1 సమూయేలు 18:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వస్తున్నప్పుడు, ఇశ్రాయేలు పట్టణాలలోని స్త్రీలందరు చాలా ఆనందంతో తంబురలు వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును కలుసుకోడానికి ఎదురువచ్చారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 దావీదు ఫిలిష్తీయుని హతముచేసితిరిగి వచ్చినప్పుడు, స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్లన్నిటిలోనుండి తంబురలతోను సంభ్రమముతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 వారు ఫిలిష్తీయులను ఓడించి, తిరిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఊళ్ళల్లో ఉన్న స్త్రీలంతా అమిత ఆనందంగా తంబురలతో, వాయిద్యాలతో పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును ఎదుర్కున్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్6 దావీదు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు రాజ్యంలోని వివిధ పట్టణాల స్త్రీలు అందరూ దావీదును కలుసుకొనేందుకు బయటకు వచ్చారు. వారు వీణారాగాలతోను, మృదంగతాళ ధ్వనులతోను దావీదు ఎదుట చిరునవ్వులతో నాట్యం చేసారు. ఇదంతా వారు సౌలు యెదుటనే చేసారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వస్తున్నప్పుడు, ఇశ్రాయేలు పట్టణాలలోని స్త్రీలందరు చాలా ఆనందంతో తంబురలు వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును కలుసుకోడానికి ఎదురువచ్చారు. အခန်းကိုကြည့်ပါ။ |