1 రాజులు 2:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 “బాగా గుర్తుంచుకో, నేను మహనయీముకు పారిపోయే రోజు, బహూరీము వాడైన బెన్యామీనీయుడు, గెరా కుమారుడైన షిమీ నన్ను ఘోరంగా శపించాడు. అతడు నన్ను కలుసుకోడానికి యొర్దాను నది దగ్గరకు వచ్చినప్పుడు, నేను యెహోవా పేరిట ‘నేను నిన్ను కత్తితో చంపను’ అని అతనికి ప్రమాణం చేశాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరివాడునైన షిమీ నీయొద్ద నున్నాడు; నేను మహనయీమునకు వెళ్లుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యొర్దాను నదియొద్దకు దిగి రాగా–యెహోవాతోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసితిని. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ఇంకా బెన్యామీనీయుడు, గెరా కొడుకు, బహూరీము ఊరివాడు షిమీ నీ దగ్గర ఉన్నాడు. నేను మహనయీముకు వెళ్తుండగా అతడు నన్ను ఘోరంగా దూషించాడు. నన్ను ఎదుర్కోడానికి అతడు యొర్దాను నది దగ్గరికి దిగి వచ్చినప్పుడు, ‘యెహోవా జీవం తోడు, కత్తితో నేను నిన్ను చంపను’ అని ప్రమాణం చేశాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 “గెరా కుమారుడగు షిమీ నీవద్దనే వున్నట్లు నీవు గమనించాలి. ఇతడు బెన్యామీనీయుడు. బహూరీముపురవాసి. నేను మహనయీముకు వెళ్లిన రోజున ఇతడు నాకు వ్యతిరేకంగా చాలా చెడు మాటలు మాట్లాడాడు. ఇతడు మరల యోర్థాను నది వద్ద నన్ను కలవటానికి వచ్చాడు. నేను యెహోవా ముందు ప్రమాణం చేసి షిమీని నేను చంపనని చెప్పాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 “బాగా గుర్తుంచుకో, నేను మహనయీముకు పారిపోయే రోజు, బహూరీము వాడైన బెన్యామీనీయుడు, గెరా కుమారుడైన షిమీ నన్ను ఘోరంగా శపించాడు. అతడు నన్ను కలుసుకోడానికి యొర్దాను నది దగ్గరకు వచ్చినప్పుడు, నేను యెహోవా పేరిట ‘నేను నిన్ను కత్తితో చంపను’ అని అతనికి ప్రమాణం చేశాను. အခန်းကိုကြည့်ပါ။ |