1 దిన 5:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 ఇంకా చాలామంది శత్రువులను చంపారు ఎందుకంటే ఆ యుద్ధం దేవునిది. చెరకు వెళ్లేవరకు వారు అక్కడే నివసించారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుటచేత శత్రువులు అనేకులు పడిపోయిరి; తాము చెరతీసికొని పోబడువరకు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రమువారును వీరి స్థానములయందు కాపురముండిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 దేవుడు యుద్ధంలో వారికి సహాయం చేశాడు గనుక వాళ్ళు అనేక మందిని హతమార్చారు. తరువాత కాలంలో చెరలోకి వెళ్ళేంత వరకూ రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్థగోత్రం వాళ్ళంతా హగ్రీ జాతి వాళ్ళ దేశంలోనే నివాసం ఉన్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్22 యుద్ధంలో రూబేనీయులకు దేవుని సహాయం ఉన్న కారణంగా హగ్రీయులలో చాలామంది చనిపోయారు. అప్పుడు మనష్షే, రూబేను, గాదు వంశీయులు హగ్రీయుల రాజ్యంలో నివసించసాగారు. వారక్కడ బబులోను (బాబిలోనియా) సైన్యం ఇశ్రాయేలు ప్రజలను బందీలుగా బబులోనుకు పట్టుకుపోయే సమయం వరకు నివసించారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 ఇంకా చాలామంది శత్రువులను చంపారు ఎందుకంటే ఆ యుద్ధం దేవునిది. చెరకు వెళ్లేవరకు వారు అక్కడే నివసించారు. အခန်းကိုကြည့်ပါ။ |