1 సమూయేలు 19:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 అతడు తన వస్త్రాలను తీసివేసి సమూయేలు ఎదుటనే ప్రవచించాడు. అతడు ఆ రోజు రాత్రి పగలు పై బట్ట లేకుండా పడి ఉన్నాడు. అందువల్లనే, “సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా?” అనే సామెత పుట్టింది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆ నాటి రాత్రింబగళ్లు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు, పైబట్టలేనివాడై పడియుండెను. అందువలన సౌలును ప్రవక్తలలోనున్నాడా అను సామెత పుట్టెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 ఇంకా అతడు తన దుస్తులు తీసివేసి ఆ రోజు రాత్రి, పగలు సమూయేలు ఎదుటే ప్రకటిస్తూ, లోదుస్తులతోనే పడి ఉన్నాడు. అప్పటినుండి “సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా?” అనే సామెత పుట్టింది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్24 అప్పుడు సౌలు తన బట్టలు విడిచి, సమూయేలు ఎదుట అతడు దేవుని విషయాలు పలికాడు. ఆ పగలూ, ఆ రాత్రి శరీరంమీద బట్టలు లేకుండానే సౌలు గడిపాడు. ఆ కారణం చేతనే, “సౌలుకూడ ప్రవక్తల్లో ఒకడు అయ్యాడా?” అని ప్రజలు అనుకోవటం మొదలయ్యింది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 అతడు తన వస్త్రాలను తీసివేసి సమూయేలు ఎదుటనే ప్రవచించాడు. అతడు ఆ రోజు రాత్రి పగలు పై బట్ట లేకుండా పడి ఉన్నాడు. అందువల్లనే, “సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా?” అనే సామెత పుట్టింది. အခန်းကိုကြည့်ပါ။ |