Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 సమూయేలు 12:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 అలా కాకుండా మీరు యెహోవాకు లోబడకుండా ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే యెహోవా హస్తం మీ పూర్వికులకు వ్యతిరేకంగా ఉన్నట్లే మీకు కూడా వ్యతిరేకంగా ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసినయెడల యెహోవా హస్తము మీపితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 అలా కాక, యెహోవా మాట వినకుండా ఆయన ఆజ్ఞలకు లోబడకపోతే యెహోవా కృప మీ పూర్వీకులకు వ్యతిరేకంగా ఉన్నట్టు మీ పట్ల కూడా విరోధంగా ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

15 కానీ మీరు యెహోవాకు విధేయులు కాకపోతే, ఆయన ఆజ్ఞలను తిరస్కరిస్తే, ఆయన మీకు వ్యతిరేకి అవుతాడు. ప్రభువు మిమ్మల్ని, మీ రాజును సర్వనాశనం చేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 అలా కాకుండా మీరు యెహోవాకు లోబడకుండా ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే యెహోవా హస్తం మీ పూర్వికులకు వ్యతిరేకంగా ఉన్నట్లే మీకు కూడా వ్యతిరేకంగా ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 సమూయేలు 12:15
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతడు ఆసాను కలుసుకోడానికి వెళ్లి అతనితో ఇలా చెప్పాడు, “ఆసా, సర్వ యూదా ప్రజలారా, బెన్యామీనీయులారా, నేను చెప్పేది వినండి. మీరు యెహోవాతో ఉంటే ఆయన మీతో ఉంటారు. మీరు ఆయనను వెదికితే, ఆయన మీకు కనిపిస్తారు. ఒకవేళ మీరు ఆయనను విడిచిపెడితే, ఆయన మిమ్మల్ని విడిచిపెడతారు.


ఒకవేళ మీరు ఎదిరించి తిరుగుబాటు చేస్తే, మీరు ఖడ్గం చేత నాశనమవుతారు” యెహోవా ఈ మాట చెప్తున్నారు.


దుష్టులకు శ్రమ! వారికి చెడు జరుగుతుంది! వారి చేతులు చేసిన దాని ప్రతిఫలం వారికి ఇవ్వబడుతుంది.


“యెహోవా నీతిమంతుడు, అయినా నేను ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాను. జనాంగములారా, వినండి; నా శ్రమను చూడండి. నా యువకులు, యువతులు చెరకు వెళ్లారు.


ఎందుకంటే మీ తిరుగుబాటుతనం, మొండితనం నాకు తెలుసు. నేను ఇంకా మీతో బ్రతికి ఉన్నప్పుడే మీరు యెహోవాపై తిరుగుబాటు చేస్తే, నేను చనిపోయిన తర్వాత మీరు ఇంకెంత ఎక్కువ తిరుగుబాటు చేస్తారు కదా!


ఒకవేళ మీరు యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను సేవిస్తే, ఆయన మీకు మేలు చేసినట్టే మీ మీదికి కీడు తెచ్చి మిమ్మల్ని నాశనం చేస్తారు.”


ఇశ్రాయేలు పోరాడడానికి వెళ్లినప్పుడు, యెహోవా వారికి ప్రమాణం చేసినట్టు వారిని ఓడించడానికి ఆయన హస్తం వారికి విరుద్ధంగా ఉండేది. వారు ఎంతో బాధపడ్డారు.


“అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచిపోయారు; ఆయన వారిని హాసోరు సేనాధిపతియైన సీసెరా చేతికి ఫిలిష్తీయుల చేతికి మోయాబు రాజు చేతికి అప్పగించినప్పుడు వారు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు.


కానీ వారు దానిని తరలించిన తర్వాత, యెహోవా హస్తం ఆ పట్టణానికి వ్యతిరేకంగా ఉండి, వారిని చాలా భయాందోళనలకు గురిచేసింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పట్టణంలోని ప్రజలకు ఆయన గడ్డలు పుట్టించి బాధించారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ