Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 15:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

33 అయితే సమూయేలు, “నీ కత్తి స్త్రీలకు సంతానం లేకుండా చేసినట్లు, స్త్రీల మధ్యలో నీ తల్లికి సంతానం లేకుండా పోతుంది” అని చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిలో అగగును ముక్కలుగా నరికాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

33 సమూయేలు–నీ కత్తి స్త్రీలకు సంతులేకుండ చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతులేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునియలుగా నరికెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

33 సమూయేలు “నీ కత్తి స్త్రీలకు సంతానం లేకుండా చేసినట్టు నీ తల్లికి కూడా స్త్రీలలో సంతానం లేకుండా పోతుంది” అని చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధానంలో అగగును ముక్కలుగా నరికివేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

33 కాని సమూయేలు అగగుతో, “నీ కత్తివేటుకు గురిచేసి అనేకమంది పిల్లలను తమ తల్లులకు లేకుండా చేసావు. కనుక ఇప్పుడు నీ తల్లికి పిల్లలు ఉండరు,” అంటూ గిల్గాలులో యెహోవా ఎదుట సమూయేలు అగగును ముక్కలుగా నరికి వేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

33 అయితే సమూయేలు, “నీ కత్తి స్త్రీలకు సంతానం లేకుండా చేసినట్లు, స్త్రీల మధ్యలో నీ తల్లికి సంతానం లేకుండా పోతుంది” అని చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిలో అగగును ముక్కలుగా నరికాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 15:33
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

“ఎవరైనా మనుష్యుని రక్తం చిందిస్తే, మనుష్యులచే వారి రక్తం చిందించబడాలి; ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో మనుష్యుని సృజించారు.


అప్పుడు ఏలీయా, “బయలు ప్రవక్తలను పట్టుకోండి! వారిలో ఒక్కడు కూడా తప్పించుకోకూడదు!” అని వారికి ఆజ్ఞాపించాడు. ప్రజలు వారిని పట్టుకున్నారు, ఏలీయా వారిని కీషోను లోయలోకి తీసుకెళ్లి అక్కడ చంపాడు.


మోషే తన చేతులు పైకి ఎత్తినంతసేపు ఇశ్రాయేలీయులు గెలిచారు. మోషే తన చేతులు క్రిందికి దించినప్పుడు అమాలేకీయులు గెలిచారు.


కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు,


యెహోవా ఖడ్గం రక్తసిక్తం అవుతుంది, అది క్రొవ్వుతో కప్పబడి ఉంది. గొర్రెపిల్లల, మేకల రక్తంతో, పొట్టేళ్ల మూత్రపిండాల మీది క్రొవ్వుతో కప్పబడి ఉంది. ఎందుకంటే బొస్రాలో యెహోవా బలి జరిగిస్తారు. ఎదోము దేశంలో ఆయన గొప్ప వధ జరిగిస్తారు.


కాబట్టి వారి పిల్లలను కరువుకు అప్పగించండి; ఖడ్గానికి వారిని అప్పగించండి. వారి భార్యలు సంతానం లేనివారుగా, విధవరాండ్రుగా ఉండాలి; వారి మనుష్యులు చంపబడాలి, వారి యువకులు యుద్ధంలో కత్తివేటుతో చంపబడాలి.


“యెహోవా పనిని అశ్రద్ధగా చేసేవారు శాపగ్రస్తులు! రక్తం చిందించకుండ తమ ఖడ్గాన్ని ఒరలో పెట్టేవారు శాపగ్రస్తులు!


కాబట్టి నా ప్రవక్తల ద్వారా మిమ్మల్ని ముక్కలు చేశాను, నా నోటిమాటల ద్వారా మిమ్మల్ని చంపాను, అప్పుడు నా తీర్పులు మెరుపులా ప్రకాశిస్తాయి.


అప్పుడు కొండ సీమలో నివసిస్తున్న అమాలేకీయులు కనానీయులు దిగి వచ్చి, ఇశ్రాయేలీయులపై దాడి చేసి, హోర్మా వరకు తరిమికొట్టారు.


మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకూ తీర్పు తీర్చబడుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో మీకు అదే కొలత కొలవబడుతుంది.


ఎందుకంటే దయచూపించనివారి మీద దయ చూపక తీర్పు తీర్చబడుతుంది; దయ తీర్పుపై జయం పొందుతుంది.


వారు నీ పరిశుద్ధ ప్రజల రక్తాన్ని నీ ప్రవక్తల రక్తాన్ని కార్చారు కాబట్టి, వారికి తగినట్లే వారికి రక్తాన్ని త్రాగించావు.”


ఆమె ఎలా ఇచ్చిందో ఆమెకు అలాగే ఇవ్వండి; ఆమె చేసిన దానికి రెండింతలు ఆమెకు తిరిగి చెల్లించండి. ఆమె పాత్ర నుండే ఆమెకు రెండింతలు పోసి ఇవ్వండి!


అప్పుడు రాజైన అదోని-బెజెకు, “ఇలా కాలు చేతుల బొటన వ్రేళ్ళు కోయబడిన డెబ్బైమంది రాజులు నా బల్లక్రింద పడిన ముక్కలు ఏరుకునేవారు. నేను వారికి చేసిన దానికి దేవుడు నాకు తగిన ప్రతిఫలమిచ్చారు” అని అన్నాడు. వారు అతన్ని యెరూషలేముకు తీసుకువచ్చారు, అతడక్కడ చనిపోయాడు.


“నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్లు. దహనబలులు సమాధానబలులు అర్పించడానికి నేను తప్పక నీ దగ్గరకు వస్తాను. అయితే నేను వచ్చి నీవు ఏం చేయాలో నీకు చెప్పే వరకు, నీవు ఏడు రోజులు అక్కడే వేచి ఉండాలి.”


అప్పుడు సమూయేలు, “అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు. సంకెళ్ళతో ఉన్న అగగు అతని దగ్గరకు వచ్చి, “ఖచ్చితంగా మరణభయం నా నుండి తొలగిపోయింది” అనుకున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ