Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 దిన 18:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 దావీదు మోయాబీయులను కూడా ఓడించాడు, వారు లొంగిపోయి అతనికి కప్పం చెల్లించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 అతడు మోయాబీయులను జయించగా వారు దావీదునకు కప్పముకట్టు దాసులైరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 తరువాత అతడు మోయాబీయులను జయించగా వాళ్ళు దావీదుకు కప్పం కట్టి దాసోహమయ్యారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 పిమ్మట దావీదు మోయాబు దేశాన్ని ఓడించాడు. మోయాబీయులు దావీదుకు దాసులయ్యారు. వారు బంగారం, ఇతర కానుకలను దావీదుకు కప్పంగా చెల్లించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 దావీదు మోయాబీయులను కూడా ఓడించాడు, వారు లొంగిపోయి అతనికి కప్పం చెల్లించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 దిన 18:2
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

అలాగే దావీదు మోయాబీయులను కూడా ఓడించాడు. అతడు పట్టుకున్న వారిని నేలపై పడుకోబెట్టి త్రాడుతో వారిని కొలిపించాడు. అతడు వారిలో ప్రతి రెండు త్రాళ్ల పొడవున్న వారిని చంపి, మూడవ తాడు కొలతలో ఉన్నవారిని బ్రతకనిచ్చాడు. కాబట్టి మోయాబీయులు దావీదుకు లోబడి అతనికి కప్పం చెల్లించారు.


ఆమె ఒంటెల మీద సుగంధ ద్రవ్యాలను, చాలా బంగారం, వెలగల రాళ్లు ఎక్కించి, గొప్ప పరివారంతో బయలుదేరి యెరూషలేముకు చేరింది. ఆమె సొలొమోను దగ్గరకు వచ్చి, తన మనస్సులో ఉన్నదంతా చెప్పింది.


ప్రతీ సంవత్సరం అతని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరూ కానుకలుగా వెండి పాత్రలు, బంగారు పాత్రలు, వస్త్రాలు, యుద్ధాయుధాలు, సుగంధద్రవ్యాలు, గుర్రాలు, కంచరగాడిదలు తెచ్చేవారు.


కాలక్రమేణా దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోబరచుకున్నాడు, వారి ఆధీనంలో నుండి గాతును, దాని చుట్టూ ఉన్న గ్రామాలను స్వాధీనం చేసుకున్నాడు.


అంతేకాక, సోబా రాజైన హదదెజెరు యూఫ్రటీసు నది వరకు తన స్థూపాన్ని నిలబెట్టడానికి బయలుదేరినప్పుడు హమాతు పరిసరాల్లో దావీదు అతన్ని ఓడించాడు.


మోయాబు నా కాళ్లు కడుక్కునే పళ్లెం, ఎదోము మీద నా చెప్పు విసిరివేస్తాను, ఫిలిష్తియా గురించి విజయధ్వని చేస్తాను.”


వారు పడమటి వైపు ఫిలిష్తీయ వాలుల మీద దూకుతారు; వారు కలిసి తూర్పు ప్రజలను దోచుకుంటారు. వారు ఎదోమును, మోయాబును లోబరచుకుంటారు, అమ్మోనీయులు వారికి లోబడతారు.


ఎడారి వైపు ఉన్న సెల నుండి దేశాన్ని పాలించేవానికి కప్పంగా గొర్రెపిల్లలను సీయోను కుమార్తె పర్వతానికి పంపండి.


“అతన్ని చూస్తాను, కానీ ఇప్పుడు కాదు; అతన్ని కనిపెడతాను, కానీ సమీపంగా కాదు. యాకోబు నుండి నక్షత్రం వస్తుంది; ఇశ్రాయేలు నుండి రాజదండం లేస్తుంది. అతడు మోయాబు కణతలను నలగ్గొడతాడు, షేతు ప్రజల కపాలాలను చితకగొడతాడు.


అయితే పనికిమాలినవారు కొందరు, “ఈ వ్యక్తి మనలను ఎలా రక్షించగలడు?” అని అంటూ అతన్ని తృణీకరించి అతనికి కానుకలు తీసుకురాలేదు. అయినా సౌలు మౌనంగా ఉన్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ