1 దిన 22:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 ఇప్పుడు మనసారా మీ దేవుడైన యెహోవాను వెదకండి. యెహోవా నిబంధన మందసాన్ని, దేవుని సంబంధమైన పవిత్ర వస్తువులను, ఆయన పేరున కట్టబడే మందిరంలోకి చేర్చేటట్టు మీరు దేవుడైన యెహోవా పరిశుద్ధాలయాన్ని కట్టడం మొదలుపెట్టండి.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనస్సులు దృఢపరచుకొని, ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామముకొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 కాబట్టి, హృదయపూర్వకంగా మీ దేవుడు యెహోవాను కోరుకోడానికి మీ మనస్సులు దృఢపరచుకుని, ఆయన నిబంధన మందసాన్ని, దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణాలను, ఆయన పేరు కోసం కట్టే ఆ మందిరంలోకి చేర్చడానికి మీరు పూనుకుని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలాన్ని కట్టండి” అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్19 యెహోవా సంకల్పం నెరవేరటానికి మీరంతా హృదయపూర్వకంగా ఆయనకు అంకితమవ్వండి. యెహోవా దేవునికి పవిత్ర ఆలయాన్ని నిర్మించండి. యెహోవా పేరున ఆలయ నిర్మాణం చేయండి. పిమ్మట ఒడంబడిక పెట్టెను, ఇతర పవిత్ర పరికరాలను ఆలయంలోకి తీసుకురండి.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 ఇప్పుడు మనసారా మీ దేవుడైన యెహోవాను వెదకండి. యెహోవా నిబంధన మందసాన్ని, దేవుని సంబంధమైన పవిత్ర వస్తువులను, ఆయన పేరున కట్టబడే మందిరంలోకి చేర్చేటట్టు మీరు దేవుడైన యెహోవా పరిశుద్ధాలయాన్ని కట్టడం మొదలుపెట్టండి.” အခန်းကိုကြည့်ပါ။ |
“సొలొమోనూ, నా కుమారుడా! నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధిస్తారు, ఆలోచనల ఉద్దేశాలన్నిటిని గ్రహిస్తారు కాబట్టి నీవు ఆయనను తెలుసుకుని పూర్ణహృదయంతో చిత్తశుద్ధితో ఆయనను సేవించు. నీవు ఆయనను వెదికితే, ఆయన నీకు దొరుకుతారు; అయితే నీవు ఆయనను విడిచిపెడితే, ఆయన నిన్ను శాశ్వతంగా తిరస్కరిస్తారు.