Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 రాజులు 15:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 ఆ సమయంలో మెనహేము తిర్సా నుండి బయలుదేరి తిప్సహును, ఆ పట్టణంలో ఆ పరిసరాల్లో ఉన్న ప్రజలందరిపై దాడి చేశాడు, ఎందుకంటే వారు తమ తలుపులు తెరవడానికి నిరాకరించారు. అతడు తిప్సహును కొల్లగొట్టాడు, అందులో ఉన్న గర్భవతుల గర్భాలన్నిటిని చీరేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 మెనహేము రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారినందరిని హతము చేసి, తిర్సాను దాని చేరువ గ్రామములనన్నిటిని కొల్లపెట్టి అచ్చట గర్భిణులందరి గర్భములను చింపెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 మెనహేము వచ్చినప్పుడు తిప్సహు పట్టణం వారు తమ తలుపులు తెరవలేదు గనుక అతడు వాళ్ళందర్నీ హతం చేసి, తిర్సానూ దాని చుట్టూ ఉన్న గ్రామాలన్నిటినీ దోచుకుని అక్కడ ఉన్న గర్భవతుల గర్భాలు కత్తితో చీరివేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 షల్లూము మరణానంతరం, మెనహేము తిప్సహు ఆ పరిసర ప్రాంతాన్ని ఓడించాడు. అతనికై ప్రజలు నగరద్వారాన్ని తెరవడానికి అంగీకరించలేదు. అందువల్ల మెనహేము వారిని ఓడించాడు. నగరంలోని గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 ఆ సమయంలో మెనహేము తిర్సా నుండి బయలుదేరి తిప్సహును, ఆ పట్టణంలో ఆ పరిసరాల్లో ఉన్న ప్రజలందరిపై దాడి చేశాడు, ఎందుకంటే వారు తమ తలుపులు తెరవడానికి నిరాకరించారు. అతడు తిప్సహును కొల్లగొట్టాడు, అందులో ఉన్న గర్భవతుల గర్భాలన్నిటిని చీరేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 రాజులు 15:16
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతడు యూఫ్రటీసు నదికి పడమరగా, తిఫ్సహు నుండి గాజా వరకు ఉన్న రాజ్యాలన్నిటినీ పరిపాలించాడు. ఆ సమయంలో అన్ని వైపుల నెమ్మది ఉండింది.


షల్లూము పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసిన కుట్ర గురించి, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.


అప్పుడు హజాయేలు, “నా ప్రభువా ఎందుకు ఏడుస్తున్నారు?” అని అడిగాడు. అందుకతడు, “ఎందుకంటే మీరు ఇశ్రాయేలీయులకు చేసే కీడు నాకు తెలుసు. మీరు వారి కోటగోడలకు నిప్పంటిస్తారు, వారి యువకులను ఖడ్గంతో చంపుతారు, వారి చిన్న పిల్లలను నేలకు కొడతారు, వారి గర్భవతుల కడుపులు చీల్చివేస్తారు” అన్నాడు.


సమరయ ప్రజలు తమ అపరాధాన్ని భరించాలి, ఎందుకంటే వారు తమ దేవుని మీద తిరుగుబాటు చేశారు. వారు ఖడ్గానికి కూలుతారు; వారి చంటి పిల్లలు నేలకు కొట్టబడతారు, వారి గర్భిణీల కడుపులు చీల్చబడతాయి.”


యెహోవా ఇలా చెప్తున్నారు: “అమ్మోను చేసిన మూడు పాపాల గురించి, అతని నాలుగు పాపాల గురించి నేను దానిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకంటే అతడు తన సరిహద్దులను విశాల పరచడానికి, గిలాదులో ఉన్న గర్భిణి స్త్రీల కడుపులను చీల్చాడు.


అబీమెలెకు ఆ గోపురం దగ్గరకు వెళ్లి, దానిపై దాడి చేసి దాన్ని కాల్చివేయడానికి ఆ గోపుర ద్వారం దగ్గరకు వెళ్లినప్పుడు,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ