Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 రాజులు 18:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 కావలికోట నుండి కోటగోడలు గల పట్టణం వరకు, గాజా దాని సరిహద్దుల వరకు ఫిలిష్తీయులను ఓడించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 మరియు గాజా పట్టణమువరకు దాని సరిహద్దులవరకు కాపరుల గుడిసెలయందేమి, ప్రాకారములుగల పట్టణములయందేమి, అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 ఇంకా గాజా పట్టణం, దాని సరిహద్దుల వరకూ బురుజులనుండి ప్రాకారాల వరకూ ఫిలిష్తీయులపై దాడి చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 హిజ్కియా గాజాకి వెళ్లేదారి అంతటను ఆ చుట్టుప్రక్కల ప్రదేశంలోగల ఫిలిష్తీయులందరినీ ఓడించాడు. చిన్న పట్టణం మొదలుకొని పెద్ద నగరందాకా గల అన్ని ఫిలిష్తీయుల నగరాలను అతను ఓడించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 కావలికోట నుండి కోటగోడలు గల పట్టణం వరకు, గాజా దాని సరిహద్దుల వరకు ఫిలిష్తీయులను ఓడించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 రాజులు 18:8
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

అయితే ఇప్పుడు నా దేవుడైన యెహోవా ప్రతి వైపు నాకు విశ్రాంతి కలుగజేశారు, నాకు విరోధి లేరు, విపత్తులు లేవు.


ఇశ్రాయేలీయులు తమ దేవుడు యెహోవాకు వ్యతిరేకంగా, రహస్యంగా చెడు కార్యాలు చేశారు. కావలికోట నుండి కోటగోడలు గల పట్టణం వరకు, తమ పట్టణాల్లో క్షేత్రాలను కట్టుకున్నారు.


జాబితాలో పేర్లు వ్రాయబడిన వీరు యూదా రాజైన హిజ్కియా కాలంలో అక్కడికి వచ్చారు. అక్కడ ఉన్న హాము వంశీయుల మెయునీయుల నివాసాలపై దాడి చేసి వారిని పూర్తిగా నాశనం చేసి, ఈ రోజు వరకు వారు అక్కడే స్థిరపడ్డారు, ఎందుకంటే వారి మందలకు సరిపోయేంత పచ్చిక అక్కడ ఉంది.


అతడు అరణ్యంలో బురుజులు కూడా నిర్మించాడు అనేక తొట్టెలను తవ్వాడు, ఎందుకంటే అతనికి పర్వత ప్రాంతాల్లో మైదానంలో చాలా పశువులు ఉన్నాయి. అతడు మట్టిని ప్రేమిస్తున్నందున కొండల్లో సారవంతమైన భూములలో తన పొలాలను ద్రాక్షతోటలను పని చేసేవారిని కలిగి ఉన్నాడు.


ఫిలిష్తీయులు యూదాలోని దక్షిణ పర్వత ప్రాంతాలలోని పట్టణాలపై దాడి చేశారు. వారు బేత్-షెమెషు, అయ్యాలోను గెదెరోతు, అలాగే శోకో, తిమ్నా గిమ్జో వాటి చుట్టుప్రక్కల గ్రామాలను స్వాధీనం చేసుకుని ఆక్రమించారు.


ఫిలిష్తియా, మిమ్మల్ని కొట్టిన కర్ర విరిగిపోయిందని మీరందరు సంతోషించకండి; సర్పమూలం నుండి విషపూరిత పాము పుడుతుంది, దాని సంతానం ఎగిరే విషసర్పము.


ఆయన దానిని త్రవ్వి రాళ్లను ఏరి బాగుచేసి అందులో శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలు నాటాడు. దానిలో కాపలా గోపురం కట్టాడు ద్రాక్షతొట్టిని తొలిపించాడు. మంచి ద్రాక్షపండ్లు కాయాలని ఆయన ఎదురుచూశాడు, కాని దానిలో చెడ్డ ద్రాక్షలు కాసాయి.


గాజా వరకు గ్రామాల్లో నివసించిన ఆవీయులను కఫ్తోరులో నుండి వచ్చిన కఫ్తోరీయులు నాశనం చేసి వారి దేశంలో స్థిరపడ్డారు.


అష్డోదు, దాని చుట్టూ ఉన్న స్థావరాలు, వాటి గ్రామాలు; దాని ఈజిప్టు వాగువరకు, మహా మధ్యధరా సముద్ర తీరం వరకు గాజా, దాని చుట్టూ ఉన్న స్థావరాలు, గ్రామాలు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ