Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 రాజులు 3:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 వారు, “అది రక్తం! రాజులు ఒకడితో ఒకడు యుద్ధం చేసుకుని ఒకనినొకడు చంపుకొని ఉంటారు. ఇప్పుడు మోయాబు వారలారా! రండి దోపుడుసొమ్ము పట్టుకుందాం” అని చెప్పుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 గనుక వారు–అది రక్తము సుమా; రాజులు ఒకరినొకరు హతము చేసికొని నిజముగా హతులైరి; మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 “అదంతా రక్తం! రాజులు నాశనమయ్యారు. వారు ఒకళ్లనొకళ్ళు చంపుకున్నారు. మోయాబు వీరులారా, రండి, మనం వెళ్ళి దోపుడు సొమ్ము పట్టుకుందాము” అని చెప్పుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

23 “నెత్తురు చూడుడి! రాజులు తమలో తాము పోరాడుకొని వుండవచ్చును. ఒకరి నొకరు నాశనము చేసికొని వుండవచ్చు. మృత శరీరముల నుండి విలువగల వస్తువులు తీసుకొనుటకు గాను మనము వెళ్దాము” అని మోయాబు ప్రజలు చెప్పుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 వారు, “అది రక్తం! రాజులు ఒకడితో ఒకడు యుద్ధం చేసుకుని ఒకనినొకడు చంపుకొని ఉంటారు. ఇప్పుడు మోయాబు వారలారా! రండి దోపుడుసొమ్ము పట్టుకుందాం” అని చెప్పుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 రాజులు 3:23
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఉదయం వారు లేచినప్పుడు సూర్యకిరణాలు నీళ్ల మీద పడగా, మోయాబీయులకు తమ ఎదురుగా ఉన్న నీళ్లు రక్తంలా ఎర్రగా కనబడ్డాయి.


మోయాబీయులు ఇశ్రాయేలు శిబిరం చేరినప్పుడు, ఇశ్రాయేలీయులు లేచి వారితో పోరాడగా వారు నిలబడలేక పారిపోయారు. అప్పుడు ఇశ్రాయేలీయులు మోయాబును ఆక్రమించుకుని మోయాబీయులను హతం చేశారు.


ఎందుకంటే యెహోవా అరాము సైన్యానికి రథాలు, గుర్రాలు, గొప్ప సైన్యం వస్తున్న శబ్దం వినిపించేటట్టు చేశారు, అందువల్ల వారు ఒకరితో ఒకరు, “చూడండి, ఇశ్రాయేలు రాజు మనమీద దాడి చేయడానికి హిత్తీయుల రాజులను, ఈజిప్టు రాజులను తోడు తెచ్చుకున్నాడు!” అని చెప్పుకున్నారు.


కాబట్టి యెహోషాపాతు అతని మనుష్యులు వారి దోపుడుసొమ్మును దోచుకోవడానికి వెళ్లి, అక్కడ వారి మధ్య చాలా సామాగ్రి, వస్త్రాలు విలువైన వస్తువులు ఉండడం చూశారు. అవి వారు మోయలేనంతగా ఉన్నాయి. ఆ వస్తువులన్నీ పోగుచేయడానికి మూడు రోజులు పట్టింది.


‘నేను వారిని తరుముతాను, వారిని పట్టుకుంటాను. దోపుడుసొమ్మును పంచుకుంటాను; వాటివలన నా ఆశ తీర్చుకుంటాను. నేను నా ఖడ్గాన్ని దూస్తాను నా చేయి వారిని నాశనం చేస్తుంది’ అని శత్రువు అనుకున్నాడు.


పక్షి గూటిలోనికి చేరునట్లు నా చేయి దేశాల సంపదను చేరుకుంది; ప్రజలు విడిచిపెట్టిన గుడ్లు ఏరుకున్నట్లుగా, నేను అన్ని దేశాలను సమకూర్చుకున్నాను; ఏ ఒక్కటి రెక్కలు ఆడించలేదు లేదా కిచకిచమనడానికి నోరు తెరవలేదు.’ ”


‘దోపుడుసొమ్ము వారికి దొరకలేదా, వారు పంచుకోలేదా: ప్రతి మనిషికి ఒకరు, లేదా ఇద్దరు స్త్రీలను తీసుకుంటారు, సీసెరాకు దోపుడు సొమ్ముగా రంగువేసిన వస్త్రాలు, కుట్టుపని చేసిన రంగుల వస్త్రాలు, వారి మెడలకు తగిన రెండు వైపులా రంగులు అద్దిన కుట్టుపని చేసిన వస్త్రాలు ఇదంతా దోపుడు సొమ్ముగా తీసుకోలేదా?’


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ