2 రాజులు 4:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 ఎలీషా అతనితో, “ఆమెతో చెప్పు, ‘మాకోసం ఈ శ్రమంతా తీసుకున్నారు, ఇప్పుడు మీ కోసం ఏం చెయ్యాలో చెప్పండి. మేము మీ తరపున రాజుతో గాని సైన్యాధిపతితో గాని మాట్లాడాలా?’ ” అని అన్నాడు. అందుకామె, “నేను నా స్వజనుల మధ్య నివసిస్తున్నాను” అన్నది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 అతడు–నీవు ఇంత శ్రద్ధా భక్తులు మాయందు కనుపరచితివి నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్నుగూర్చి నేను మాటలాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆప్రకారము ఆమెతో అనెను. అందుకామె–నేను నా స్వజనులలో కాపురమున్నాననెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 అప్పుడు ఎలీషా గేహజీకి ఇలా ఆదేశించాడు. “నీవు ఆమెతో చెప్పు. నీవు మా కోసం ఇంత బాధ తీసుకున్నావు. నీ కోసం ఏం చేయాలి? నీ గురించి రాజుతో గానీ సైన్యాధిపతితో గానీ మాట్లాడమంటావా?” దానికి జవాబుగా ఆమె “నేను నా చుట్టాల మధ్యనే నివసిస్తున్నాను” అంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్13 ఎలీషా తన సేవకునితో ఇట్లనెను: “ఇప్పుడీమెకు చెప్పుము. మాకోసం నీవు చేయదగినదంతా చేశావు. నీ కోసం మేమేమి చేయుదుము? మేము నీ పక్షమున రాజుతో గాని, సైన్యం యొక్క నాయకునితో గాని ఏమైనా చెప్పమంటావా?” ఆ స్త్రీ, “నేను నా ప్రజల మధ్య హాయిగా ఇక్కడ నివసిస్తున్నాను” అని బదులు చెప్పింది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 ఎలీషా అతనితో, “ఆమెతో చెప్పు, ‘మాకోసం ఈ శ్రమంతా తీసుకున్నారు, ఇప్పుడు మీ కోసం ఏం చెయ్యాలో చెప్పండి. మేము మీ తరపున రాజుతో గాని సైన్యాధిపతితో గాని మాట్లాడాలా?’ ” అని అన్నాడు. అందుకామె, “నేను నా స్వజనుల మధ్య నివసిస్తున్నాను” అన్నది. အခန်းကိုကြည့်ပါ။ |