Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 దిన 3:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 యెహోయాకీము వారసులు: యెహోయాకీను, అతని సోదరుడు సిద్కియా.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను, అతని కుమారుడు సిద్కియా.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 యెహోయాకీము కొడుకు యెకొన్యా. అతని కొడుకు సిద్కియా ఆఖరి రాజు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 యెహోయాకీము సంతానంలో అతని కుమారుడు యెకొన్యా, అతని కుమారుడు సిద్కియా వున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 యెహోయాకీము వారసులు: యెహోయాకీను, అతని సోదరుడు సిద్కియా.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 దిన 3:16
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

బబులోను రాజు యెహోయాకీను పినతండ్రియైన మత్తన్యాను అతని స్థానంలో రాజుగా నియమించి, అతని పేరును సిద్కియా అని మార్చాడు.


యెహోయాకీము చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతని తర్వాత అతని కుమారుడైన యెహోయాకీను రాజయ్యాడు.


యెహోయాకీను రాజైనప్పుడు అతని వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు, అతడు యెరూషలేములో మూడు నెలలు పరిపాలించాడు. అతని తల్లి ఎల్నాతాను కుమార్తెయైన నెహుష్తా; ఈమె యెరూషలేము నగరవాసి.


యూదా రాజైన యెహోయాకీను బందీగా ఉన్న ముప్పై ఏడవ సంవత్సరం, పన్నెండవ నెల, ఇరవై ఏడవ రోజున ఆవిల్-మెరోదకు బబులోనుకు రాజైన సంవత్సరంలో, అతడు యూదా రాజైన యెహోయాకీనును చెరసాల నుండి విడిపించాడు.


యోషీయా కుమారులు: మొదటి కుమారుడు యోహానాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాలుగవవాడు షల్లూము.


ఖైదీగా ఉన్న యెహోయాకీను సంతానం: అతని కుమారుడు షయల్తీయేలు,


వారి పూర్వికుల దేవుడైన యెహోవా తన ప్రజల మీద, తన నివాసస్థలం మీద జాలిపడి, వారికి తన దూతల ద్వారా పదే పదే సందేశాలు పంపించారు.


యెహోయాకీను రాజైనప్పుడు అతని వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు, అతడు యెరూషలేములో మూడు నెలల పది రోజులు పరిపాలించాడు. అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.


“నా జీవం తోడు” అని యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “యూదా రాజైన యెహోయాకీము కుమారుడవైన యెహోయాకీనూ, నీవు నా కుడిచేతి ముద్ర ఉంగరంగా ఉన్నా, నేను నిన్ను పీకేస్తాను.


ఈ యెహోయాకీను హేయమైన పగిలిన కుండ వంటివాడా, ఎవరూ కోరుకోని వస్తువా? అతడు అతని పిల్లలు విసిరివేయబడి, వారికి తెలియని దేశంలోకి త్రోసివేయబడతారు?


యోషీయా కుమారుడైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరు యూదాకు రాజుగా నియమించాడు. అతడు యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను స్థానంలో రాజయ్యాడు.


యోషీయా కుమారులెవరనగా యెకొన్యా అతని తమ్ముళ్ళు. యూదులు బబులోను పట్టణానికి బందీలుగా కొనిపోబడిన కాలంలో వీరు పుట్టారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ