Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 కొరింథీ 4:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 ఈ కారణంగా, ప్రభువులో నమ్మకమైనవాడు నేను ప్రేమించే నా కుమారుడైన తిమోతిని మీ దగ్గరకు పంపాను. ప్రతి సంఘంలో ప్రతిచోట నేను బోధించిన దానితో ఏకీభవించే యేసు క్రీస్తులో నా జీవన విధానాన్ని అతడు మీకు జ్ఞాపకం చేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 ఇందునిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 అందుకే ప్రభువులో నాకు ప్రియమైన, నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ దగ్గరికి పంపాను. అతడు నేను ఏ విధంగా ప్రతి స్థలంలో, ప్రతి సంఘంలో ఏమి బోధిస్తున్నానో, వాటిని క్రీస్తులో ఏ విధంగా అనుసరిస్తున్నానో, మీకు జ్ఞాపకం చేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 ఈ కారణంగా నాకు ప్రియమైన నా కుమారునిలాంటి తిమోతిని, మీ దగ్గరకు పంపుతున్నాను. తిమోతి ప్రభువు ప్రేమించిన కుమారుడు. అతడు యేసు క్రీస్తుతో నేను సాగిస్తున్న జీవిత విధానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను ఈ జీవిత విధానాన్ని గురించి ప్రతి సంఘంలో బోధిస్తుంటాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 ఈ కారణంగా, ప్రభువులో నమ్మకమైనవాడు నేను ప్రేమించే నా కుమారుడైన తిమోతిని మీ దగ్గరకు పంపాను. ప్రతి సంఘంలో ప్రతిచోట నేను బోధించిన దానితో ఏకీభవించే యేసు క్రీస్తులో నా జీవన విధానాన్ని అతడు మీకు జ్ఞాపకం చేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

17 ఈ కారణంగా, ప్రభువులో నమ్మకమైనవాడు నేను ప్రేమించే నా కుమారుడైన తిమోతిని మీ దగ్గరకు పంపాను. ప్రతి సంఘంలో ప్రతిచోట నేను బోధించిన దానితో ఏకీభవించే యేసుక్రీస్తులో నా జీవన విధానాన్ని అతడు మీకు జ్ఞాపకం చేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 కొరింథీ 4:17
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

దుష్టులైన దూతలు కీడు చేయడానికి లోబడతారు, నమ్మకమైన రాయబారులు స్వస్థత కలిగిస్తారు.


అయితే నా సేవకుడైన మోషే విషయంలో ఇలా కాదు; అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్థుడు.


“యజమాని తన ఇంట్లోని పనివారికి తగిన సమయాల్లో భోజనం పెట్టి, వారిని పర్యవేక్షించడానికి వారిపై పర్యవేక్షకునిగా నియమించడానికి, నమ్మకమైన, జ్ఞానం కలిగిన సేవకుడు ఎవడు?


“అతని యజమాని అతనితో, ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా! నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు; కాబట్టి నిన్ను అనేక వాటి మీద నియమిస్తాను. వచ్చి నీ యజమాని సంతోషంలో పాలుపొందు’ అని అతనితో చెప్పాడు.


“అతని యజమాని అతనితో, ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా! నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు; కాబట్టి నిన్ను అనేక వాటి మీద నియమిస్తాను. వచ్చి నీ యజమాని సంతోషంలో పాలుపొందు’ అని అతనితో చెప్పాడు.


పౌలు దెర్బేకు వచ్చి అక్కడినుండి లుస్త్రకు వచ్చాడు, అక్కడ తిమోతి అనే పేరుగల విశ్వాసిని కలుసుకున్నాడు. అతని తల్లి క్రీస్తును విశ్వాసించిన యూదురాలు తండ్రి గ్రీసు దేశస్థుడు.


కాని, ఎవరైనా దీని గురించి వాదించాలనుకుంటే, మనలో గాని దేవుని సంఘంలో గాని మరి ఏ ఇతర ఆచారం లేదని గ్రహించాలి.


మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, మీకు నేను మీకు అప్పగించిన సంప్రదాయాలను అలాగే కొనసాగిస్తున్నందుకు నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను.


ఒకవేళ, మీరు ఒకచోట సమావేశమైనప్పుడు మీరు దేవుని తీర్పుకు గురి కాకుండా ఎవరికైనా ఆకలిగా ఉంటే వారు ఇంటి దగ్గరే ఏదైనా తినాలి. నేను అక్కడికి వచ్చినపుడు మరిన్ని సూచనలు ఇస్తాను.


అలాగే పరిశుద్ధుల సంఘాలన్నిటిలో దేవుడు సమాధానాన్ని కలిగిస్తారే తప్ప అల్లరిని కాదు.


ప్రభువు ప్రజల కోసం కానుక పోగుచేయడం గురించి గలతీయలోని సంఘాలకు నేను ఏమి చేయమని చెప్పానో మీరు కూడా అది చేయాలి.


తిమోతి వచ్చినప్పుడు అతడు మీ దగ్గర నిర్భయంగా ఉండేలా చూడండి. నాలాగే అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు.


మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు కానీ, నా ప్రియమైన పిల్లలుగా మిమ్మల్ని హెచ్చరించాలని ఈ మాటలు వ్రాస్తున్నాను.


క్రీస్తులో మీకు పదివేలమంది ఉపదేశకులు ఉన్నా, తండ్రులు అనేకులు లేరు. కాబట్టి క్రీస్తు యేసులో సువార్త ద్వారా నేను మీకు తండ్రినయ్యాను.


ఆ బాధ్యతను పొందినవారు నమ్మకమైనవారిగా రుజువుపరచుకోవటం చాలా అవసరము.


ప్రభువు ప్రతిఒక్కరికి ఏ స్థితి నియమించారో, దేవుడు అందరిని ఏ స్థితిలో పిలిచారో ఆ స్థితిలోనే విశ్వాసిగా జీవించాలి. ఇదే నియమాన్ని అన్ని సంఘాలకు నియమిస్తున్నాను.


కన్యల గురించి ప్రభువు నుండి నాకు ఆజ్ఞ లేదు గాని, ప్రభువు కృప చేత నమ్మకమైన వానిగా నేను ఒక ఆలోచన చెప్తున్నాను.


సువార్త పరిచర్య చేయడంలో సంఘాలన్నింటిలో ప్రసిద్ధి చెందిన సోదరుని కూడా అతనితో పంపుతున్నాను.


ప్రియ సహోదరుడు, ప్రభువులో నమ్మకమైన సేవకుడు, తుకికు, నేను ఎలా ఉన్నానో ఏం చేస్తున్నానో మీరు కూడా తెలుసుకోవడానికి అన్ని విషయాలను మీకు చెప్తాడు.


మీరు ఎలా ఉన్నారో నేను కూడా తెలుసుకుని సంతోషించాలని, ప్రభువైన యేసులో తిమోతిని త్వరలో మీ దగ్గరకు పంపాలని నేను అనుకుంటున్నాను.


తిమోతి యోగ్యుడని మీకు తెలుసు, ఎందుకంటే ఒక కుమారుడు తన తండ్రికి సేవ చేసినట్లుగా సువార్త పనిలో అతడు నాతో కలిసి సేవ చేశాడు.


మా ప్రియ తోటి సేవకుడైన ఎపఫ్రా నుండి వీటిని మీరు నేర్చుకున్నారు, అతడు మా విషయంలో క్రీస్తు యొక్క నమ్మకమైన పరిచారకుడు.


అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిము వస్తున్నాడు, అతడు మీలో ఒకడు. ఇక్కడి సంగతులన్ని వారు మీకు తెలియజేస్తారు.


తిమోతీ, నా కుమారుడా! నీ గురించి ఇదివరకే చెప్పబడిన ప్రవచనాలు నెరవేరడానికి నేను ఈ ఆజ్ఞ నీకు ఇస్తున్నాను. నీవు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మంచి పోరాటాన్ని పోరాడు.


విశ్వాసంలో నాకు నిజ కుమారుడైన తిమోతికి వ్రాయునది: మన తండ్రియైన దేవుని నుండి, మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి నీకు కృపా కనికరం సమాధానాలు కలుగును గాక.


నా ప్రియ కుమారుడైన తిమోతికి వ్రాయునది: మన తండ్రియైన దేవుని నుండి, మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి నీకు కృపా కనికరం సమాధానాలు కలుగును గాక.


అనేకమంది సాక్షుల సమక్షంలో నేను నీకు నేర్పిన సంగతులను ఇతరులకు బోధించగల నమ్మకమైన వారికి అప్పగించు.


అయితే, నా బోధల గురించి, నా జీవిత విధానం, నా ఉద్దేశాలు, విశ్వాసం, ఓర్పు, ప్రేమ, దీర్ఘశాంతం,


నేను నిన్ను క్రేతులో విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం, ఇంకా పూర్తి చేయవలసిన వాటిని క్రమపరచి, ప్రతి పట్టణంలో సంఘ పెద్దలను నియమించు.


నీకు కలుగబోయే కష్టాలను గురించి భయపడవద్దు. నిన్ను శోధించడానికి అపవాది మీలో కొందరిని చెరసాలలో వేస్తాడు, కాబట్టి పది రోజులు హింస పొందుతారు అని తెలియజేస్తున్నాను. అయినా మరణం వరకు నమ్మకంగా ఉండండి. అప్పుడు నేను మీకు జీవాన్ని మీ విజయ కిరీటంగా బహూకరిస్తాను.


సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు నివసిస్తున్నావని నాకు తెలుసు. అయినా నా నామానికి నిజంగా కట్టుబడి ఉన్నావు. సాతాను నివసించే నీ పట్టణంలో నాకు నమ్మకమైన సాక్షిగా ఉన్న అంతిప అనేవాడు హతసాక్షిగా చంపబడిన దినాల్లో కూడ నాలో నీ విశ్వాసాన్ని వదలకుండా ఉన్నావు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ