Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 25:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే మా యజమానికి అతని ఇంటివారికందరికి కీడు పొంచి ఉంది. అతడు దుర్మార్గుడు, అతనితో ఎవరూ మాట్లాడలేరు” అని చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 అయితే మా యజమానునికిని అతని ఇంటి వారికందరికిని వారు కీడుచేయ నిశ్చయించియున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసినదానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికిమాలినవాడు, ఎవనిని తనతో మాటలాడ నీయడు అనెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 అయితే ఇప్పుడు మా యజమానికీ అతని ఇంటివారందరికీ వాళ్ళు కీడు తలపెట్టారు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏమి చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించు. మన అయ్యగారు పనికిమాలిన దుష్టుడు, ఎవరి మాటా వినడు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 ఇప్పుడు నీవు ఏమి చేయగలవో నీవే ఆలోచించి నిశ్చయించు. మా యజమాని నాబాలుకూ, అతని కుటుంబానికీ భయంకర ఆపద రాబోతోంది. నాబాలు చెప్పిన మాటలు బుద్ధి తక్కువ మాటలు” అని చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే మా యజమానికి అతని ఇంటివారికందరికి కీడు పొంచి ఉంది. అతడు దుర్మార్గుడు, అతనితో ఎవరూ మాట్లాడలేరు” అని చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 25:17
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాబట్టి గాదు దావీదు దగ్గరకు వెళ్లి అతనితో, “నీ దేశంలో మూడు సంవత్సరాల కరువు రావాలని కోరుకుంటావా? నీ శత్రువులు నిన్ను వెంటాడగా, వారిని ఎదుర్కోలేక మూడు నెలలు పారిపోతావా? నీ దేశంలో మూడు రోజులు తెగులు వ్యాపించాలని కోరుకుంటావా? ఇప్పుడు, నన్ను పంపిన వ్యక్తికి నేనేమి జవాబివ్వాలో ఆలోచించి నిర్ణయించుకో” అన్నాడు.


అయితే అతనికి ఎదురుగా ఇద్దరు దుర్మార్గులను కూర్చోబెట్టి అతడు దేవున్ని రాజును శపించాడని వారితో నేరారోపణ చేయించండి. తర్వాత అతన్ని బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపండి.”


అప్పుడు ఇద్దరు దుర్మార్గులు వచ్చి అతనికి ఎదురుగా కూర్చుని ప్రజల ముందు, “నాబోతు దేవున్ని రాజును శపించాడు” అని అంటూ నాబోతు మీద నేరం మోపారు. కాబట్టి వారు అతన్ని పట్టణం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారు.


సొలొమోను కుమారుడైన రెహబాము యువకుడై నిర్ణయాలు తీసుకోలేనివాడై, వారిని ఎదిరించే శక్తి లేనివానిగా ఉన్నప్పుడు, కొందరు పనికిమాలిన పోకిరీలు అతని చుట్టూ చేరి, అతని మీదికి యుద్ధానికి వెళ్లారు.


ప్రవక్త తనతో ఇంకా మాట్లాడుతూ ఉండగానే రాజు, “నిన్ను రాజుకు సలహాదారునిగా నియమించామా? ఆపు! ఎందుకు చావాలనుకుంటున్నావు?” అని అన్నాడు. అప్పుడు ప్రవక్త, “నీవు అప్పుడు అలా చేసి, ఇప్పుడు నా సలహా అంగీకరించలేదు కాబట్టి దేవుడు నిన్ను నాశనం చేయడానికి నిర్ణయించాడని నాకు తెలుసు” అని చెప్పి ఊరుకున్నాడు.


రాజు ఆవేశంతో లేచి, ద్రాక్షరసం వదిలి రాజభవన తోటలోకి వెళ్లాడు. అయితే రాజు తనకు హాని చేయాలని నిర్ణయించాడని గ్రహించిన హామాను తన ప్రాణాల కోసం ఎస్తేరు రాణిని బ్రతిమాలడానికి అక్కడే ఉండిపోయాడు.


మనుష్యులు తన వివేకాన్ని బట్టి పొగడబడతాడు, అలాగే వికృతమైన మనస్సు కలవారు తిరస్కరించబడతారు.


అలా వారు ఆనందిస్తూ ఉండగా, ఆ పట్టణంలో ఉన్న కొందరు దుష్టులు ఆ ఇంటి చుట్టూ చేరి తలుపును తడుతూ ఆ ఇంటి యజమానియైన ఆ వృద్ధునితో, “నీ ఇంటికి వచ్చిన వ్యక్తిని బయటకు తీసుకురా, మేము అతనితో పడుకుంటాం” అని బిగ్గరగా అరిచారు.


అయితే పనికిమాలినవారు కొందరు, “ఈ వ్యక్తి మనలను ఎలా రక్షించగలడు?” అని అంటూ అతన్ని తృణీకరించి అతనికి కానుకలు తీసుకురాలేదు. అయినా సౌలు మౌనంగా ఉన్నాడు.


ఏలీ కుమారులు చాలా దుర్మార్గులు; వారికి యెహోవా అంటే గౌరవం లేదు.


అప్పుడు అతడు, ‘అలాగే’ అని చెప్తే నీ సేవకుడనైన నేను క్షేమము. కానీ ఒకవేళ అతడు నా మీద తీవ్రంగా కోపపడితే అతడు నాకు హాని చేసే ఉద్దేశం కలిగి ఉన్నట్లు నీవు తెలుసుకుంటావు.


యోనాతాను, “అలా ఎప్పుడూ అనవద్దు. నా తండ్రి నీకు హాని చేయాలని చూస్తున్నట్టు నాకు తెలిస్తే నీతో చెప్పకుండా ఉంటానా?” అన్నాడు.


వారి దగ్గర మేము గొర్రెలను మేపుతున్నంత కాలం వారు రాత్రి పగలు మా చుట్టూ ఒక గోడలా ఉన్నారు.


అప్పుడు అబీగయీలు ఆలస్యం చేయకుండా వెంటనే రెండువందల రొట్టెలు, రెండు ద్రాక్షరసం తిత్తులు, వండిన అయిదు గొర్రెల మాంసం, అయిదు మానికల వేయించిన ధాన్యం, వంద ద్రాక్షగుత్తులు, రెండువందల అంజూర పండ్ల ముద్దలు తీసుకుని గాడిదల మీద ఎక్కించింది.


నా ప్రభువా, దుర్మార్గుడైన నాబాలును పట్టించుకోవద్దు. అతని పేరుకు అర్థం మూర్ఖుడు; నిజంగానే అతనిలో మూర్ఖత్వం ఉంది. ఇక నా విషయానికొస్తే, నా ప్రభువైన మీరు పంపిన మీ సేవకులను నేను చూడలేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ