Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 9:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 అందుకు ఆ సేవకుడు, “చూడండి, ఈ పట్టణంలో ఒక దైవజనుడున్నాడు. అతడు ఎంతో గొప్పవాడు, అతడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది. మనం అక్కడికి వెళ్దాము. మనం ఎక్కడికి వెళ్లాలో బహుశ అతడు మనకు చెప్పవచ్చు” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 వాడు–ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒక డున్నాడు, అతడు బహుఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్లవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో అతని యొద్దకు వెళ్లుదము రండని చెప్పెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 వాడు “ఈ ఊర్లో దేవుని మనిషి ఒకడు ఉన్నాడు, అతడు చాలా గొప్పవాడు, అతడు ఏది చెపితే అది జరుగుతుంది. మనం ఎటు వెళ్ళాలో ఆ దారి అతడు మనకు చెబుతాడేమో, అతని దగ్గరకి వెళ్ళి అడుగుదాం రండి” అని చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 “మనము ఈ పట్టణంలోనికి వెళ్దాము. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ప్రజలు అతనిని చాలా గౌరవిస్తారు, ఆయన చెప్పేది నెరవేరుతుంది. ఒకవేళ మనం యిప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిందీ అతను చెప్పగలడేమో” అని సేవకుడు సౌలుతో అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 అందుకు ఆ సేవకుడు, “చూడండి, ఈ పట్టణంలో ఒక దైవజనుడున్నాడు. అతడు ఎంతో గొప్పవాడు, అతడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది. మనం అక్కడికి వెళ్దాము. మనం ఎక్కడికి వెళ్లాలో బహుశ అతడు మనకు చెప్పవచ్చు” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 9:6
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

“ఈ రోజు నేను నీటిబుగ్గ దగ్గరకు వచ్చినప్పుడు, ‘యెహోవా, నా యజమానియైన అబ్రాహాము దేవా! మీకు ఇష్టమైతే, నా ప్రయాణం సఫలం చేయండి.


రాజు యాజకుడైన సాదోకుతో, “నీవు దీర్ఘదర్శివి గదా! నీవు నా దీవెనతో సమాధానంగా పట్టణానికి తిరిగి వెళ్లు. నీతో పాటు నీ కుమారుడైన అహిమయస్సును, అబ్యాతారు కుమారుడైన యోనాతానును తీసుకెళ్లు. నీవు అబ్యాతారు మీరిద్దరూ మీ ఇద్దరు కుమారులతో తిరిగి వెళ్లండి.


యరొబాము బలి అర్పించడానికి బలిపీఠం దగ్గర నిలబడి ఉన్నప్పుడు, యెహోవా వాక్కు ద్వారా ఒక దైవజనుడు యూదా నుండి బేతేలుకు వచ్చాడు.


దైవజనుడైన ఎలీషా, ఇశ్రాయేలు రాజు తన బట్టలు చించుకొన్నాడని విన్నప్పుడు, ఈ సందేశం అతనికి పంపాడు: “నీ బట్టలు ఎందుకు చించుకొన్నావు? ఆ వ్యక్తిని ఇప్పుడు నా దగ్గరకు పంపు, ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతడు తెలుసుకుంటాడు.”


దైవజనుడు, “అది ఎక్కడ పడింది?” అని అడిగాడు. అది పడ్డ స్థలం అతడు చూపించగా ఎలీషా ఒక కర్రను నరికి అక్కడ విసరగా ఆ ఇనుప గొడ్డలి నీటిపై తేలింది.


అప్పుడు యెహోవాకు భయపడేవారికి వారు కోరుకోవలసిన మార్గాలను ఆయన బోధిస్తారు.


నా సేవకుని మాటలను స్థిరపరచి నా దూతల ఆలోచనను నెరవేర్చేది నేనే. “యెరూషలేము నివాస స్థలంగా అవుతుందని యూదా పట్టణాలు మరలా కట్టబడతాయని వాటిలో పాడైన స్థలాలను బాగుచేయబడతాయని చెప్పాను.


ఆకాశం భూమి గతించిపోతాయి గాని నా మాటలు ఏమాత్రం గతించవు.


దైవజనుడైన మోషే తాను చనిపోకముందు ఇశ్రాయేలు ప్రజలపై పలికిన ఆశీర్వాద వచనాలు.


విశ్వాసులైన మీ మధ్య మేము ఎంత భక్తిగా, నీతిగా ఎలాంటి నిందలేనివారిగా ఉన్నామో దానికి మీరే సాక్షులు, అలాగే దేవుడు సాక్షి.


వారి పనిని బట్టి వారిని ప్రేమతో అధికంగా గౌరవించండి. ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి.


అయితే దైవజనుడవైన నీవు, వీటి నుండి పారిపోయి నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం, మంచితనం అనే వాటిని వెంబడించు.


తర్వాత ఒక దైవజనుడు ఏలీ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘నీ పూర్వికుల కుటుంబం ఈజిప్టులో ఫరో క్రింద ఉన్నప్పుడు నన్ను నేను వారికి బయలుపరచుకోలేదా?


ఆ సేవకుడు మళ్ళీ సౌలుతో, “చూడండి, నా దగ్గర పావు షెకెల్ వెండి ఉంది. మనం వెళ్లవలసిన దారిని మనకు చెప్పడానికి దాన్ని ఆ దైవజనునికి ఇస్తాను” అన్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ