోహ అనే వ్యక్తి ఉండేవాడు. అతని భార్య గొడ్రాలు కాబట్టి ఆమెకు పిల్లలు లేరు.


అతనికి ఇద్దరు భార్యలు; ఒకరు హన్నా మరొకరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, కానీ హన్నాకు పిల్లలు లేరు.


ఆమె భర్త ఎల్కానా ఆమెతో, “హన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? నీవెందుకు తినడం లేదు? నీవెందుకు క్రుంగిపోతున్నావు? నీకు పదిమంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా?” అని అన్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ