Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 కొరింథీ 9:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 దేవుడు మీకిచ్చిన అత్యధిక కృపను బట్టి వారు మీ కోసం ప్రార్థిస్తూ, మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 మరియు మీయెడల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూచి, వారు మీ నిమిత్తమై ప్రార్థనచేయుచు, మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై యున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 మీ పట్ల దేవుడు కనపరచిన అత్యధికమైన కృపను చూసి, వారు మీ కోసం ప్రార్థన చేస్తూ, మిమ్మల్ని చూడాలని ఎంతో కోరికతో ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 దేవుడు మీపై యింత కరుణ చూపినందుకు, వాళ్ళు ప్రార్థించినప్పుడు మనసారా మిమ్మల్ని ప్రేమతో తలచుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 దేవుడు మీకిచ్చిన అత్యధిక కృపను బట్టి వారు మీ కోసం ప్రార్థిస్తూ, మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

14 దేవుడు మీకిచ్చిన అత్యధిక కృపను బట్టి, వారు మీ కొరకు ప్రార్థించినప్పడు వారి హృదయాలు మిమ్మల్ని చూడాలని ఆశపడతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 కొరింథీ 9:14
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే అతని సేవకులు అమ్నోనును చంపేశారు. అప్పుడు రాజకుమారులంతా లేచి తమ కంచరగాడిదల మీద ఎక్కి పారిపోయారు.


ధాన్యాన్ని అమ్మకుండా దాచుకునేవాన్ని ప్రజలు శపిస్తారు, వాటిని అమ్మే వాని తల మీదికి దీవెనలు వస్తాయి.


కాబట్టి నేను మీతో చెప్పేదేమంటే, మీకున్న లోక ధనసంపదతో మీరు స్నేహితులను సంపాదించుకోండి, అది పోయినప్పుడు, నిత్యమైన నివాసాల్లో మీకు ఆహ్వానం దొరుకుతుంది.


మిమ్మల్ని బలపరచడానికి, ఆధ్యాత్మిక వరం ఏదైనా మీకు అందించడానికి మిమ్మల్ని చూడాలని నేను ఆరాటపడుతున్నాను.


మీ ప్రార్థనల ద్వారా మాకు సహాయం చేస్తున్నారు, కాబట్టి వాటిలో అనేక ప్రార్థనలకు జవాబుగా దేవుడు మామీద దయ చూపినందుకు మా పక్షంగా అనేకులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు.


సహోదరీ సహోదరులారా, మాసిదోనియా ప్రాంతంలోని సంఘాలకు అనుగ్రహించబడిన దేవుని కృప గురించి మీరు తెలుసుకోవాలని మేము కోరుతున్నాము.


ఈ పరిచర్య వలన మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు. క్రీస్తు సువార్తను మీరు అంగీకరించడాన్ని బట్టి కలిగిన విధేయత కోసం, వారితో అందరితో పాలుపంచుకొనే మీ దాతృత్వం బట్టి ఇతరులు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు.


చెప్పశక్యం కాని ఆయన వరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు.


యేసు క్రీస్తు దయను బట్టి మీ అందరి గురించి నేనెంత ఆశ కలిగి ఉన్నానో దేవుడే సాక్ష్యం ఇస్తారు.


అతడు అనారోగ్యంగా ఉన్నాడని మీరు విన్నారు, కాబట్టి మీ అందరిని చూడాలని ఆశపడుతూ దుఃఖపడుతున్నాడు.


కాబట్టి, నా సహోదరీ సహోదరులారా, నా ఆనందం నా కిరీటమైన నా ప్రియ స్నేహితులారా, నేను మిమ్మల్ని ప్రేమించి, ఈ విధంగా మీరు ప్రభువులో స్థిరంగా నిలబడి ఉండాలని కోరుకుంటున్నాను.


మన ప్రభువు యొక్క కృప, యేసు క్రీస్తులోని ప్రేమ, విశ్వాసం నాపై విస్తారంగా క్రుమ్మరించబడింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ