Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 దిన 6:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

33 తమ కుమారులతో కలిసి సేవ చేసినవారు వీరు: కహాతీయుల నుండి: సంగీతకారుడైన హేమాను, హేమాను యోవేలు కుమారుడు, అతడు సమూయేలు కుమారుడు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

33 ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కని పెట్టుచున్నవారెవరనగా, కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను; ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

33 ఈ విధంగా వీళ్ళు తమ కొడుకులతో కలసి పరిచర్య చేసినవాళ్ళు. కహాతీయుల కొడుకుల్లో గాయకుడైన హేమాను. ఇతను సమూయేలు కొడుకైన యోవేలుకి పుట్టాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

33 సంగీత సేవ చేసిన వారు, వారి కుమారుల పేర్ల వివరాలు ఇలా వున్నాయి: కహతీయుల సంతతి వారు: హేమాను గాయకుడు. హేమాను తండ్రి పేరు యోవేలు. యోవేలు తండ్రి పేరు సమూయేలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

33 తమ కుమారులతో కలిసి సేవ చేసినవారు వీరు: కహాతీయుల నుండి: సంగీతకారుడైన హేమాను, హేమాను యోవేలు కుమారుడు, అతడు సమూయేలు కుమారుడు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 దిన 6:33
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాబట్టి లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును నియమించారు; అతని బంధువుల్లో బెరెక్యా కుమారుడైన ఆసాపు; వారి బంధువులైన మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతాను;


సంగీతకారులైన హేమాను, ఆసాపు, ఏతానులు ఇత్తడి తాళాలను వాయించాలి;


అతడు ఇశ్రాయేలు నాయకులందరిని, యాజకులను, లేవీయులను సమకూర్చాడు.


నాలుగు వేలమంది ద్వారపాలకులుగా ఉండాలి, నాలుగు వేలమంది ఉద్దేశ్యం కలిగి నేను చేయించిన సంగీత వాయిద్యాలతో యెహోవాను కీర్తించాలి” అని చెప్పాడు.


సమూయేలు కుమారులు: మొదటివాడు యోవేలు రెండవవాడు అబీయా.


సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరాన్ని కట్టించేవరకు, వీరు సమావేశ గుడారం ఎదుట సంగీత సేవ చేశారు. వారికి ఇచ్చిన నియమాల ప్రకారం తమ విధులు నిర్వహించేవారు.


అతడు ఎల్కానా కుమారుడు, అతడు యెరోహాము కుమారుడు, అతడు ఎలీయేలు కుమారుడు, అతడు తోయహు కుమారుడు,


హేమాను సంతతి నుండి: యెహీయేలు, షిమీ, యెదూతూను సంతతి నుండి: షెమయా, ఉజ్జీయేలు.


సంగీతకారులైన లేవీయులంతా, అంటే ఆసాపు, హేమాను, యెదూతూను, వారి కుమారులు, బంధువులు సన్నని నారబట్టలను ధరించి తాళాలు, తంతి వాయిద్యాలు, స్వరమండలాలు చేతపట్టుకుని బలిపీఠానికి తూర్పు వైపున నిలబడి ఉన్నారు. వారితో కలిసి బూరల ధ్వని చేయడానికి నూట ఇరవైమంది యాజకులు ఉన్నారు.


యెహోవా, మీరు నన్ను రక్షించే దేవుడు; రాత్రింబగళ్ళు నేను మీకు మొరపెడతాను.


“లేవీ గోత్రం వారిని తీసుకువచ్చి యాజకుడైన అహరోనుకు సహాయం చేయడానికి అతని ఎదుట నిలబెట్టు.


లేవీయులను అహరోనుకు అతని కుమారులకు అప్పగించు; వారు సంపూర్ణంగా అతని స్వాధీనం చేయబడిన ఇశ్రాయేలీయులు.


రామతాయిముకు చెందిన ఒక వ్యక్తి ఉండేవాడు, అతడు ఎఫ్రాయిం కొండ సీమలోని ఒక సూఫీయుడు, అతని పేరు ఎల్కానా, అతని తండ్రి యెరోహాము. యెరోహాము ఎలీహు కుమారుడు, ఎలీహు తోహు కుమారుడు. తోహు ఎఫ్రాయిమీయుడైన సూఫు కుమారుడు.


అలా కొంతకాలం గడిచాక హన్నా గర్భవతియై ఒక కుమారుని కన్నది. “నేను అతని కోసం యెహోవాను అడిగాను” అని అంటూ ఆమె అతనికి సమూయేలు అని పేరు పెట్టింది.


కాబట్టి ఇప్పుడు నేను ఈ బిడ్డను తిరిగి యెహోవాకు ఇస్తున్నాను. వాడు జీవించినంత కాలం యెహోవాకు ప్రతిష్ఠితుడై ఉంటాడు” అని చెప్పింది. అప్పుడు ఆ చిన్నవాడు అక్కడే యెహోవాను ఆరాధించాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ