Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 12:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 గోధుమ కోతకాలం ఇది కాదా? ఉరుములు వర్షం పంపమని నేను యెహోవాను వేడుకుంటున్నాను. అప్పుడు మీరు రాజును ఏర్పాటు చేయమని అడిగి యెహోవా దృష్టిలో ఎంత పెద్ద పాపం చేశారో మీరు గ్రహిస్తారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 గోధుమ కోతకాలము ఇదే గదా? మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలిసికొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 ఇది గోదుమ పంట కోసే కాలం గదా. మీ కోసం రాజును నియమించమని కోరుకోవడం ద్వారా యెహోవా దృష్టిలో మీరు ఘోరమైన తప్పిదం చేశారని మీరు గ్రహించి తెలుసుకొనేలా యెహోవా ఉరుములు, వర్షం పంపాలని నేను ఆయనను వేడుకొంటున్నాను.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 ఇప్పుడు గోధుమ పంట కోతకు వచ్చింది. ఫెళఫెళమనే ఉరుములు, మెరుపులతో వర్షం కురిపించుమని నేను దేవుని ప్రార్థిస్తాను. అప్పుడు మీరు రాజు కావాలని అడిగి, యెహోవాపట్ల ఎంత పాపం చేశారో మీరే తెలుసుకుంటారు,” అని వివరంగా చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 గోధుమ కోతకాలం ఇది కాదా? ఉరుములు వర్షం పంపమని నేను యెహోవాను వేడుకుంటున్నాను. అప్పుడు మీరు రాజును ఏర్పాటు చేయమని అడిగి యెహోవా దృష్టిలో ఎంత పెద్ద పాపం చేశారో మీరు గ్రహిస్తారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 12:17
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

దేవునికి చెందిన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు, యెహోవా నామాన ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు; వారు దేవునికి ప్రార్థన చేశారు, ఆయన జవాబిచ్చారు.


ఆ మరునాడు మోషే ప్రజలతో, “మీరు ఘోరమైన పాపం చేశారు. కాని నేను యెహోవా దగ్గరకు ఎక్కి వెళ్తాను; బహుశ మీ పాపాల కోసం నేనేమైనా ప్రాయశ్చిత్తం చేయగలనేమో” అని అన్నాడు.


వేసవికాలంలో మంచు లేదా కోతకాలంలో వర్షం సరిపడవో, అలాగే బుద్ధిలేని వానికి ఘనత కూడా సరిపడదు.


అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు: “మోషే, సమూయేలు నా ముందు నిలబడినా, నా హృదయం ఈ ప్రజల వైపుకు వెళ్లదు. వారిని నా సన్నిధి నుండి దూరంగా పంపివేయి! వారిని వెళ్లనివ్వు!


యెహోవా అమోరీయులను ఇశ్రాయేలీయులకు అప్పగించిన రోజున, యెహోషువ ఇశ్రాయేలీయుల సమక్షంలో యెహోవాతో ఇలా అన్నాడు: “సూర్యుడా, గిబియోనుపై నిలిచిపో, చంద్రుడా, అయ్యాలోను లోయ పైగా ఆగిపో.”


కాబట్టి మీరు అడిగిన మీరు ఎంచుకున్న రాజు ఇక్కడ ఉన్నాడు. యెహోవా ఇతనిని మీమీద రాజుగా నిర్ణయించారు.


ప్రజలందరు సమూయేలుతో, “మేము రాజు కావాలని అడిగి మా పాపాలన్నిటి కంటే ఎక్కువ చెడు చేశాం కాబట్టి మేము చనిపోకుండా నీ సేవకులమైన మాకోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయి” అన్నారు.


యెహోవాను వ్యతిరేకించేవారు నాశనమవుతారు. పరలోకం నుండి మహోన్నతుడు ఉరుములా గర్జిస్తారు; భూదిగంతాలకు యెహోవా తీర్పు తీరుస్తారు. “ఆయన తన రాజుకు బలాన్నిస్తారు తాను అభిషేకించిన వాని కొమ్మును హెచ్చిస్తారు.”


అప్పుడు సమూయేలు, “ఇశ్రాయేలీయులందరిని మిస్పా దగ్గర సమకూర్చండి, నేను మీ అందరి పక్షంగా యెహోవాకు విజ్ఞాపన చేస్తాను” అన్నాడు.


అయితే వారు, “మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక రాజు కావాలి” అని అడగడం సమూయేలుకు నచ్చలేదు; కాబట్టి అతడు యెహోవాకు ప్రార్థన చేశాడు.


అందుకు యెహోవా సమూయేలుతో, “ప్రజలు నీతో చెప్పేదంతా విను; వారు తిరస్కరించింది నిన్ను కాదు, వారికి రాజుగా ఉండకుండా నన్ను తిరస్కరించారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ