Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 కొరింథీ 11:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 వారు క్రీస్తు సేవకులా? నేను మతిలేనివానిలా మాట్లాడుతున్నాను, నేను వారికంటే ఎక్కువ. నేను ఎంతో కష్టపడి పని చేశాను. ఎక్కువసార్లు నేను చెరసాలలో ఉన్నాను, చాలా తీవ్రంగా కొరడా దెబ్బలు తిన్నాను, అనేకసార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 వారు క్రీస్తు పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యా యములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 వారు క్రీస్తు సేవకులా? (వెర్రివాడిలాగా మాట్లాడుతున్నాను) నేను కూడా ఇంకా ఎక్కువగా క్రీస్తు సేవకుణ్ణి. వారికంటే చాలా ఎక్కువగా కష్టపడ్డాను. అనేక సార్లు చెరసాల పాలయ్యాను. లెక్కలేనన్ని సార్లు దెబ్బలు తిన్నాను. అనేకమార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

23 వాళ్ళు క్రీస్తు సేవకులా? ఈ విధంగా మాట్లాడాలంటే నాకు మతిపోతుంది. నేను వాళ్ళకన్నా ఎక్కువ సేవ చేస్తున్నాను. నేను వాళ్ళకన్నా ఎక్కువ కష్టించి పని చేసాను. వాళ్ళకన్నా ఎక్కువ సార్లు కారాగారానికి వెళ్ళాను. వాళ్ళకన్నా తీవ్రమైన కొరడాదెబ్బలు తిన్నాను. ఎన్నోసార్లు చావుకు గురి అయ్యాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 వారు క్రీస్తు సేవకులా? నేను మతిలేనివానిలా మాట్లాడుతున్నాను, నేను వారికంటే ఎక్కువ. నేను ఎంతో కష్టపడి పని చేశాను. ఎక్కువసార్లు నేను చెరసాలలో ఉన్నాను, చాలా తీవ్రంగా కొరడా దెబ్బలు తిన్నాను, అనేకసార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

23 వారు క్రీస్తు సేవకులా? నేను మతిలేనివానిలా మాట్లాడుతున్నాను, నేను వారి కంటే ఎక్కువ. నేను ఎంతో కష్టపడి పని చేశాను, ఎక్కువ సార్లు నేను చెరసాలలో ఉన్నాను, చాలా తీవ్రంగా కొరడా దెబ్బలు తిన్నాను, మరల మరల ప్రాణాపాయాలను ఎదుర్కొన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 కొరింథీ 11:23
43 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు యిర్మీయా బారూకుతో, “నేను నిర్బంధించబడ్డాను; కాబట్టి యెహోవా ఆలయానికి వెళ్లడానికి నాకు అనుమతి లేదు.


అంతియొకయ ఈకొనియ ప్రాంతాల నుండి వచ్చిన కొందరు యూదులు జనసమూహాన్ని తమ పక్షం చేసికొని, పౌలును రాళ్లతో కొట్టించి, అతడు చనిపోయాడనుకొని పట్టణం బయటకు ఈడ్చుకొని పోయారు.


ప్రతి పట్టణంలో నా కోసం సంకెళ్ళు హింసలు వేచి ఉన్నాయని, పరిశుద్ధాత్మ నన్ను హెచ్చరిస్తున్నాడని మాత్రం నాకు తెలుసు.


అతడు మా దగ్గరకు వచ్చి, పౌలు నడికట్టును తీసుకుని దానితో తన చేతులను, కాళ్లను కట్టుకుని, “ ‘యెరూషలేములోని యూదా నాయకులు ఈ నడికట్టు కల వానిని ఈ విధంగా బంధించి యూదేతరుల చేతికి అప్పగిస్తారు’ అని పరిశుద్ధాత్మ చెప్తున్నాడు” అని అన్నాడు.


వారు అనేక రోజులు అక్కడ ఉన్నారు కాబట్టి ఫేస్తు పౌలు విషయాన్ని రాజుతో చర్చిస్తూ, “ఫెలిక్స్ విడిచిపెట్టిన ఒక ఖైదీ నా దగ్గర ఉన్నాడు.


మేము ఓడ ఎక్కి ఇటలీ దేశానికి వెళ్లాలని నిర్ణయించినప్పుడు, పౌలు మరికొందరు ఖైదీలను చక్రవర్తి ఔగుస్తు సైనిక దళానికి చెందిన యూలి అనే శతాధిపతికి అప్పగించారు.


మేము రోమా పట్టణానికి వచ్చినప్పుడు, పౌలు తనకు కాపలాగా ఉన్న ఒక సైనికునితో పాటు తనంతట తాను జీవించడానికి అనుమతి పొందాడు.


పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట్లో ఉంటూ తనను చూడాలని వచ్చిన వారందరిని స్వాగతించాడు.


నా పేరు కోసం ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపిస్తాను” అని చెప్పారు.


లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నది: “రోజంతా మీ కోసమే మరణ బాధ పడుతున్నాం; వధించ దగిన గొర్రెలమని మమ్మల్ని ఎంచుతున్నారు.”


అయితే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన మాత్రమే, ఆయన కృప నాలో వ్యర్థం కాలేదు. పైగా ఇతర అపొస్తలుల కంటే నేను ఎంతో ఎక్కువగా శ్రమపడ్డాను కాని అది నిజంగా నా ప్రయాస కాదు, నాకు తోడుగా ఉన్న దేవుని కృపయే.


అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? కేవలం సేవకులే కదా! ఒక్కొక్కరికి ప్రభువు నియమించిన దాని ప్రకారం, వారి ద్వారా మీరు విశ్వాసంలోనికి వచ్చారు.


అందుచేత, క్రీస్తు సేవకులుగా దేవుని మర్మాలను తెలియజేసే బాధ్యత పొందినవారిగా మమ్మల్ని మీరు భావించాలి.


ఈ సమయం వరకు ఆకలిదప్పులతో అలమటించాము, చింపిరి గుడ్డలతో ఉన్నాము, క్రూరంగా కొట్టబడ్డాము, నిరాశ్రయులుగా ఉన్నాము.


దేవుడు అపొస్తలులమైన మమ్మల్ని మరణశిక్ష విధించబడినవారి వరుసలో అందరికంటే చివరిగా ఉంచాడని నాకు అనిపిస్తుంది. మేము లోకమంతటికి, దేవదూతలకు అదే విధంగా మనుష్యులకు ఒక వింతగా ఉన్నాము.


పైకి కనబడే వాటిని బట్టి చూస్తున్నారు. ఎవరైనా తాము క్రీస్తుకు చెందిన వారమని నమ్మితే, వారిలా మేము కూడా క్రీస్తుకు చెందినవారమే అని మరల వారు ఎంచాలి.


“ఈ గొప్ప అపొస్తలుల” కంటే నేను ఏమాత్రం తక్కువ కాదని నేను అనుకుంటున్నాను.


వ్రాతపూర్వకమైన నియమాలను కాక, ఆత్మతో కూడిన క్రొత్త నిబంధనను సేవించగల సామర్ధ్యాన్ని ఆయనే మాకు ఇచ్చారు. అక్షరం చంపుతుంది కాని ఆత్మ జీవం ఇస్తాడు.


మా క్షయమైన శరీరంలో యేసు జీవం ప్రత్యక్షపరచబడాలని సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు కొరకై మరణానికి అప్పగించబడుతున్నాము.


తెలిసినవారమైనా తెలియనివారిగా ఎంచబడ్డాము; మరణిస్తున్నా జీవిస్తూనే ఉన్నాం; కొట్టబడ్డాం కాని చంపబడలేదు;


నేను నా శరీరంపై యేసు గుర్తులను కలిగి ఉన్నాను, కాబట్టి ఇకపై ఎవరూ నన్ను శ్రమ పెట్టవద్దు.


ఈ కారణంచేత, యూదేతరులైన మీరు రక్షింపబడాలని, పౌలు అనే నేను క్రీస్తు యేసు సువార్త విషయంలో ఖైదీనై ఉన్నాను.


మీరు పిలువబడిన పిలుపుకు యోగ్యులుగా నడుచుకోవాలని ప్రభువు యొక్క ఖైదీనైన నేను మిమ్మల్ని కోరుతున్నాను.


దాని కొరకే నేను రాయబారినై సంకెళ్ళలో ఉన్నాను, నేను దాన్ని ఎలా ప్రకటించాలో అలా దానిని ధైర్యంగా ప్రకటించేలా ప్రార్థించండి.


దాని ఫలితంగా, క్రీస్తు కోసం నేను సంకెళ్ళలో ఉన్నానని, రాజమందిరాన్ని కాపలా కాసేవారందరికి, అందరికి స్పష్టంగా తెలిసింది.


మీ విశ్వాస యాగంలో దానికి సంబంధించిన సేవలో నేను పానార్పణంగా పోయబడినప్పటికి, మీతో కలిసి సంతోషించి ఆనందిస్తాను.


మీ కోసం నేను అనుభవిస్తున్న శ్రమలలో ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను, సంఘమనే ఆయన శరీరం కోసం క్రీస్తు పడిన బాధల్లో మిగిలి ఉన్న వాటిలో నా వంతును, నా శరీరంలో పూర్తి చేస్తున్నాను.


నాలో బలంగా పని చేస్తున్న క్రీస్తు శక్తి అంతటిని బట్టి, ఇప్పటివరకు నేను ప్రయాసపడి పని చేస్తున్నాను.


మా సహోదరుడు దేవుని పరిచర్యయైన యేసు క్రీస్తు సువార్తను ప్రకటించడంలో మా తోటిపనివాడైన తిమోతిని, మీ విశ్వాసంలో మిమ్మల్ని ప్రోత్సహించి బలపరచడానికి పంపించాము,


ఈ విషయాలను సహోదరి సహోదరులకు తెలియజేసినట్లైతే, నీవు అనుసరించిన విశ్వాస సంబంధమైన సత్యాలు మంచి బోధలలో పోషించబడి క్రీస్తు యేసుకు మంచి సేవకునిగా ఉంటావు.


ప్రభువు కోసం నాకు పడ్డ సంకెళ్ళను గురించి సిగ్గుపడకుండా, అనేకసార్లు నన్ను ఆదరించిన ఒనేసిఫోరు ఇంటివారిపై ప్రభువు కనికరం చూపించును గాక.


కాబట్టి నీవు మన ప్రభువు కోసం సాక్ష్యమివ్వడానికి గాని ఆయన కోసం బందీనై ఉన్న నా గురించి కాని సిగ్గుపడకు. దానికి బదులు దేవుని శక్తినిబట్టి సువార్త కోసం నాతో పాటు కలిసి శ్రమలను అనుభవించడానికి సిద్ధపడు.


దీనిని బట్టే నేను నేరస్థునిలా బంధించబడ్డాను. కాని దేవుని వాక్యం బంధించబడలేదు.


హింసలు, శ్రమలు అంటే, అంతియొకయలో, ఈకొనియలో, లుస్త్ర ప్రాంతాల్లో నాకు కలిగిన హింసను నేను ఎలా సహించానో అన్ని నీకు తెలుసు. అయితే ప్రభువు వాటన్నిటి నుండి నన్ను తప్పించారు.


ముసలివాన్ని ఇప్పుడు యేసు క్రీస్తు కోసం ఖైదీగా ఉన్న పౌలు అనే నేను నిన్ను ప్రేమను బట్టి వేడుకుంటున్నాను.


చెరసాలలో వేయబడిన వారితో పాటు మీరు శ్రమ అనుభవించారు, మీ ఆస్తులను దోచుకున్నా సంతోషంగా స్వీకరించారు, వాటికంటే శాశ్వతంగా నిలిచే మరింత మేలైన ఆస్తులను కలిగి ఉన్నారని మీకు తెలుసు కాబట్టి మీరు వాటిని భరించారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ