1 దిన 19:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 దావీదుకు తాము కోపం తెప్పించామని అమ్మోనీయులు గ్రహించి, హానూను అమ్మోనీయులు వేయి తలాంతుల వెండిని పంపి అరాము నహరయీము నుండి, అరాము మయకా నుండి, సోబా నుండి రథాలను, రథసారధులను కిరాయికి తీసుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 అమ్మోనీయులు దావీదునకు తమయందు అసహ్యము పుట్టించితిమని తెలిసికొనినప్పుడు హానూనును అమ్మోనీయులును అరామ్నహరాయిము నుండియు, సిరియా మయకానుండియు సోబానుండియు రథములను గుఱ్ఱపురౌతులను రెండువేల మణుగుల వెండి ఇచ్చి బాడిగెకు కుదుర్చుకొనిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అమ్మోనీయులు తమ పట్ల దావీదుకు అసహ్యం కలిగేలా చేసుకున్నాం అని గ్రహించారు. హానూనూ, అమ్మోనీయులూ రెండు వేల మణుగుల వెండి ఇచ్చి అరామ్నహరయీము నుంచి, ఆరాము మయకా నుంచి, సోబా నుంచి, రథాలను, గుర్రపు రౌతులను కిరాయికి తెచ్చుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్6 ఇది జరిగిన పిమ్మట అమ్మోనీయులు తాము దావీదుకు బద్ధశత్రువులైనట్లు గుర్తించారు. దానితో హానూను, అమ్మోనీయులు డెబ్బై ఐదువేల పౌనుల (రెండువేల మణుగులు) వెండిని వెచ్చించి మెసపొతేమియా (అరామ్నహరయీము) నుండి రథాలను, రథసారధులను కొన్నారు. వారింకా అరాములోని మయకా, సోబా నగరాల నుండి కూడ రథాలను, వాటిని తోలే వారిని సేకరించారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 దావీదుకు తాము కోపం తెప్పించామని అమ్మోనీయులు గ్రహించి, హానూను అమ్మోనీయులు వేయి తలాంతుల వెండిని పంపి అరాము నహరయీము నుండి, అరాము మయకా నుండి, సోబా నుండి రథాలను, రథసారధులను కిరాయికి తీసుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |